అయితేనేం.! మీరు హీరోలే.! మీ వెంట మేమున్నాం.!
With Team India Always.. రోహిత్ శర్మ.. ఈ వరల్డ్ కప్ పోటీల్లో అత్యద్భుతంగా ఆడాడు. బ్యాట్స్‌మెన్‌గా పరుగుల వరద పారించాడు. అంతేనా, మంచి కెప్టెన్సీతో టీమిండియాని ముందుకు నడిపించాడు.
విరాట్ కోహ్లీ.. ది రన్ మెషీన్.! వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డుని కొల్లగొట్టాడు. కీలకమైన మ్యాచ్‌లలో సత్తా చాటాడు.
బ్యాట్స్‌మెన్, బౌలర్లు.. ఇలా ఎవరికి వారు, టీమిండియాని ఈ వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకూ చేర్చారు. ఫైనల్‌లో మాత్రం తడబడ్డారు.
ఓడింది ఒకే ఒక్క మ్యాచ్.. కాకపోతే, అది ఫైనల్ మ్యాచ్ అయి కూర్చుంది. అదే అసలు సమస్య. నాలుగేళ్ళకోసారి ఈ మెగా టోర్నీ జరుగుతుంది.
With Team India Always.. నాలుగేళ్ళకోసారి..
తదుపరి టోర్నీ కోసం ఇంకో నాలుగేళ్ళు ఎదురుచూడాలి.! ఆస్ట్రేలియా చేతిలో ఇంకోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్‌లో ఓడిపోవడం అత్యంత బాధాకరమే.
అంతమాత్రాన, భారత క్రికెటర్లను తూలనాడటం సబబు కాదు.! టీవీ సెట్ల ముందు కూర్చుని, పనికిమాలిన విశ్లేషణలు చేయడం పెద్ద కష్టం కాదు.
మైదానంలో, ఆటగాళ్ళు.. చాలా చాలా కష్టపడి ఆడతారు. 140 కోట్లమంది భారతీయుల ఆశల్ని మోస్తున్నారంటే, ఎంత ఒత్తిడి వుంటుంది.?
ఈ రోజు టైమ్ మనది కాదంతే.! అంతకు మించి, ఈ ఫైనల్ మ్యాచ్ గురించి ఇంకెలా అభివర్ణించగలం.? అదే రోహిత్ శర్మ, అదే విరాట్ కోహ్లీ, అదే శ్రేయస్ అయ్యర్, అదే సూర్యకుమార్ యాదవ్, అదే కేఎల్ రాహుల్.. మిగతా అందరూ అంతే.
ఓటమి భారం.. ఇప్పుడే ఓదార్పు కావాలి..
గెలిచాక భుజానికెత్తుకోవడంలో వింతేముంది.? ఓటమి బాధలో వున్నప్పుడే, ఓదార్పు కావాల్సి వుంటుంది ఆటగాళ్ళకి.!
నూట నలభై కోట్లమంది భారతీయులూ, ఇప్పుడు టీమిండియాకి అండగా నిలవాల్సిన సందర్భమిది.
Also Read: బ్రో.! ఐ డోంట్ కేర్.! బాలయ్య ‘మార్కు’ ర్యాగింగ్.!
మ్యాచ్ ముగిశాక, ఆటగాళ్ళు ఎంత ఆవేదనతో కనిపించారో చూశాం కదా.! మళ్ళీ కొత్త ఉత్సాహంతో, భవిష్యత్ క్రికెట్ వైపు అడుగులేయాలంటే.. వారికి మనందరి మద్దతూ అవసరం.!
ఒక్క మ్యాచ్ ఓడితే జీరోలు కాదు.! బ్యాక్ టు బ్యాక్ అన్ని మ్యాచ్‌లూ గెలుస్తూ ఫైనల్ వరకూ వచ్చారు మన హీరోలు.! ఓడినా మనోళ్ళు హీరోలే.!