విటమిన్ ‘బి’ ట్యాబ్లెట్లు విరివిగా వాడేస్తున్నారా.! జర జాగ్రత్త.!

 విటమిన్ ‘బి’ ట్యాబ్లెట్లు విరివిగా వాడేస్తున్నారా.! జర జాగ్రత్త.!

Vitamin B

VitaminB Tablets Side Effects.. కాస్త నీరసం, గుండె దడ అనిపిస్తే చాలు.. విటమిన్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లను వాడుతుంటారు చాలా మంది.

అవును నిజమే.! బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడడం వల్ల శరీరంలో నిస్సత్తువ తగ్గుతుంది.. అనే ఓ అపోహ కొంత మందిలో.

అయితే, విటమిన్ ట్యాబ్లెట్లను విరివిగా వాడడం వల్ల ఆరోగ్య పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

విటమిన్లు శరీరానికి తగిన మోతాదులో అందాల్సిన ఆవశ్యకత వుంది. అయితే, తీసుకునే ఆహారం ద్వారా సహజ సిద్ధంగా శరీరానికి తగినన్ని విటమిన్లు అందాలి.

VitaminB Tablets Side Effects.. అతి సర్వత్రా వర్జ్యయేత్.!

అంతేకానీ, సప్లిమెంట్స్ ద్వారా తీసుకునే విటమిన్లు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి చేసే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ‘బి’ విటమిన్ (Vitamin B), విటమిన్లన్నింట్లోనూ అత్యంత కీలకమైన పని చేస్తుంది. శరీర జీవక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తుంది విటమిన్ ‘బి’.

ఈ విటమిన్ తగ్గినప్పుడు తక్షణ శక్తి కోసం సప్లిమెంట్స్ అందిస్తుంటారు వైద్యులు. అవి ట్యబ్లెట్ల రూపంలో కావచ్చు. ఇంజక్షన్ రూపంలో కావచ్చు.

మోతాదుకు మించి విటమిన్ బి (Vitamin B) ట్యాబ్లెట్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.!

ఈ సమస్యలుంటే జర జాగ్రత్త పడాల్సిందే.!

ఎక్కువ సేపు నిల్చున్నా.. కూర్చున్నా కాళ్లలో తిమ్మిర్లు.. మోకాలి నొప్పులు బాధిస్తుంటాయ్. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయ్.

అజీర్తి, వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు వేధిస్తుంటాయ్. అలాగే నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తుతాయ్.

Also Read: వయసు తగ్గించే ‘అవకాడో’ గురించి మీకు తెలుసా.?

నిద్ర సరిగా లేకపోవడంతో ఒత్తిడి, చికాకు, కోపం, చిన్న విషయానికే ఏడుపు రావడం వంటి సమస్యలుంటాయ్. వీటిని ఇన్‌టైమ్‌లో గుర్తించి వైద్యుని సలహా పొందాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి.?

పండ్లు, కూరగాయలతో పాటూ, మాంసం, చేపలు, గుడ్లు తదితర ఆహార పదార్ధాలలో విటమిన్ బి (Vitamin B) పుష్కలంగా లభిస్తుంది.

VitaminB Tablets Side Effects

అలాగే పప్పు ధాన్యాలు, చిక్కుడు జాతి గింజల్లోనూ విటమిన్ బి అధికంగా వుంటుంది. పాలు, పాల సంబంధిత పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ బి అందుతుంది.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందరు వైద్య నిపుణుల నుంచి, ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం నుంచి సేకరించబడింది.

కేవలం సమస్యను గుర్తించేందుకు తగిన అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఉపయోగపడుతుంది. సమస్య తీవ్రతరమైతే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

Digiqole Ad

Related post