Sye Raa Narasimha Reddy First Review

‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్‌ రిపోర్ట్‌: బ్లాక్‌ బస్టర్‌

821 0

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సందడి పీక్స్‌కి చేరిపోయింది. హిందీ వెర్షన్‌కి అదిరిపోయే రిపోర్ట్స్‌ (Sye Raa Narasimha Reddy First Review) వస్తున్నాయి. ఓవర్సీస్‌ నుంచి అయితే ‘బ్లాక్‌ బస్టర్‌’ అన్న మాటకి ఏమాత్రం తక్కువ కాకుండా ‘టక్‌’ బయటకు వచ్చేసింది.

‘ఔట్‌ స్టాండింగ్‌.. మైండ్‌ బ్లోయింగ్‌..’ అనే మాటలు తప్ప, ఓ మోస్తరు మాటలు ఎక్కడా విన్పించడంలేదు. అస్సలేమాత్రం నెగెటివ్‌ టాక్‌ లేకుండా, ఫుల్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ హంగామా చేసేస్తోంది.

Also Read: ప్రివ్యూ: ‘సైరా నరసింహారెడ్డి’ న భూతో న భవిష్యతి

బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు ఆల్రెడీ నాలుగు ‘స్టార్స్‌’ని ‘రేటింగ్స్‌’ రూపంలో ఇచ్చేశారు. చాలా షార్ట్‌ రివ్యూలు, ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై మరో అద్భుతం.. అంటూ తేల్చేస్తున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి.. మరోసారి సత్తా చాటారనీ, తన స్టార్‌డమ్‌కి తిరుగులేదంటూ ఇంకోసారి నిరూపించారని షార్ట్‌ రివ్యూల్లో ప్రస్తావిస్తున్నారు.

ఇవన్నీ ఓ ఎత్తు అయితే, తమన్నా గురించి ప్రత్యేకంగా రివ్యూల్లో ప్రస్తావిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాకి సంబంధించిన మేజర్‌ హైలైట్స్‌లో ఒకటి అని తెలుస్తోంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, వార్‌ ఎపిసోడ్స్‌, ప్రీ క్లయిమాక్స్‌.. ఇవన్నీ వెండితెర అద్భుతాలేనని అంటున్నారు.

సురేందర్‌ రెడ్డి టేకింగ్‌, మెగాస్టార్‌ చిరంజీవి యాక్టింగ్‌, సాంకేతికంగా అత్యున్నతమైన విలువలు.. వీటన్నిటికీ మించి, నిర్మాత రామ్‌చరణ్‌ చేసిన ఖర్చు.. ఒకటేమిటి, అన్నీ హైలైట్స్‌ అని చెబుతున్నారు షార్ట్‌ రివ్యూలు, ప్రీ-టాక్‌లో.

ఇటీవలి కాలంలో ఇంత పాజిటివ్‌ టాక్‌, ఓవర్సీస్‌ నుంచి కావొచ్చు.. హిందీ వెర్షన్‌ నుంచి కావొచ్చు రావడం బహుశా ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy First Review) విషయంలోనే జరుగుతోందేమో.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు ముందే దసరా పండగ వచ్చేసింది. సంబరాలు ఆకాశ్నాంటేస్తున్నాయి. కంప్లీట్‌ రివ్యూ కోసం.. ఇదే స్పేస్‌లో ఎదురుచూస్తుండండి.

Related Post

pawan kalyan, vijay deverakonda, taxiwaala

పవన్‌ సారీ.. ‘ట్యాక్సీవాలా’ సవారీ.!

Posted by - November 20, 2018 0
సినిమాల్లో తిరిగి నటించాలన్న ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదంటూ సినీ నటుడు, జనసేన పార్టీ (Jana Sena Party) అధినేత పవన్‌కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించేశారు. రాజకీయాల్లో…

జక్కన్న కథ: డిసైడ్‌ చేసేది మీరే.!

Posted by - March 19, 2019 0
జక్కన్న రంగంలోకి దిగాడు. యంగ్‌ టైగర్‌ మీసం మెలేశాడు. మెగా పవర్‌ స్టార్‌ సత్తా చాటుతానంటున్నాడు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావ్‌.. ఇదీ తొలుత వర్కింగ్‌ టైటిల్‌…

రకుల్‌.. బీ కూల్‌.! అంత ఆవేశమైతే ఎలా.?

Posted by - August 7, 2019 0
ఇండియాలో మగాళ్ళు మాత్రమే స్మోకింగ్‌ చేస్తారా.? స్మోకింగ్‌ కారణంగా క్యాన్సర్‌ మగాళ్ళకు మాత్రమే వస్తుందా.? ఆడాళ్ళనే స్మోకింగ్‌ మీద ప్రశ్నిస్తారెందుకన్న ప్రశ్నలో అర్థం ఏమన్నా వుందా.? అసలెందుకీ…
Chiranjeevi Pawan Kalyan

చిరంజీవితమే.. ‘పవర్’ పరమాణువుకి స్ఫూర్తి.!

Posted by - August 21, 2019 0
అన్నదమ్ముల మధ్య గొడవలొచ్చాయట. పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవికి దూరమైపోయాడట. నాగబాబుకు పవన్‌ కళ్యాణ్‌ మీద విపరీతమైన ద్వేషం కలిగిందట. అన్నయ్య మీద ఆగ్రహంతో తన పవర్‌ చూపించాలనుకుంటున్నాడట…
Saaho Prabhas

ప్రభాస్‌ ‘డార్లింగ్‌’.. ఈసారి నమ్మొచ్చా.!

Posted by - August 18, 2019 0
ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటూ ప్రభాస్‌ (Saaho Prabhas Darling), ‘బాహుబలి’ సినిమా తర్వాత అభిమానులకు మాటిచ్చాడు.. కానీ, నిలబెట్టుకోలేకపోయాడు. ఈసారి మాటివ్వబోడట.. కానీ, ఏడాదికి రెండు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *