స్వీట్ అండ్ స్పెషల్ సమంత.!

కేరళ కుట్టి జెస్సీగా తెలుగు తెరకు పరిచయమైంది సమంత అక్కినేని (Samantha Akkineni). తమిళ, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, హీరోయిన్‌గా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటూ స్టార్‌డమ్ సంపాదించుకుంది. కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూసింది. ఫ్లాప్‌లు వచ్చినప్పుడు పనైపోయింది అని అందరూ వెటకారం చేసినా, బౌన్స్‌బ్యాక్ అయ్యే సత్తా తనలో ఉందనే విశ్వాసం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు.
ఎప్పటికప్పుడు తానేంటో నిరూపించుకుంటూనే ఉందామె. సినిమాలతోనే కాదు, సినిమా హీరోతోనూ ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఓ పెద్ద సినీ కుటుంబానికి కోడలిగా వెళ్లింది. అత్తయ్యా, మావయ్యా, మరిది అందరూ సినీ రంగానికి చెందిన వారే. పెళ్లయ్యింది కదా, సినిమా కెరీర్ ముగిసిపోయినట్లే అని అంతా అనుకున్నారు కానీ, పెళ్లయ్యాక సినిమాల్లో మరింత జోరు పెంచింది.
స్ట్రాంగ్ స్ట్రాంగర్ స్ట్రాంగెస్ట్ సమంత (Samantha Akkineni).. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఆమె డైనమిక్. అసలు సమంత ఎలా స్ట్రాంగెస్ట్ అయ్యింది.? అని ఆలోచిస్తే ఆమె తనంతట తానే స్ట్రాంగెస్ట్ అని ప్రకటించేసుకుంది.
పెళ్ళి బలహీనత కానే కాదు..
పెళ్లి చేసుకోవడం అంటే బలహీనపడడం కాదు. ఇంకా స్ట్రాంగ్‌గా తయారవడం. వైవాహిక బంధంతో నేనింకా స్ట్రాంగ్ అయ్యాను. అంతలా నాకు నా భర్త నుండీ, మావయ్య నుండీ సపోర్ట్ లభించింది. ఓ పెద్ద కుటుంబంలోకి వెళ్లడం ద్వారా నేనింకా బలవంతురాల్ని అయ్యాను అని చెప్పింది సమంత. తన కొత్త సినిమా ‘యూటర్న్’ ప్రమోషన్స్‌లో భాగంగా ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత ఇచ్చిన సమాధానాల సారాంశమిది.
‘రంగస్థలం’, ‘మహానటి’ తదితర సినిమాలు అందులో సమంత పోషించిన పాత్రలను పరిగణలోకి తీసుకుంటే, ఆ పాత్రల తీరుతెన్నులు పరిశీలిస్తే, పెళ్లయ్యాక సమంత డెసిషన్ మేకింగ్‌లో ఎంత స్ట్రాంగ్ అయ్యిందనేది అర్ధమవుతుంది. విశాల్‌తో చేసిన తమిళ సినిమా ‘అభిమన్యుడు’ కావచ్చు.
ఇప్పుడు చేస్తున్న ‘యూటర్న్’ కావచ్చు.. సమంత ఎంచుకుంటున్న సినిమాలు ఇప్పటిదాకా ఆమెలో కనిపించని కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. ‘యూటర్న్’ సినిమా అయితే సమంత ఇంతకు ముందెప్పుడూ చేయనిది. ప్రోమో అంత అద్భుతంగా ఉంది. ప్రోమో సంగతి పక్కన పెడితే, ప్రమోషనల్ సాంగ్ ఇంకా డిఫరెంట్‌గా ఉంది.
అందం, అభినయం.. అన్నీ కలగలిస్తే సమంత..
సమంత (Samantha Akkineni) మంచి డాన్సర్. ఆ విషయం చాలా మందికి తెలుసు. కానీ ఆమె డాన్సింగ్ టాలెంట్ అందరికీ తెలిసేంత స్థాయిలో ఆమెకు డాన్స్ నెంబర్స్ పడలేదు. ‘యూటర్న్’ ప్రమోషనల్ సాంగ్‌లో సమంత కిర్రాక్ పుట్టించేలా డాన్స్ చేసేసింది.
మామూలుగా అయితే హీరోయిన్స్‌కి కెరీర్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. పదేళ్లకు పైబడి హీరోయిన్‌గా తమ ఉనికిని చాటుకుంటున్నారు చాలా మంది అందాల భామలు. ఆ లిస్టులో సమంత పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది.
కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం పెళ్లి ఆలోచనలు పక్కన పెడతారు. ఇంకొంత మంది అదే అవకాశాల కోసం వైవాహిక బంధాన్ని మధ్యలో వదులుకుంటారు. సమంత అలా కాదు. ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. సినిమాల్లో కొనసాగుతోంది. అవకాశాలు దక్కించుకుంటోంది. విజయాల్ని సొంతం చేసుకుంటోంది.
అందుకే ‘షి ఈజ్ స్పెషల్’ అని ప్రతి ఒక్కరూ ఆమె గురించి మాట్లాడుకోవడమే కాదు, సమంత స్ట్రాంగెస్ట్ అని అందరూ అనుకునేటట్లు చేయగలుగుతోంది. దటీజ్ సమంత అక్కినేని.!
