Sye Raa Trailer Review

ట్రైలర్‌ రివ్యూ: సైరా నరసింహారెడ్డి.. సై సైరా.!

377 0

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా విడుదలకు ముందు రికార్డులకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Trailer Review), మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌.

అక్టోబర్‌ 2న సినిమా విడుదల కానుంది గనుక, ప్రస్తుతానికి తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌ విశేషాల గురించి మాట్లాడేసుకుందాం. సినిమా గురించి ఎదురు చూసినట్లు, ట్రైలర్ గురించి ఎదురు చూడటం బహుశా తెలుగు సినీ పరిశ్రమలో ఇదే తొలిసారి కావొచ్చు.

‘సైరా నరసింహారెడ్డి’ కారణజన్ముడు..

నరసింహారెడ్డి సామాన్యుడు కాదు.. కారణ జన్ముడు.. అంటూ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్‌ బిగిన్‌ అవుతుంది. ట్రైలర్‌.. ఇలా స్టార్ట్‌ అయ్యిందో లేదో, అలా ఎండ్‌ అయిపోయింది.

మధ్యలో కొన్ని నిమిషాలపాటు సంభ్రమాశ్చర్యాలకు గురవుతాం. స్వాతంత్రోద్యమం నాటి కాలంలోకి వెళ్ళిపోతాం. దేశభక్తి గురించి డైలాగులు వస్తుంటాయ్‌.. బ్రిటిష్‌ పాలకులు, భారతీయుల్ని హించిన తీరు కన్పిస్తుంటుంది.. ఆ హింసని ఎదిరించిన పోరాట యోధులు కన్పిస్తున్నారు..

వీరోచిత పోరాటాలు ఓ వైపు.. అత్యంత భయానకమైన అణచివేత ఇంకో వైపు.. వెరసి.. కళ్ళు చెమర్చుతాయి.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

‘నీ చివరి కోరిక ఏంటి.?’ అని ఇంగ్లీషులో అడుగుతారు.. అదీ న్యాయస్థానం సాక్షిగా ఆంగ్లేయులు. దానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమాధానమేంటో తెలుసా.? ‘గెట్‌ ఔట్‌ ఆఫ్‌ మై మదర్‌ ల్యాండ్‌’. అక్కడితో, మళ్ళీ మనం వాస్తవంలోకి వస్తాం.

సినిమాటోగ్రఫీ ఎలా వుంది.? ట్రైలర్‌ని ఎంత షార్ప్‌గా కట్‌ చేశారు.? బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఏంటి.? డైలాగులు ఇంకా ఏమైనా వున్నాయా.? చిరంజీవి ఎలా చేశారు.? అమితాబ్‌ పాత్ర సంగతేంటి.? నయనతార, తమన్నా పాత్రలు ఎలా వున్నాయి.? విజయ్‌ సేతుపతి, సుదీప్‌ల పాత్రల తీరు తెన్నులేమిటి.? ఇలాంటి ప్రశ్నలన్నీ ట్రైలర్‌ చూడటం పూర్తయ్యాకే గుర్తుకొస్తాయి.

మళ్ళీ ఇంకోసారి ట్రైలర్‌ని చూశాక.. మళ్ళీ మళ్ళీ చూశాకగానీ, మిగతా విషయాలపై దృష్టి పెట్టలేం. ‘సైరా’ ట్రైలర్‌ని అంత అద్భుతంగా డిజైన్‌ చేశారు. సినిమాటోగ్రఫీ గురించి కావొచ్చు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి కావొచ్చు.. ‘నభూతో న భవిష్యతి’ అని తీరాల్సిందే. పోరాట సన్నివేశాలు, తెలుగు సినిమా రేంజ్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళేలానే వున్నాయి.

అమితాబ్‌ తన అనుభవాన్నంతా రంగరిస్తే, విజయ్‌ సేతుపతి తనదైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. సుదీప్‌ సరే సరి. నయనతారతోపాటు తమన్నా పాత్ర పోటీ పడేలానే వుంది. ఓవరాల్‌గా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్‌.. సినిమాని తలపించేసింది.

టీజర్‌ విషయంలోనూ ఇలాగే మాట్లాడుకున్నాం. సో, సినిమా ఇంకెలా వుంటుందో.! నిర్మాణపు విలువల పరంగా రామ్‌చరణ్‌ ఓ మెట్టు పైకెక్కాడనడం కంటే, తెలుగు సినిమాని ఇంకో మెట్టు పైకెక్కించాడనడం సబబు. దర్శకుడు సురేందర్‌రెడ్డి గురించి మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. షాట్‌ మేకింగ్‌లో సురేందర్‌ రెడ్డి ప్రత్యేకత మరోమారు స్పష్టంగా కన్పించింది.

తండ్రికి తనయుడి మెగా గిఫ్ట్..

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ‘సైరా నరసింహారెడ్డి’, తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.

దాదాపు పదేళ్ళ ప్రస్థానంగా చెప్పుకోవాలి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి. ఎందుకంటే, పదేళ్ళ క్రితం నుంచే ‘సైరా నరసింహారెడ్డి’ని తెరకెక్కించే ప్రయత్నాలు జరిగాయి.

చాన్నాళ్ళ క్రితం ప్రముఖ సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్‌ కారణంగా వెలుగులోకి వచ్చిన ఈ చరిత్ర, సినినిమాగా తెరకెక్కే క్రమంలో ఎన్నో మార్పుల్ని చవిచూసింది.

చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన వి.వి. వినాయక్‌ (VV Vinayak) ఈ సినిమా మీద కొంత వర్క్‌ చేశాడు. అయితే, ఆ తర్వాత చిరంజీవి, రీ-ఎంట్రీలో కమర్షియల్‌ సినిమా ఆలోచన చేసి, ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా చేయడం, దానికి వినాయక్‌ దర్శకత్వం వహించడం తెలిసిన విషయాలే.

సురేందర్ రెడ్డి చేతికి అలా వచ్చింది..

‘ధృవ’ సినిమా టైమ్‌లో సురేందర్‌రెడ్డి (Surender Reddy) డెడికేషన్‌నీ, అతని టాలెంట్‌ని పసిగట్టిన రామ్‌చరణ్‌, అతనికే ‘సైరా నరసింహారెడ్డి’ని అప్పగించాడు. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఓ పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది.

హాలీవుడ్ నుంచి కొందరు సాంకేతిక నిపుణుల్ని రప్పించడమే కాదు.. మెగాస్టార్ మీద తనకున్న అభిమానంతో.. ఈ సినిమాని ఓ సాంకేతిక అద్భుతంగా రూపొందించేందుకు అనుక్షణం తపన పడ్డాడు.

నిజానికి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయడమంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. నిర్మాత చరణ్ తన మీద పెట్టకున్న నమ్మకాన్ని నిలబెట్టకోవాలన్న తపన, ఈ సినిమాని ఓ చారిత్రక అద్భుతంగా తెరకెక్కించేందుకు ఉపకరించింది.

Related Post

స్వీట్ అండ్ స్పెషల్ సమంత.!

Posted by - September 3, 2018 0
ఎక్కడో కేరళలో (Samantha Akkineni) పుట్టింది. తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటూ స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎన్నో ఎత్తు…
Anasuya

అందం.. అనసూయ.. ఆత్మవిశ్వాసం.!

Posted by - October 26, 2018 0
అనసూయ (Anasuya Bharadwaj) అంటే అందం, అనసూయ అంటే ఆత్మవిశ్వాసం.. అంతే కాదండోయ్‌, అనసూయ అంటే ఆగ్రహం కూడా.! అర్థం పర్థం లేని విమర్శలు ఎవరన్నా చేశారో…

బిగ్‌ బిగ్గర్‌ బిగ్గెస్ట్‌.. విజేత కౌశల్‌

Posted by - September 11, 2018 0
కౌశల్‌ ఆర్మీ.. సోషల్‌ మీడియాని ఇప్పుడు ఈ ఆర్మీ ఓ ఊపు ఊపేస్తోంది. అసలు ఎవరు ఈ కౌశల్‌.? అని ప్రశ్నించుకుంటే, పలు తెలుగు సినిమాల్లో నటించిన…

ప్రివ్యూ: ‘యాత్ర’

Posted by - February 4, 2019 0
మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి (Mammooty) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యాత్ర’ (Yatra Preview). దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) కాంగ్రెస్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *