Sye Raa Surender Reddy

వన్‌ అండ్‌ ఓన్లీ.. ‘సైరా’ సురేందర్‌రెడ్డి.!

224 0

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) లాంటి భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కించడం ఎలా సాధ్యమయ్యింది.? అన్న ప్రశ్నకు దర్శకుడు సురేందర్‌ రెడ్డి (Sye Raa Surender Reddy) చెప్పిన సమాధానమేంటో తెలుసా.? ‘నా వెనుక చరణ్‌ వున్నాడన్న ధైర్యమే.. నన్ను ఈ సినిమా తెరకెక్కించేలా చేసింది’ అని.

చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమాకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే. తమిళ సినిమా ‘తనీ ఒరువన్‌’కి ‘ధృవ’ రీమేక్‌. తనకు రీమేక్‌ సినిమాలు చేయడం ఇష్టం వుండదనీ, అయితే చరణ్‌ కోసమే ఆ సినిమా చేశాననీ ఆ తర్వాత సురేందర్‌ రెడ్డి చెప్పాడు.

చరణ్‌తో స్ట్రెయిట్‌ సినిమా తీయాలని సురేందర్‌ రెడ్డి అనుకుంటే, ఏకంగా ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Review) సినిమాని సురేందర్‌ రెడ్డి చేతుల్లో పెట్టేశాడు చరణ్‌. తన హీరోనే తనకు ప్రొడ్యూసర్‌ అయితే ఆ దర్శకుడి ఆనందానికి ఆకాశమే హద్దు అన్నట్లుంటుంది పరిస్థితి.

ఓ తనయుడు, తన తండ్రి కోసం ఓ హిస్టారికల్‌ మూవీ తీయాలనుకున్నప్పుడు, ఆ బాధ్యత ఆషామాషీ వ్యవహారం కాదు.

అంత పెద్ద బాధ్యత మోయాలంటే, సురేందర్‌ రెడ్డికి (Sye Raa Surender Reddy)చాలా ధైర్యం వుండాలి. ఆ ధైర్యం కూడా మళ్ళీ రామ్‌చరణే అయ్యాడు.

తొలుత ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) విషయాన్ని సురేందర్‌ రెడ్డికి చరణ్‌ చెబితే, ఆ వెంటనే సురేందర్‌ రెడ్డి ఒప్పేసుకోలేదు.

‘కొంత టైమ్‌ నాకు కావాలి..’ అంటూ టైమ్‌ తీసుకుని.. బాగా ఆలోచించుకున్నాకే, ‘ఓకే’ అని చెప్పాడు. సినిమా పూర్తయ్యింది.. ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తోంది.

‘నన్ను పూర్తి స్థాయిలో నమ్మిన నా ఫస్ట్‌ మరియు బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ రామ్‌ చరణ్‌..’ అంటూ చాలా ఉద్వేగంగా ట్వీట్‌ చేశాడు సురేందర్‌ రెడ్డి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు సరిగ్గా కొద్ది గంటల ముందు.

‘నన్ను సపోర్ట్‌ చేశాడు.. నా వెనకాల ధైర్యమై నిలబడ్డాడు..’ అని చరణ్‌ (Mega Power Star Ram Charan) గురించి సురేందర్‌ రెడ్డి ఇంతలా చెబుతున్నాడంటే, ‘సైరా నరసింహారెడ్డి’తో సురేందర్‌ రెడ్డి ఎలాంటి అద్భుతాన్ని తెరకెక్కించేశాడో కదూ.!

సురేందర్ రెడ్డి చేతుల్లోకి రాకముందు.. ఈ కథ చాలా చేతులు మారింది. చివరికి, సురేందర్ రెడ్డి చేతికి వచ్చింది. దానికి సురేందర్ రెడ్డి తనదైన హంగులు అద్దాడు.

నెరేషన్ అంతా కొత్తగా వుండేలా ప్లాన్ చేశాడు సురేందర్ రెడ్డి. అలాగని పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers) పడ్డ కష్టాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించలేదు. వారికి క్రెడిట్ ఇస్తూనే.. తాను పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి. అందుకే అతనయ్యాడు సైరా సురేందర్ రెడ్డి.

Related Post

లారెన్స్‌ డైరెక్షన్‌లో శ్రీరెడ్డి.. అసలేం జరిగింది?

Posted by - October 17, 2018 0
ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్‌, నటుడు లారెన్స్‌ (Lawrence Raghava) ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. అందులో ఓ ముఖ్యమైన పాత్ర శ్రీరెడ్డికి ఆఫర్‌ చేశాడట. ‘టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకో’…
Sye Raa Power Punch

‘సైరా’ సాక్షిగా పవన్‌ ‘పవర్‌’ పంచ్‌ ఏంటంటే..

Posted by - September 22, 2019 0
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ‘సైరా’ (Sye…

జనసేన సమేత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.!

Posted by - October 9, 2018 0
పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రిప్ట్‌లు అందిస్తున్నారా.? లేదా.? పవన్‌కళ్యాణ్‌కి రాజకీయంగా త్రివిక్రమ్‌ సలహాదారు పాత్ర పోషిస్తున్నది నిజమేనా.? కాదా.? పవన్‌ –…
Rakhi Sawant Tanushree Dutta

‘మీ..టూ..’ 10 కోట్లు.. 50కోట్లు.!

Posted by - October 24, 2018 0
మీ..టూ.. (Me Too) ఉద్యమంపై ఉక్కు పాదం మోపడానికి ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌ (Rakhi Sawant) రంగంలోకి దిగినట్టుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్‌ (Nana…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *