Thangalaan Telugu Trailer Review: ఆ మాంత్రికురాలి కథేంటి.?
Thangalaan Telugu Trailer Review.. విక్రమ్ సినిమా అంటే మామూలుగా వుండదు.! సినిమాల్లో సక్సెస్, ఫెయిల్యూర్ మామూలే కావొచ్చుగానీ, నటుడిగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ అయ్యింది లేదు.
ప్రతి సినిమాలోనూ ఏదో ఓ కొత్తదనం కోసం ప్రయత్నించే విక్రమ్ (Vikram), ఆ కొత్తదనం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు.
ఈ క్రమంలోనే విక్రమ్ నుంచి ‘తంగలాన్’ అనే ఓ విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పా రంజిత్ రూపొందిస్తోన్న ఈ ‘తంగలాన్’ సినిమాలో విక్రమ్, మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రధాన తారాగణం. తాజాగా, ఈ సినిమా ట్రెయిలర్ విడుదలయ్యింది.
Thangalaan Telugu Trailer Review.. మాంత్రికురాలు ఆరతి ఎవరబ్బా.?
బ్రిటిష్ పాలన కాలం నాటి కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. బంగారాన్ని వెతికేందుకు బ్రిటిష్ పాలకులు ఓ తెగకి చెందినవారిని వినియోగిస్తుంటారు.
అయితే, బంగారాన్ని వెతికే క్రమంలో ఆ తెగ అనూహ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ఆ అనూహ్యమైన పరిస్థితులకు కారణం ఓ మాంత్రికురాలని ట్రెయిలర్‌లో ప్రస్తావించారు.
మాంత్రికురాలు ఆరతిగా మాళవిక మోహనన్ వీరోచితమైన పోరాటాలు చేసేస్తోంది. ఇంతకీ, ఆమేనా మాంత్రికురాలు.? ఆమె ఎందుకు బంగారం తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతోంది.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇక, విక్రమ్ (Vikram) గెటప్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఏ గెటప్‌లో అయినా ఆయన ఇట్టే ఒదిగిపోతాడు. ఈ సినిమాలోనూ అలాగే ఒదిగిపోయాడు.
Also Read: ఆమెతో అది నిజమేగానీ.! రాజ్ తరుణ్ ‘నొక్కుడు’.!
ట్రెయిలర్‌ని చాలా బాగా కట్ చేశారు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎలిమెంట్స్.. అన్నీ పక్కాగా కుదిరినట్టే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరింది. విజువల్ ఎఫెక్ట్స్‌కి కూడా స్కోప్ ఎక్కువే వున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఏడాది విడుదలవుతున్న (దేశవ్యాప్తంగా) అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘తంగలాన్’ కూడా ఒకటి.! జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘తంగలాన్’ (Thangalaan) విడుదల కాబోతోంది.