పద్ధెనిమిదేళ్ళ తర్వాత.! ఇంత గ్యాప్ ఎందుకో.!
Trisha Krishnan Vishwambhara Chiranjeevi.. త్రిష.. పరిచయం కొత్తగా అవసరమా ఆమె గురించి.? తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.
దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమలో అప్పటి అగ్రహీరోలందరితోనూ, కొందరు యంగ్ హీరోలతోనూ త్రిష (Trisha Krishnan) సినిమాలు చేసేసింది.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సరసన ‘స్టాలిన్’ సినిమాలో త్రిష (Trisha Krishnan) హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
Trisha Krishnan Vishwambhara Chiranjeevi.. పద్ధెనిమిదేళ్ళకి మళ్ళీ ఆ కాంబినేషన్‌లో..
దాదాపు పద్ధెనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన నటించబోతోంది త్రిష. ఆ సినిమా పేరు ‘విశ్వంభర’.!
నిజానికి, ‘ఆచార్య’ సినిమాలోనే చిరంజీవి సరసన త్రిష నటించి వుండాల్సింది. కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయ్యింది.
త్రిషని తీసేసి కాజల్ అగర్వాల్‌ని (Kajal Aggarwal) పెట్టి, కాజల్‌తో కొంత షూట్ చేసి.. చివరికి, ఆమె నటించిన మొత్తం సీన్స్ అన్నిటినీ లేపేశారు ‘ఆచార్య’ నుంచి.
అయితే, తనను ఆ సినిమా నుంచి తప్పించడంపై గుస్సా అయిన త్రిష, మెగాస్టార్ చిరంజీవి మీద మాత్రం ఎలాంటి ఆరోపణలూ చేయలేదు సరికదా, అంతకుముందున్న అభిమానాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
Also Read: తప్పెవరిది.? శ్రీలీలదా.? దర్శకులదా.?
పద్ధెనిమిదేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో (Mega Star Chiranjeevi) కలిసి నటించే అవకాశం మళ్ళీ తనకు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది త్రిష.
మరోపక్క, ‘విశ్వంభర’ టీమ్‌లోకి త్రిషని మెగాస్టార్ చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ‘బింబిసార’ ఫేం వశిష్ట ఈ ‘విశంభర’ చిత్రానికి దర్శకుడు.