australia, team india

టీమిండియా విక్టరీ: ఇదీ హిస్టరీ.!

466 0

అడిలైడ్‌ టెస్ట్‌లో (Adelaide Test) టీమిండియా (Team India) విజయాన్ని అందుకుంది. అనేక రికార్డులు ఈ మ్యాచ్‌తో బద్దలయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని (Australia) చిత్తు చేయడమంటే అది ఏ జట్టుకైనా చాలా కష్టమైన విషయం. అక్కడి వాతావరణ పరిస్థితులే కాదు, ‘ఓన్‌ గ్రౌండ్‌’లో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లకు వుండే మద్దతు కారణంగా, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయాల్ని అందుకోవడం ఆనవాయితీ.

చాలా అరుదుగా మాత్రమే ఆస్ట్రేలియాకి షాక్‌లు తగులుతుంటాయి. అలాంటి అరుదైన షాక్‌ ఈసారి టీమిండియా ఇచ్చింది. భారత క్రికెటర్ల దెబ్బకి కంగారెత్తారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఈ మ్యాచ్‌కి సంబంధించి చాలా విశేషాలున్నాయండోయ్‌..

ధోనీ వారసుడు ఇతడే..

రిషబ్‌ పంత్‌ (Rishabh pant).. టీమిండియాకి ధోనీ తర్వాత అసలు సిసలు వారసుడెవరన్న ప్రశ్నకు దొరికిన సమాధానాల్లో ఈ పేరు కూడా ఒకటి. అయితే, రిషబ్‌ పంత్‌కి దూకుడెక్కువ. బ్యాటింగ్‌లో జస్ట్‌ ఓకే అన్పించాడంతే. కానీ, వికెట్‌ కీపింగ్‌లో సత్తా చాటాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టి, ధోనీకి అసలు సిసలు వారసుడన్పించుకున్న రిషబ్‌ పంత్‌, రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు క్యాచ్‌లు పట్టాడు. ఆషామాషీ విషయం కాదిది. కొత్త కుర్రాడే అయినా, ఆ బెరుకు రిషబ్‌ పంత్‌లో ఏమాత్రం కన్పించలేదు.

విదేశీ గడ్డపై రిషబ్‌ పంత్‌ పెర్ఫామెన్స్‌కి ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి. బ్యాటింగ్‌లోనూ ఫర్వాలేదన్పించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 బంతుల్లో 25 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌, రెండో ఇన్నింగ్స్‌లో 16 బంతుల్లోనే 28 పరుగులు చేసేశాడు.

తొలి మ్యాచ్‌.. తొలి విక్టరీ Team India

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకి ఇదే తొలి విజయం కాదు. కానీ, టెస్ట్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకోవడం మాత్రం మొట్టమొదటిసారి. ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకి అయినా ఆస్ట్రేలియాలో వాతావరణ పరిస్థితులు అంత తేలిగ్గా అలవాటు కావు. టీమిండియాకి మరీనూ. ఈ విషయం ఇప్పటిదాకా జరిగిన అనేక టెస్ట్‌ సిరీస్‌లలో నిరూపితమయ్యింది. కానీ, భారత క్రికెటర్లు ఈసారి సత్తా చాటారు. కసితో ఆడారు. తొలి మ్యాచ్‌లో తొలి విక్టరీని అందుకున్నారు. ఇదొక చరిత్ర.

అడిలైడ్‌లో రెండో విక్టరీ

ప్రపంచ క్రికెట్‌కి సంబంధించి అడిలైడ్‌ ఓ ప్రత్యేకమైన మైదానం. ఇక్కడ టీమిండియాకి ఇంతకు ముందు ఒకే ఒక్క విజయం వుండేది. ఇప్పుడు ఆ విజయానికి తోడు మరో విజయం వచ్చి చేరింది. తాజా విజయంతో టీమిండియా అడిలైడ్‌లో తన విజయాల సంఖ్యను రెండుకి పెంచుకుంది.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పుజారా.. నిలబెట్టేశాడంతే..

టెస్ట్‌ క్రికెట్‌లో ఛటేశ్వర్‌ పుజారా (Chateshwar Pujara) చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. క్రీజులో పాతుకుపోవడంలో దిట్ట. ఒకప్పటి రాహుల్‌ ద్రావిడ్‌ని పుజారా గుర్తుకు తెస్తుంటాడు. అడిలైడ్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా చేసిన 123 పరుగులు టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాయి.

రెండో న్నింగ్స్‌లోనూ పుజారా చేసిన 71 పరుగులు చాలా చాలా విలువెనవి. తొలి ఇన్నింగ్స్‌లో 246 బంతులు, రెండో ఇన్నింగ్స్‌లో 204 బంతులు ఆడాడంటే పుజారా, టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ని ఎలా నిలబెట్టాడో అర్థం చేసుకోవచ్చు.

అశ్విన్‌ చెరో మూడు..

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకున్న భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin), రెండో ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టి, భారత విజయంలో కీలక భూమిక పోషించాడు. బుమ్రా సైతం మొత్తం 6 వికెట్లు తీస్తే, షమి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాంత్‌ శర్మకి 3 వికెట్లు దక్కాయి.

మొత్తం మీద.. ‘మా మీద మా గడ్డపై మీ గెలుపు అంత తేలిక కాదు..’ అంటూ కోహ్లీ సేనను ఎగతాళి చేసిన ఆసీస్‌ ఆటగాళ్ళు కంగారెత్తిపోయేలా అడిలైడ్‌ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన దరిమిలా, టీమిండియా సిరీస్‌ గెలుపుపై ఆశలు సజీవంగా నిలుపుకున్నట్టయ్యింది. టీమిండియాకి ఇండియన్‌ మీడియా, ఆస్ట్రేలియా మీడియా ప్రశంసలు మామూలే. ఆసీస్‌ జట్టుపై అక్కడి మీడియా విసుర్లు కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎదురుచూస్తున్నారిప్పుడు.

స్కోర్లు: టీమిండియా తొలి ఇన్నింగ్స్ 250, రెండో ఇన్నింగ్స్ 307  – ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 235, రెండో ఇన్నింగ్స్ 291

Related Post

వరల్డ్ కప్ 2019: రో‘హిట్టు’.. సఫారీలు బెదిరేట్టు.!

Posted by - June 5, 2019 0
సఫారీలకి హ్యాట్రిక్‌ ఓటమి.. టీమిండియాకి (World Cup 2019 Team India) తొలి మ్యాచ్‌తోనే బంపర్‌ విక్టరీ.. వరల్డ్‌ కప్‌ పోటీలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా,…

భారత్‌ వర్సెస్‌ పాక్‌: క్రికెట్‌ కాదది యుద్ధం.!

Posted by - June 15, 2019 0
టీమ్‌ ఇండియా (Team India) ఎప్పుడు, ఎక్కడ పాకిస్థాన్‌తో (Pakistan)  తలపడినా (India Vs Pakistan World Cup 2019), అక్కడ పరిస్థితులు యుద్ద వాతావరణాన్ని తలపిస్తాయి.…

మెన్ ఇన్ బ్లూ.. ఈ దాహం తీరనిది.!

Posted by - July 8, 2019 0
ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో టీమిండియా (Team India World Cup 2019 Winner) బ్యాటింగ్‌ సెన్సేషన్‌ ఎవరంటే, తడుముకోకుండా వచ్చే సమాధానం రోహిత్‌ శర్మ అనే.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *