Tamannah About Mega Star Chiranjeevi

మెగాస్టార్‌తో మిల్కీ కోరిక నెరవేరిందిలా.!

172 0

మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) అంటే కళ్లు చెదిరే డాన్సులకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి మెగాస్టార్‌నే తన డాన్సులతో (Tamannah About Mega Star Chiranjeevi) మెప్పించింది మిల్కీబ్యూటీ తమన్నా (Tamannah Bhatia). ఇది ‘రచ్చ’ సినిమా నాటి కథ.

‘వాన వాన వెల్లువాయె..’ అంటూ ఆ సినిమా కోసం చిరంజీవి పాటను రీమిక్స్‌ చేశారు. చరణ్‌ (Ram Charan), తమన్నా పోటీ పడి డాన్సులేశారు. టాలెంట్‌ ఎక్కడున్నా అభినందించే చిరంజీవి, తమన్నా డాన్సుల్నీ అలాగే అభినందించారు.

తమన్నాతో డాన్స్‌ చేయాలని ఉంది..’ అని ఏదో సరదాగా ఆ కార్యక్రమంలో చెప్పారు మెగాస్టార్ (Mega Star Chiranjeevi). చిరంజీవే ఆ మాట అనేసరికి తమన్నా (Milky Beauty Tamannah Bhatia) ఉప్పొంగిపోయింది.

అందరిలానే తమన్నా కూడా చిరంజీవి సర్‌తో అవకాశం వస్తే, వదులుకోనని చెప్పింది. చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తారని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. కానీ, తమన్నా(Tamannah Bhatia) కోరిక నెరవేరింది. ‘సైరా నరసింహారెడ్డి’లో అద్భుతమైన పాత్ర దక్కింది.

మెగాస్టార్‌ పక్కన నిలుచుంటే చాలని అనుకున్నాననీ, కానీ, ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరమూ తెరపై కనిపిస్తామని కలలో కూడా అనుకోలేదనీ, షూటింగ్‌ జరుగుతున్నప్పుడు మెగాస్టార్‌ డెడికేషన్‌ చూసి చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాననీ.. తమన్నా చెప్పింది.

సన్నివేశం కోసం మెగాస్టార్‌ చాలా కష్టపడతారనీ, ఆ కష్టమంతా తెరపై ‘ఈజ్‌’ రూపంలో కనిపిస్తుందనీ, అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారనీ సైరా ప్రమోషన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah Bhatia) అంటోంది.

తాజాగా విడుదలైన ‘ఓ సైరా‘ పాటలో మిల్కీ బ్యూటీ అదరగొట్టేసింది. ‘అరుంధతి’ సినిమాలో అనుష్క చూపించిన దర్పం, తమన్నాలో కనిపించిందంటున్నారు.. ఆ వీడియో ప్రోమో చూసినవారంతా.

ఓ కమర్షియల్‌ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవితో (Mega Star Chiranjeevi) డాన్స్‌ చేయాలన్న కోరిక ఇంకా అలాగే ఉందనీ, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తానని అంటోంది తమన్నా.

మరి, మిల్కీ బ్యూటీ కోరికను తీర్చేందుకు మెగాస్టార్ చిరంజీవి.. తన తదుపరి సినిమాల్లో ఆమెకు మళ్ళీ అవకాశమిస్తారా.? వేచి చూడాల్సిందే.

Related Post

రాజశేఖర్‌ ‘కల్కి’లో గ్లామరే గ్లామర్‌!

Posted by - October 30, 2018 0
చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్‌కి (Doctor Rajasekhar) ‘పిఎస్‌వి గరుడ వేగ’ (PSV Garuda Vega) కావాల్సినంత ఆక్సిజన్‌ ఇచ్చింది.…

ట్రైలర్‌ రివ్యూ: అరవింద సమేత – ఎన్టీఆర్‌ సత్తా.!

Posted by - October 3, 2018 0
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి కొత్త సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై వుండే అంచనాల తీరే వేరు. ఆకాశమే హద్దు.. అన్నట్లుంటాయి ఆ అంచనాలు. అలాంటిది మాటల…
NTR, Ram Charan, Rajamouli, RRR, RRR Movie

చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి.. 600 కోట్లు.?

Posted by - November 19, 2018 0
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ సినిమా సంచలన విజయాన్ని అందుకుని, రామ్‌చరణ్‌ని 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చిన విషయం విదితమే.…

బిగ్‌ క్వశ్చన్‌: టైటిల్‌ గెలిచేదెవరు?

Posted by - September 29, 2018 0
100 రోజుల బిగ్‌ జర్నీ కంప్లీట్‌ చేసుకుని, ఫైనల్‌ రిజల్ట్‌ కోసం ఐదుగురు హౌస్‌మేట్స్‌ ఎదురుచూస్తున్నారు. టైటిల్‌ ఎవరిదో కొద్ది గంటల్లో ఫిక్స్‌ అయిపోనుంది. ఆదివారం సాయంత్రం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *