Sye Raa Overseas Stamina

ఓవర్సీస్‌లో దుమ్ము లేపేస్తోన్న ‘సైరా’

284 0

ఎ – సెంటర్స్‌, బి – సెంటర్స్‌, సి – సెంటర్స్‌.. ఇలాంటి విభజనలేమీ మెగాస్టార్‌ చిరంజీవికి (Sye Raa Narasimha Reddy Review) తెలియవు. అన్ని సెంటర్లూ ఆయన సొంతం. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని మూడు దశాబ్ధాల పాటు, చిరంజీవి అనే పేరు శాసించేసింది.

ఓవర్సీస్‌ మార్కెట్‌ లెక్కల్లోకి వచ్చాక, అక్కడా దుమ్ము లేపేశారు చిరంజీవి (Mega Star Chiranjeevi). అదీ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’తో. బాక్సాఫీస్‌ స్టామినాకి నిలువెత్తు రూపం చిరంజీవి. అన్‌ డిస్‌ప్యూటెడ్‌ కింగ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా అంటే అది చిరంజీవి మాత్రమే.

ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేయడానికి మరోసారి సిద్ధమైపోయారు మెగాస్టార్‌ (Sye Raa Review). యంగ్‌ హీరోలకు ఫాలోయింగ్‌ అనూహ్యంగా కనిపిస్తున్న రోజులివి. సోషల్‌ మీడియా ఎఫెక్ట్‌ ఇది. కానీ, చిరంజీవి ఇక్కడా వయసు తగ్గించేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ ఎలాగైతే చిరంజీవికి ఫాలోయింగ్‌ ఉందో, అదే ఫాలోయింగ్‌.. అంతకు మించిన ఫాలోయింగ్‌ ఓవర్సీస్‌లో కనిపిస్తోంది.

ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌ కోసం ఎన్నారైలు సిద్ధమయ్యారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రీమియర్స్‌కి ప్రేక్షకులు పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు.

ఆ సునామీ (Sye Raa Narasimha Reddy Review) తాలూకు ఛాయలు అప్పుడే కనిపించేస్తున్నాయి.

అమెరికా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మెగా అభిమానులు ‘సైరా’కు వెల్‌కమ్‌ చెబుతూ తమదైన స్టైల్‌లో హంగామా చేస్తున్నారు. ర్యాలీలు, కార్లను వరుసగా నిలబెట్టి ‘సైరా’ టైటిల్‌ని డిజైన్‌ చేయడం వంటివి చాలా చాలా చేస్తున్నారు.

మెగా అభిమానానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. ఓవర్సీస్‌ వసూళ్లతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేయాలని దూసుకొస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’.. సై సై రా.! (Sye Raa Narasimha Reddy).

Related Post

Saaho Vs Sye Raa

‘సైరా’ వెర్సస్‌ ‘సాహో’ ఎవరి దమ్మెంత.?

Posted by - August 22, 2019 0
‘బాహుబలి’ రికార్డుల్ని ‘సాహో’ కొల్లగొడుతుందా.? నాన్‌ బాహుబలి అనే మాటకి ప్రబాస్‌ ‘సాహో’ తో చెల్లు చీటీ అంటాడా.? ‘సాహో’ని ఢీకొట్టే సత్తా ‘సైరా’కి ఉందా.? (Saaho…

జక్కన్న కథ: డిసైడ్‌ చేసేది మీరే.!

Posted by - March 19, 2019 0
జక్కన్న రంగంలోకి దిగాడు. యంగ్‌ టైగర్‌ మీసం మెలేశాడు. మెగా పవర్‌ స్టార్‌ సత్తా చాటుతానంటున్నాడు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావ్‌.. ఇదీ తొలుత వర్కింగ్‌ టైటిల్‌…

40 ఏళ్ళ ‘మెగా’ చిరంజీవితం.!

Posted by - September 22, 2018 0
మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi).. పరిచయం అక్కర్లేని పేరిది తెలుగు సినీ అభిమానులకి. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నారాయన. చిరంజీవి సినిమాలంటే..…
Saaho Rampage

‘సాహో’రే.. రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ర్యాంపేజ్‌ చూశారా.!

Posted by - September 2, 2019 0
‘సాహో’ (Saaho Rampage) సినిమా ఎలా వుంది.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. డిజాస్టర్‌ టాక్‌ తొలి రోజే దక్కించుకున్నా, ఆ టాక్‌ని బలాదూర్‌ అన్నారు సగటు సినీ అభిమానులు.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *