Vijaya Shanthi Telangana CBN.. అప్పుడెప్పుడో ఆమె లోక్ సభకు వెళ్ళినట్టు గుర్తు.. అది కూడా గులాబీ పార్టీ నుంచి.! బీజేపీ, కాంగ్రెస్.. ఇలా ఆమె వేర్వేరు పార్టీల్లోకి వెళ్ళారు.
సొంతంగా తల్లి తెలంగాణ అనే పార్టీని కూడా గతంలో స్థాపించారామె. పరిచయం అక్కర్లేని పేరామెది. సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. మరి, రాజకీయాల్లోనో.?
అర్థమయ్యింది కదా.. ఆమె విజయశాంతి అని.! ఇంతకీ, ఇప్పుడు విజయశాంతి ఏం చేస్తున్నట్లు.? ఓ సినిమాలో నటిస్తున్నారు.
విజయశాంతి రాజకీయాల్లో వున్నారా.? లేదా.? అదైతే, చాలామందికి డౌటు.! అందుకేనేమో, సోషల్ మీడియా వేదికగా ఓ పొలిటికల్ కామెంట్ చేసేశారామె.. ‘నేనూ రాజకీయాల్లోనే వున్నా..’ అని చెప్పుకోడానికన్నట్టు.!
Vijaya Shanthi Telangana CBN.. విజయశాంతి తాజా ట్విటు ఇదీ..
‘‘ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు.’’.
‘‘కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది.’’.
‘‘ఎందుకంటే, తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది.’’.

‘‘తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని… తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీ తో కలిసి తెలంగాణ ల బలపడనీకి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణ ల తప్పక ఏర్పడి తీరుతాయి.’’.
‘‘తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం…’’.
‘‘అంతే కాదు, అసలు తెలంగాణ ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గార్కి, తెలంగాణ రాష్ట్రం ల టీడీపీని తిరిగి బలపరుస్తం అని అనవలసిన అవసరం ఏమున్నది?’’.
Also Read: ఎర్నలిస్ట్ కాంతమ్.. ఎన్ని వందల కోట్ల నెత్తుటి కూడు తిన్నావ్.?
‘‘వారి కూటమి పార్టీ బీజేపీ కి కూడా తెలంగాణల కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటది, బహుశా.. హర హర మహాదేవ్’’ అంటూ ముగించారు తన కామెంట్‌ని సోషల్ మీడియా వేదికగా విజయశాంతి.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! 2019 ఎన్నికల తర్వాత, తెలుగు దేశం పార్టీ ఖేల్ ఖతం.. అనుకున్నారంతా.! కానీ, అనూహ్య విజయం సాధించింది టీడీపీ.! ఏమో, తెలంగాణలోనూ టీడీపీ సమీప భవిష్యత్తులో బలపడుతుందేమో.!
Mudra369
ప్రస్తుతానికైతే విజయశాంతి కాంగ్రెస్ నేత.. అని చాలామందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పూర్తిగా అర్థమయ్యేలోపు ఆమె పార్టీ మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇంకెన్నాళ్ళు తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్.. అంటూ విభజన రాజకీయాలు.? మేడమ్.. కూసింత ఆత్మవిమర్శ చేసుకోండి… అనే ‘సలహాతో కూడిన సూచన’ని ఆమె అభిమానులే సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు.