Where Is AP Capital.! ‘రాజధాని’పై ఈ ఉన్మాదమెవరిది?
Where Is Ap Capital.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందా.? లేదా.? వుంటే, ఎక్కడ.? లేకపోతే, ఎందుకు లేదు.?
గతంలో, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించింది. అప్పటి పాలక పక్షం, ప్రతిపక్షం సంపూర్ణంగా రాజధాని అమరావతికి మద్దతు పలికాయ్.
అలాంటప్పుడు, ఆ రాజధాని అమరావతి ఇప్పుడెక్కడికి పోయింది.? సోషల్ మీడియాలో, ‘వేర్ ఈజ్ ఏపీ క్యాపిటల్’ అనే హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్ అవుతోంది.?
Where Is Ap Capital.. ఎవరీ మౌళి.? ఎందుకు మాయం చేశాడు.?
మౌళి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒకరు, తన అరచేతిలోని ఏపీ క్యాపిటల్‌ని మాయం చేసేశాడు. అదీ అసలు సమస్య.
అతన్ని చంపేస్తామంటున్నారు.. అతని కుటుంబ సభ్యుల్నీ చంపేస్తామంటున్నారు. అత్యాచారం కూడా చేసేస్తారట..!
ఇలా బెదిరిస్తున్న వాళ్ళంతా రాజధాని అభిమానులు కాదు, ఉన్మాదులు.! మౌళి అనే కుర్రాడు జోక్ చేశాడు. చేసింది జోక్ అయినా, అది ఆలోచించాల్సిన విషయం.
నిజంగానే మాయమైంది..
అమరావతి ఇప్పుడెక్కడుంది.? ఎక్కడుంటుంది.. అక్కడే వుంటుంది.! కాకపోతే, రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్ళలో అభివృద్ధి లేదు.
సెక్రెటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ.. ఇవన్నీ అమరావతిలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నా, దానిపై అధికార పార్టీకి బాధ్యత లేకుండా పోయింది.
శాసన రాజధాని.. అని అమరావతి గురించి చెబుతూనే, దానిపై విషం చిమ్ముతోంది వైసీపీ. అదే అసలు సమస్య. మరో రెండు రాజధానుల్లో విశాఖ మీద అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, కర్నూలుని పూర్తిగా విస్మరించారు.
హైద్రాబాద్ లాంటి నగరం ఎలా.?
అమరావతిని ఓ మోస్తరుగా అయినా అభివృద్ధి చేసుకుంటే, అదొక ప్రధాన ఆదాయ వనరుగా మారి వుండేది రాష్ట్రానికి.
ఇప్పుడు.. ఐదేళ్ళ పాలన ముగుస్తున్న తరుణంలో, రాష్ట్రానికి హైద్రాబాద్ లాంటి నగరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొసలి కన్నీరు కార్చితే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
రాజధానిపై గడచిన ఐదేళ్ళలో ఉన్మాదుల రాజకీయ అత్యాచారాన్ని చూశాం.! ఏ రాష్ట్రానికీ ఇలాంటి దుస్థితి రాకూడదు.!
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. అదీ, పదేళ్ళ తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటి.? అంటే చెప్పుకోవడానికి వీల్లేని ఈ దుస్థితి.. అత్యంత బాధాకరం.!