టీమిండియా గనుక ఓడిపోయి వుంటే.!
Virat Rohit T20 Champions.. శుభం పలకరా.. అంటే, పెళ్ళికూతురు డాష్.. అని అన్నాడట వెనకటికి ఒకడు.! అలా వుంది వ్యవహారం.! టీమిండియా బంపర్ విక్టరీ కొట్టింది టీ20 వరల్డ్ కప్‌లో.
2024 టీ 20 వరల్డ్ కప్ (T 20 World Cup) ఛాంపియన్‌గా టీమిండియా అవతరించిన సంగతి తెలిసిందే. రోహిత్ (Rohit Sharma) సేన, సఫారీలపై ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి, ట్రోఫీని కైవసం చేసుకుంది.
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు..
…
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే,
నిర్దాక్షిణ్యంగా వీరె..– శ్రీశ్రీ
మహా కవి శ్రీశ్రీ ఊరికే చెప్పలేదు మరి.!
వారెవ్వా రోహిత్.. వారెవ్వా కోహ్లీ.. ఏం క్యాచ్ పట్టావ్ సూర్య కుమార్ యాదవ్.. భలే బౌలింగ్ వేశావ్ బూమ్రా.. నీకు నువ్వే సాటి హార్దిక్ పాండ్యా.. ఇవీ ప్రశంసలు.
Virat Rohit T20 Champions.. గెలిస్తే పొగడ్తలు.. ఓడితే అవమానాలు..
ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ టోర్నీలో టీమిండియా. సౌతాఫ్రికా కూడా అలాగే ఫైనల్‌కి వచ్చింది. కాకపోతే, ఫైనల్‌లో సౌతాఫ్రికా టీమ్ ఓడిపోయింది.
అదే, టీమిండియా గనుక ఓడిపోయి వుంటేనో.? వామ్మో, ఆ రచ్చ వేరే లెవల్‌లో వుండేది. టీవీలు బద్దలైపోయేవి.. క్రికెటర్ల దిష్టి బొమ్మలు తగలబడిపోయేవి.!
గెలిచాక సగర్వంగా కోహ్లీ, రోహిత్.. టీ20 ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పారుగానీ, ఓడిపోతే.. వాళ్ళు క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు పుట్టుకొచ్చేవి.
Also Read: పగలు వద్దే వద్దు.!? పడక మీదే ఎందుకు ముద్దు.!?
ఆట అన్నాక గెలుపోటములు సహజం. గెలుపోటములపై విశ్లేషణలు తప్పు కాదు. ఆటగాళ్ళ వైఫల్యాల్ని ఎత్తి చూపడం అసలే తప్పు కాదు.!
కానీ, ఆ పేరు చెప్పి పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి మరీ దూషించడం.. ఇది కదా, దారుణమంటే.!
విరాట్ కోహ్లీ కావొచ్చు, రోహిత్ శర్మ కావొచ్చు.. ఇంకొన్నాళ్ళు టీ 20 క్రికెట్ ఆడగల సత్తా వున్నోళ్ళే. కానీ, వైఫల్యాలొస్తే అవమానాలతో ఆటను వీడాల్సి వస్తుంది.
అందుకే, ప్రపంచ ఛాంపియన్స్.. అన్న హోదాలో, టీ20 క్రికెట్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్స్ ప్రకటించేశారు. అద్గదీ అసలు సంగతి.