తెలుగు సామెతలు: అడుసు తొక్కనేల కాలు కడగనేల.!
Telugu Saamethalu Adusu Thokkanela.. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.! కాలు కడగడం గురించి తెలుసు.! అడుసు అంటే ఏంటి.? దాన్ని తొక్కడమేంటి.?
తెలిసీ తప్పు చేయడం, అడ్డంగా ఇరుక్కుపోవడం.. అందులోంచి బయటకు వచ్చేందుకు.. చేసిన తప్పుని సరిదిద్దుకునేందుకు నానా తంటాలూ పడటం.. దీని గురించే పైన పేర్కొన్న సామెత పుట్టింది.!
బురదని అడుసు అంటాం.! సో, విషయం అర్థమయ్యింది కదా.! తెలిసీ బురదలో కాలెయ్యడం, ఆ తర్వాత ‘ఛీ..’ అంటూ కాలుని కడుక్కునేందుకు పరిగెత్తడం.. ఇదీ ఆ సామెత తాలూకు అర్థం.
Telugu Saamethalu Adusu Thokkanela.. బురద అంటే ఆ బురదే కాదు..
ఇక్కడ బురద అంటే.. కేవలం బురద కాదు.! ‘తప్పు’ అని అర్థం.! కొన్ని సరిదిద్దుకునే తప్పులుంటాయ్.. కొన్ని సరిదిద్దుకోలేని తప్పులూ వుంటాయ్.
తొందరపడి తప్పు చేసేసి, ఆ తప్పుని సరిదిద్దుకోలేక సతమతమవుతున్నప్పుడు, స్నేహితుల సాయం కోరితే, ‘అడుసు తొక్కనేల కాలు కడగనేల’ అని అట్నుంచి అక్షింతలు పడతాయ్.!
ముందే చెప్పుకున్నట్టు ‘సామెత’ అంటే, అది మన సంపద.! కానీ, సామెతల్ని ఎప్పుడో మర్చిపోయాం. సోషల్ మీడియా ట్రెండ్‌లో అన్నీ షార్ట్ కట్స్ మాత్రమే.
బ్రో.. వాట్సాప్.. ఇదీ మన తీరు.! అప్పుడప్పుడూ సామెతలు ఎక్కడన్నా తారసపడితే, ఆ తెలుగు మాధుర్యం భలేగుంటుంది కదూ.!
బురద పైత్యం..
జాగ్రత్త.! బురద అని తెలిసీ కాలు అందులోకి దించొద్దు.! కడుక్కోవడానికి తంటాలు పడటం కంటే, ఆ బురదకి దూరంగా వుండటమే మేలు.!
అన్నట్టు.. బురదలో కాలెయ్యడమేం ఖర్మ.! బురద శరీర నిగారింపుని పెంచుతుంది తెల్సా.? అంటూ, ఆ ఛండాలాన్ని శరీరానికి పూసుకుంటున్న రోజులివి.!
Also Read: Radhika Apte: నిందలేస్తే సింపతీ వస్తుందా రాధికా.!?
‘మడ్ ఫెస్టివల్స్’ కూడా నిర్వహించేస్తున్నారండోయ్.! ఇదో రకం పైత్యం.! దీన్నే ‘వేలంవెర్రి’ అని కూడా అంటారు.! అయినా, బురదలో పడి దొర్లడం ఏంటి చెప్మా.?
అప్పుడప్పుడూ ఒక్కో సామెత గురించీ ఇలాగే సరదాగా చర్చించుకుందాం.! ఇదే స్పేస్ చూస్తూ వుండండి.!