హెడ్‌ స్ట్రాంగ్‌, ఫియర్‌లెస్‌ ‘రష్మీ రాకెట్‌’: తాప్సీ

 హెడ్‌ స్ట్రాంగ్‌, ఫియర్‌లెస్‌ ‘రష్మీ రాకెట్‌’: తాప్సీ

హీరోయిన్‌ తాప్సీ పన్ను (Taapsee Pannu Rashmi Rocket) అనగానే తెలుగులో ఆమె చేసిన గ్లామరస్‌ పాత్రలే గుర్తుకొస్తాయి. బాలీవుడ్‌లోనూ గ్లామర్‌ బాగానే పండించిన తాప్సీ, ఆ తర్వాత అనూహ్యంగా కొత్త పంథా ఎంచుకుంది. వరుసగా ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ, స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

బాలీవుడ్‌కి వెళ్ళినా అడపా దడపా సౌత్‌లో సినిమాలు చేస్తూనే వున్న తాప్సీ, నచ్చిన పాత్రలొస్తే ఏ భాషలో అయినా నటించేందుకు సిద్ధమని చెబుతోంది. అసలు విషయానికొస్తే, తాజాగా తాప్సీ మరో కొత్త సినిమా విశేషాల్ని పంచుకుంది సోషల్‌ మీడియా వేదికగా. తాప్సీ (Taapsee Pannu Hot) ప్రధాన పాత్రలో ‘రష్మీ రాకెట్‌’ అనే సినిమా తెరకెక్కనుంది.

Also Read: తాప్సీ అపరిచితురాలు.. ఇదిగో సాక్ష్యం.!

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ, ‘హెడ్‌ స్ట్రాంగ్‌.. ఫియర్‌లెస్‌.. రష్మీ రాకెట్‌..’ అంటూ సినిమాలోని తన పాత్ర గురించి చెప్పేసింది. ఇక, ఈ సినిమాలో తాప్సీ లుక్‌ అయితే చాలా చాలా డిఫరెంట్‌గా కన్పిస్తోంది. ఇంతకు ముందెన్నడూ తాప్సీ ఇలా కన్పించలేదని ఈ సినిమాలో ఆమె లుక్‌ చూస్తే అర్థమవుతోంది.

అథ్లెట్‌గా ‘రష్మి రాకెట్’ సినిమాలో తాప్సీ కన్పించనుంది. ఇందుకోసం ఆమె చాలా హార్డ్‌ వర్క్‌ చేసిందట. సినిమా నవంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఆకర్ష్‌ ఖురానా ఈ చిత్రానికి దర్శకుడు. ప్రియాన్షు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కన్పించబోతున్నారు. నిజానికి, ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి వుంది.

Also Read: అందాల ప్రదర్శనలో హీరోయిన్లతో హీరోలకు పోటీనా.?

అనివార్య కారణాలతో ’రష్మి రాకెట్‘ సినిమా ప్రారంభం కావడానికి కాస్త సమయం పట్టిందంతే. రోనీ, నేహా ఆనంద్‌, ప్రంజల్‌ ఈ ‘రష్మీ రాకెట్‌’ నిర్మాతలు. హిందీతోపాటు, పలు భాషల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. ‘ఇదేమీ నాకు టెయిలర్‌ మేడ్‌ ప్రాజెక్ట్‌ కాదు. దీనికోసం ఎంతో కష్టపడాల్సి వుంది. కానీ, ఇదొక ఛాలెంజింగ్‌ సినిమా..’ అంటోంది తాప్సీ.

Digiqole Ad

Related post