Varun Sandesh On Fire

వరుణ్‌ సందేశ్‌.. ఫ్రూట్‌ కాదు, హాట్‌

145 0

వెండితెరపై ఆయన హీరోనే కావొచ్చు.. బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో మాత్రం ‘బిగ్‌ ఫ్రూట్‌’గా పేరు తెచ్చుకున్నాడు. చాలా టాస్క్‌లలో చాలా సిల్లీగా ప్రత్యర్థికి అవకాశమిచ్చేయడంటో వరుణ్‌ సందేశ్‌కి (Varun Sandesh On Fire) ఆ పేరు అలా ఫిక్సయిపోయింది.

స్వయానా ఆయన భార్య వితికా షెరునే (Vithika Sheru) వరుణ్‌ని (Varun Sandesh) పలు సందర్భాల్లో ‘ఫ్రూట్‌’ అనేసింది కూడా. ఇక, బిగ్‌ హోస్ట్‌ నాగార్జున సంగతి సరే సరి. దాదాపుగా ప్రతి వీకెండ్‌లోనూ వరుణ్‌ని ఫ్రూట్‌గా అభివర్ణించడమే పనిగా పెట్టుకున్నాడు.

అయితే, తాజా టాస్క్‌లో (Bigg Boss Telugu 3) వరుణ్‌ సందేశ్‌ తాను ఫ్రూట్‌ని కాదనీ, తాను చాలా హాట్‌ అనీ నిరూపించుకున్నాడు. టిక్కెట్‌ టు ఫినాలేని రాహుల్‌ గెల్చుకోవడంతో, మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్‌ నుంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్‌ అయిపోవాల్సి వస్తుంది.

ఆ ఐదుగురు కంటెస్టెంట్స్‌ తమ అభిమానుల్ని అలరించేందుకోసం రకరకాల టాస్క్‌లు చేయాల్సి వచ్చింది. అవి బిగ్‌ బాస్‌ డిజైన్‌ చేసిన టాస్క్‌లు. అన్నిటికంటే కష్టమైన టాస్క్‌ వరుణ్‌ సందేశ్‌కి దక్కింది.

అగ్ని కీలలు చెలరేగే ఓ పెద్ద రింగ్‌.. ఆ రింగ్‌లో ఓ రాడ్‌ పెట్టాలి.. రాడ్‌ ఏ మాత్రం ఆ మాటలకు చేరుకున్నా, రింగ్‌ అంతా మంటలు బలంగా స్ప్రెడ్‌ అయిపోతాయి. సో, రాడ్‌ ఆ రింగ్‌లో ఏ పార్ట్‌కి తగలకుండా, కిందనున్న మంటకీ తగలకుండా పట్టుకోవాలి.

గంటల తరబడి అలా వరుణ్‌ ఆ రాడ్‌ని (Varun Sandesh On Fire) పట్టుకోవాల్సి వచ్చింది. చెప్పడానికి చాలా సులువుగానే అన్పించినా, నిజానికి ఇది ఫిజికల్‌గా చాలా కష్టమైన టాస్క్‌. పైగా, చాలా ఎక్కువసేపు వరుణ్‌ ఈ టాస్క్‌ చేయాల్సి వచ్చింది.

వరుణ్‌ తర్వాత అంత కష్టమైన టాస్క్‌ బాబా భాస్కర్‌కి (Baba Bhaskar) దక్కింది. ఓ స్తంభం మీద చిన్న మెట్టు లాంటి ఓ ఆధారం మీద నిలబడాలి బాబా భాస్కర్‌. ఓపిక చాలా ఎక్కువ కదా.. బాబా భాస్కర్‌ కూడా టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముగించాడు.

అలీ రెజా (Ali Reza) రెండు చేతులతో రెండు బ్యాగ్‌లను కిందికి జారిపోకుండా పట్టుకోవాలి.. ఇందుకోసం తగిన ఏర్పాట్లున్నాయి. అయినాగానీ, ఇదీ కష్టమైన టాస్క్‌. బాబా వరుణ్‌, బాబా భాస్కర్‌తో పోల్చితే అలీ తక్కువ సమయమే ఆ టాస్క్‌ చేశాడు.

Related Post

Bigg Boss 3 Nagarjuna

బిగ్‌హౌస్‌లో ‘పుల్ల’ పెట్టిన కింగ్‌ నాగార్జున!

Posted by - August 20, 2019 0
మొహాలకి వున్న మాస్క్‌లు తీసెయ్యమంటే, బిగ్‌హౌస్‌లో (Bigg Boss 3 Telugu) కంటెస్టెంట్స్‌ (Mahesh Vitta Ali Reza BB3) కొట్టుకునే పరిస్థితికొచ్చారు. వీకెండ్‌ ఎపిసోడ్స్‌ని రక్తి…
Punarnavi Himaja

బిగ్‌ వికెట్‌ నెం.6: హిమజ వర్సెస్‌ పునర్నవి

Posted by - August 26, 2019 0
బిగ్‌బాస్‌ (Bigg Boss 3 Telugu) తెలుగు మూడో సీజన్‌ మరీ రసవత్తరంగా ఏమీ సాగడంలేదు. కానీ, బిగ్‌హౌస్‌లో మాత్రం అనవసర హంగామా మాత్రం రోజురోజుకీ ఎక్కువైపోతోంది.…
Vallabh Bhai Patel, Sardar, Iron Man Of India, Statue of Unity, Run for Unity

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

Posted by - October 31, 2018 0
బానిస సంకెళ్ళను తెంచుకుని, తెల్ల దొరల నుంచి భారతావని ‘స్వేచ్ఛా’ గీతిక పాడుకుంటోంది. కానీ, ఏం లాభం.? దేశంలో అనేక సంస్థానాలు.. ఆ సంస్థానాధీశులు ఎవరి దారి…
Ashu Reddy

అషు ఎలిమినేటెడ్‌.. ‘బిగ్‌’ డల్‌ వీకెండ్‌.!

Posted by - August 25, 2019 0
అంతా అనుకున్నట్టే జరిగింది. అషు రెడ్డి బిగ్‌ హౌస్‌ (Bigg Boss 3 Telugu) నుంచి ఎలిమినేట్‌ అయిపోయింది. తాను ఎలిమినేట్‌ అయిపోవడం ఖాయమని ముందే తెలిసిపోయిందేమో,…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *