Vithika Sheru Eliminated

వితిక షెరు.. ‘బిగ్‌ జర్నీ’ని బ్రేక్‌ చేసిందెవరు.!

233 0

తెలుగు బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌కి సంబంధించినంతవరకు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ (Vithika Sheru Eliminated BB3) ఎవరు? అనే ప్రశ్నకి భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి. శ్రీముఖి యునానిమస్‌గా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌. ఆ తర్వాత స్ట్రాంగ్‌ ఎవరంటే, ఎవరి అభిప్రాయం వారిది.

స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ అనుకున్నవారు తుస్సుమని ఎలిమినేట్‌ అయిపోతూ వచ్చారు. వీక్‌ కంటెస్టెంట్స్‌ సేవ్‌ అవుతూ వస్తున్నారు. చివరి దశకు షో వచ్చేసినా.. అదే తంతు నడుస్తోంది. అలీ రెజా ఎలిమినేషన్‌ పెద్ద షాక్‌.. అతని రీ-ఎంట్రీ ఇంకా పెద్ద షాక్‌.

సో, బిగ్‌హౌస్‌లో ఏదైనా జరగొచ్చు.. ఎలాగైనా జరగొచ్చు.. ఓ పద్దతీ పాడూ లేదన్నది సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అంతిమంగా ఇది జస్ట్‌ ఓ టెలివిజన్‌ షో. దానికి ‘రియాల్టీ షో’ అని పేరు పెట్టొచ్చుగాక. కానీ, అందులో రియాల్టీని వెతకలేం.

శనివారం ఎపిసోడ్‌లో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌తోపాటు బాబా భాస్కర్‌ కూడా సేవ్‌ అయిపోయాడు. శివజ్యోతి కారణంగా మొత్తం ఏడుగురూ నామినేషన్‌లో పడగా, అందులోంచి ముగ్గురు సేవ్‌ అయ్యారు.. మిగతా నలుగురిలో ఒకరు ఎలిమినేట్‌ అవడం ఖాయం.

ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ వుంటుందా.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వితిక షెరు ఎలిమినేట్‌ అయిపోయిందని సోషల్‌ మీడియా కోడై కూసేస్తోంది. ఇప్పటిదాకా ఇలా బయటకు వచ్చిన లీకుల ప్రకారమే ఎలిమినేషన్లు జరిగాయి కూడా.

పునర్నవి ఎలిమినేట్‌ అయినప్పుడే అంతా షాకయ్యారు. సో, వితిక (Vithika Sheru Eliminated BB3) ఎలిమినేట్‌ అయినా అలాగే ఫీలవుతారు నెటిజన్లు. ఇదిలా వుంటే, శనివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌ తరఫు బంధువుల్లో చాలామంది వితికని టాప్‌ ఫైవ్‌లో లేకుండా చేసేశారు.

సో, అదే జనాభిప్రాయం.. అని బిగ్‌బాస్‌ చెప్పదలచుకుంటున్నాడేమో.! వితిక లేకపోతే, వరుణ్‌లో అసలు గేమ్‌ బయటకు వస్తుందన్నది శనివారం ఎపిసోడ్‌ పంపిన సందేశం. అది నిజమేనా? వేచి చూడాలి.

Related Post

Varun Sandesh Sree Mukhi

‘బిగ్‌’ షట్టర్‌ క్లోజ్‌: కూల్‌ వరుణ్‌ వర్సెస్‌ హాట్‌ శ్రీముఖి

Posted by - September 13, 2019 0
చాలా అరుదుగా మాత్రమే వరుణ్‌ సందేశ్‌ బిగ్‌హౌస్‌లో వాయిస్‌ పెంచుతుంటాడు. షో (Bigg Boss 3 Telugu) ప్రారంభమైన కొత్తలో మహేష్‌ విట్టా మీద విరుచుకుపడ్డ (Varun…
king nagarjuna bigg boss 3 telugu

బిగ్‌బాస్‌-3: ‘కింగ్‌’ నాగార్జున దమ్మెంత.?

Posted by - June 30, 2019 0
టాలీవుడ్‌ మన్మథుడు (Manmadhudu), కింగ్‌ నాగార్జునకి (King Nagarjuna) వెండితెరపై అద్భుతాలు చేయడమే కాదు, బుల్లితెరపై సంచలనాలు సృష్టించడమూ (Bigg Boss Telugu Season 3) తెలుసు.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *