డెత్ మిస్టరీ: సుశాంత్ సింగ్ మరణం వెనుక ఏం జరిగింది.?

 డెత్ మిస్టరీ: సుశాంత్ సింగ్ మరణం వెనుక ఏం జరిగింది.?

Sushant Singh Rajput Death Mystery Rhea Chakraborty

మనిషి జీవితం ఎంతో విలువైంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేం. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం (Sushant Singh Rajput Death Mystery Rhea Chakraborty), అస్సలేమాత్రం ఎవ్వరూ సమర్ధించని విషయం. అందుకే ఆత్మ హత్య మహా పాపం అని పెద్దలు చెబుతారు. అవును ప్రాణం తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రాణం నీదే కావచ్చు.. కానీ, ఆ ప్రాణాన్ని తీసే హక్కు నీక్కూడా లేదంటాడు ఓ మహా కవి.

పరిచయం అక్కర్లేని పేరది. బాలీవుడ నటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) చనిపోయి రోజులు, నెలలు గడిచిపోయాయి. ఎందుకు చచ్చిపోయాడు.? ఎలా చచ్చిపోయాడు.? అన్న ప్రశ్నలకు సమాధానం నేటికీ దొరకలేదు.

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) మోసం చేయడం వల్లే ఆత్మ హత్య చేసుకున్నాడన్నారు. కాదు. ఎవరో చంపేసి, ఆత్మ హత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారనీ అన్నారు. పోలీసులు గట్టిగా తలచుకుంటే, క్షణాల్లో ఛేధించగల కేసు ఇది. నెపోటిజం వైపు మళ్లింది, డ్రగ్స్ రచ్చకి దారి తీసింది. అంతే కానీ, సుశాంత్ ఎవరి కారణంగా చనిపోయాడు.? అన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు.

Sushant Singh Rajput Rhea Chakraborty

సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవల్సిన విషయమిది. వ్యవస్థలు ఏం చేస్తున్నాయ్.. నో ఆన్సర్. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఓ యంగ్ హీరో కేవలం సినిమా అవకాశాలు తగ్గాయని ఆత్మ హత్య చేసుకుంటాడా.? అతనికి మానసిక సమస్యలుంటే, అంతలా మంచి మంచి సినిమాలు చేయగలుగుతాడా.? పబ్బులు, పార్టీలంటూ ఎంజాయ్ చేస్తాడా.? అన్నింటికీ మించి కోట్లు సంపాదించగలుగుతాడా.? అసలు ఆ డబ్బు ఏమైపోయింది.? సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బు ఎవరెవరికి చేరింది.? ఏమో.. ఎవరికీ తెలీదు.

రియా చక్రవర్తి అమాయకురాలనీ సర్టిఫికెట్ ఇవ్వలేం. ఆమె దోషి అని కూడా జడ్జిమెంట్ ఇవ్వలేం. విచారణ జరగాలి. అదీ వేగంగా జరగాలి. దోషి ఎవరన్నది తేలాలి. ఓ ప్రముఖ యువ నటుడి అనుమానాస్పద మరణం యావత్ దేశాన్ని కదిలించింది. కేసు విచారణ చేపడుతున్న పోలీసుల్ని మాత్రం కదిలించలేకపోతోంది. ఎందకు.? ఏ పెద్దల హస్తం ఈ డెత్ మిస్టరీ (Sushant Singh Rajput Death Mystery Rhea Chakraborty) వెనక ఉంది.? ఏమో, ఆ పైవాడికే ఎరుక.

సుశాంత్ మరణించి ఏడాది కావడంతో.. తన మనసులోని ఆవేదనను అక్షర రూపంలోకి మార్చి, సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పూరిత పోస్ట్ పెట్టింది రియా చక్రవర్తి.

“There isn’t a moment where I believe that you aren’t here anymore.
They said that time heals everything but you were my time and my everything.
I know that you are my guardian angel now -watching me with your telescope from the moon and protecting me.
I wait for you everyday to come pick me up, I look for you everywhere – I know you’re here with me ❤️
It breaks me everyday, then I think of you saying –“ you’ve got this bebu” and I carry on to the next day.
A barrage of emotions cross my body everytime I think of you not being here .
My heart aches to write this , my heart aches to feel anymore..

There is no life without you ,you took the meaning of it with you.
This void cannot be filled..
Without you , I’m standing still..
My sweet sunshine boy , I promise to give you ‘Malpua ‘everyday and read all the quantum physics books in this world- please come back to me 🙏

I miss you my best friend,my man ,my love..
Bebu and putput forever

♾ +1 My Whole heart❤ “

అంటూ ముగించింది రియా చక్రవర్తి.

Digiqole Ad

Related post