విజయ్ కొత్త పొలిటికల్ పార్టీ: తమిళగ వెట్రి కజగం.!
Thalapathy Vijay Political Party.. ‘దళపతి’ విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. తమిళనాట సూపర్ స్టార్ ఇమేజ్ వున్న విజయ్, తెలుగు సినీ ప్రేక్షకులకీ డబ్బింగ్ సినిమాలతో సుపరిచితుడే.
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajnikanth) తర్వాత ఆ స్థాయి కమర్షియల్ స్టార్‌డమ్ వున్న నటుడు విజయ్.
గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడన్న ప్రచారం జరుగుతూనే వుంది. కొన్నాళ్ళ క్రితం ఎన్నికల్లో ఓటేసేందుకు ఇంటి నుంచి స్వయంగా సైకిల్ మీద వెళ్ళడం అప్పట్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది.
Thalapathy Vijay Political Party.. 2024 ఎన్నికల్లో పోటీ చేయదట..
అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ప్రకటించడం గమనార్హం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తమిళగ వెట్రి కజగం పార్టీ పోటీ చేస్తుందట.
తమిళనాడులో రాజకీయ అవినీతి పెరిగిపోయిందంటూ విజయ్, పార్టీ (Tamizhaga Vettri Kazhagam) స్థాపించిన విషయాన్ని ప్రస్తావిస్తూ విడుదల చేసిన లెటర్‌లో పేర్కొన్నారు.
పార్టీ జెండా, ఎజెండా తదితర విషయాల్ని విజయ్ త్వరలోనే వెల్లడిస్తారట. విజయ్ కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో తమిళనాట ‘దళపతి’ అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు.
ఎవరికీ మద్దతివ్వం..
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ తమిళగ వెట్రి కజగం పార్టీ మద్దతివ్వదని విజయ్ (Thalapathy Vijay) ప్రకటించడం గమనార్హం.
ఇదిలా వుంటే, తమిళనాట ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొన్నాళ్ళ క్రితం ఓ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ ప్రకటన చేసి, ఆ తర్వాత తూచ్ అనేశారు. మరో నటుడు విజయ్ కాంత్ కూడా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు.
Also Read: ‘చిరంజీవి’ కంటే పెద్ద పురస్కారం ఏముంటుంది.?
తమిళనాట సినీ ప్రముఖులు రాజకీయ పార్టీలు స్థాపించడం కొత్తేమీ కాదు. మరో స్టార్ హీరో అజిత్ కూడా రాజకీయాల్లోకి వస్తాడన్న ప్రచారం జరుగుతోంది.
నటుడు విశాల్ కూడా తానూ రాజకీయాల్లో వస్తున్నట్లు గతంలో ప్రకటించాడు. శరత్ కుమార్ కూడా ఓ రాజకీయ పార్టీని గతంలో అనౌన్స్ చేశాడు.