Sye Raa Review

‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: సినిమా ఎలా వుందంటే.!

426 0

అక్టోబర్‌ 2న విడుదల కానున్న ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది. అదేంటీ, అప్పుడే రివ్యూ వచ్చేయడమేంటి.? అసలు సినిమా ఎలా వుంది.? మెగాస్టార్‌ చిరంజీవి ఎలా చేశారు.?

‘బాహుబలి’ స్థాయిలో వుందా.? అంతకు మించి.. అనేలా వుందా.? చరణ్‌ నిర్మాణపు విలువల సంగతేంటి.? సురేందర్‌రెడ్డి టేకింగ్‌ ఏ రేంజ్‌లో వుంది.?

ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. వాటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా, ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది ‘సైరా నరసింహారెడ్డి’కి సంబంధించి. అదీ విదేశాల నుంచి అరబ్‌ దేశాల నుంచి ఫస్ట్‌ రివ్యూ ఈ మధ్య వచ్చేస్తోంది.

ఉమైర్‌ సంధు అనే ఫిలిం క్రిటిక్‌ యూఏఈలో సెన్సార్‌ సందర్భంగా సినిమా చూసేసి, సినిమాకి రివ్యూ ఇచ్చేస్తున్నాడు. ఈసారి కూడా అతనే ఫస్ట్‌ రివ్యూ ఇచ్చాడు. ఇంతకీ, ఉమైర్‌ సంధు ఏం చెప్పాడు.?

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ పెర్ఫామెన్స్‌..

మెగాస్టార్‌ చిరంజీవి నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారన్నది ఉమైర్‌ సంధు ట్వీట్‌ రివ్యూ సారాంశం. సైరా నరసింహారెడ్డి సినిమా కోసం లైఫ్‌ టైమ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారట మెగాస్టార్‌ చిరంజీవి.

150 సినిమాలు సాధించిన చిరంజీవి నటన గురించి ఇప్పుడు కొత్తగా ఎవరూ సర్టిఫై చేయాల్సిన పనిలేదు. కానీ, ఈ సినిమా మాత్రం చిరంజీవికి చాలా చాలా ప్రత్యేకం.

దాదాపు పదేళ్ళ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా చేసిన చిరంజీవి, అది కమర్షియల్‌ సినిమా కావడంతో.. చాలా తేలిగ్గా చేసుకుపోయారు. ఆ సినిమాని ఆయనెందుకు అప్పుడు చేశారో, ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది.

‘సైరా నరసింహారెడ్డి’ కోసమే, ముందుగా కమర్షియల్‌ సినిమా చేశారన్నమాట.

స్టాండింగ్‌ ఒవేషన్‌.. (Sye Raa Narasimha Reddy Review)

ఓవర్సీస్‌ స్క్రీనింగ్‌ ఆఫ్‌ సైరా నరసింహారెడ్డి పూర్తయ్యింది. మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. అనే స్థాయిలో సినిమా వుంది. ‘స్టాండింగ్‌ ఒవేషన్‌ బై మి..’ అంటూ ఒమైర్‌ సంధు భావోద్వేగానికి గురయ్యాడు.

అంతే కాదు, ‘బ్లాక్‌బస్టర్‌ హిట్‌..’ అని కూడా తేల్చేశాడు ఒమైర్‌ సంధు. ఇంకేముంది, మెగా ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో సందడి చేసేస్తున్నారిప్పుడు. ఒమైర్‌ సంధుకి థ్యాంక్స్‌ చెప్పేస్తున్నారు గుడ్‌ రివ్యూ ఇచ్చినందుకు.

ఉమైర్‌ సంధు చెబితే.. అంతేనా.!

ఉమైర్‌ సంధు రివ్యూలు చాలావరకు బాగానే వుంటాయి. కానీ, ఒక్కోసారి తేడా కొట్టేస్తుంటాయి కూడా. సో, ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేయలేం. మరోపక్క, సినిమాకి సెన్సార్‌ టాక్‌ చాలా బాగా విన్పిస్తోంది.

150 సినిమాలు చేసిన చిరంజీవి (Mega Star Chiranjeevi), వాటన్నిటితో సాధించిన పేరు ప్రఖ్యాతుల సంగతెలా వున్నా, ఈ సినిమాతో మాత్రం చరిత్రలో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకునే అవకాశాన్ని దక్కించుకున్నారని సెన్సార్‌ వర్గాలు అంటున్నాయి.

సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా భాటియా, సుదీప్‌, జగపతిబాబు, నిహారిక కొణిదెల తదితరులు కీలక పాత్రలు పోషించిన విషయం విదితమే.

Related Post

Sye Raa Narasimha Reddy First Review

‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్‌ రిపోర్ట్‌: బ్లాక్‌ బస్టర్‌

Posted by - October 2, 2019 0
‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సందడి పీక్స్‌కి చేరిపోయింది. హిందీ వెర్షన్‌కి అదిరిపోయే రిపోర్ట్స్‌ (Sye Raa Narasimha Reddy First Review) వస్తున్నాయి.…

మృగాళ్లకు ‘మీ టూ’తో మూకుతాడు.!

Posted by - October 16, 2018 0
అన్యాయం జరిగింది’ అని గళం విప్పలేని దుస్థితి. అవకాశాల పేరుతో శీలం దోచేసినా, పెదవి విప్పలేని దుర్ఘతి. అరవయ్యేళ్ల ముసలాడు 18 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడినా…
Sye Raa Trailer Review

ట్రైలర్‌ రివ్యూ: సైరా నరసింహారెడ్డి.. సై సైరా.!

Posted by - September 18, 2019 0
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా విడుదలకు ముందు రికార్డులకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Trailer Review), మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star…

వేటగాడు కౌశల్.. వేటాడేస్తాడు జాగ్రత్త.!

Posted by - September 24, 2018 0
ఒక్క రోజు కాదు, ఒక్క గంట చేతిలో ఫోన్‌ లేకపోతే ఇంకేమన్నా వుందా.? అలాంటిది, 100 రోజులకు పైగా కుటుంబ సభ్యుల్లేరు, స్నేహితుల్లేరు, చేతిలో మొబైల్‌ ఫోన్‌…

ప్రివ్యూ: శైలజారెడ్డి అల్లుడి ‘సత్తా’ ఎంతంటే.!

Posted by - September 12, 2018 0
తెలుగు తెరపై అత్తా – అల్లుళ్ళ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి.. అందులో చాలా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి కూడా. అందుకే అత్త – అల్లుడు కాన్సెప్ట్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *