World Famous Lover Vijay Deverakonda

కింగ్‌ ఆఫ్‌ ఆటిట్యూడ్‌: రౌడీ హీరో ఈజ్‌ బ్యాక్‌

315 0

‘గీత గోవిందం’ లాంటి కూల్‌ సినిమా చేసి, చాలా పెద్ద హిట్‌ కొట్టినా, ‘అర్జున్‌ రెడ్డి’లాంటి ఆటిట్యూడ్‌నే విజయ్‌ దేవరకొండలో (World Famous Lover Vijay Deverakonda) చూడాలని అనుకుంటున్నారు రౌడీస్‌.

సినిమాలో ఏముంటుందో తెలీదు కానీ, విజయ్‌ దేవరకొండ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్‌లుక్‌ మాత్రం ‘అర్జున్‌రెడ్డి’ని తలపించేసింది.

ఆ ఆటిట్యూడ్‌ ఏంటీ.? అని ఆశ్చర్యపోయేవారిని, మరింత ఆశ్చర్యపరిచేలా, ‘అర్జున్‌రెడ్డి’కి డబుల్‌ ఆటిట్యూడ్‌ అనిపించేలా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఫస్ట్‌లుక్‌తో వచ్చేశాడు విజయ్‌ దేవరకొండ.

ఆటిట్యూడ్‌ అనేది విజయ్‌ దేవరకొండకు ఓ ఆభరణం. అది పక్కన పెడితే, విజయ్‌ చాలా కూల్‌ గై. ‘వాల్మీకి’ సినిమా టైటిల్‌ మార్పు నేపథ్యంలో వరుణ్‌కి అందగా నిలిచాడు.

ఇదొక్కటే కాదు, చాలా సందర్భాల్లో ఇతర హీరోలతో ఫ్రెండ్లీ నేచర్‌, పెద్దల పట్ల రెస్పెక్ట్‌ చాటుకోవడం విజయ్‌లో మరో స్పెషల్‌ క్వాలిటీ.

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ విషయానికి వస్తే, క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. రాశీ ఖన్నా, కేథరీన్‌ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసా బెల్లె హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో.

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆరెంజ్‌’ సినిమా తాలూకు షేడ్స్‌ ఈ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover Vijay Deverakonda) సినిమాలో కంటెంట్‌ ఎలాగున్నా, అంతకుమించి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) రేంజ్‌ ఆటిట్యూడ్‌తో ఈ సినిమాని అంతకు మించి అనే స్థాయికి తీసుకెళ్లగలడు.

ఇదిలా ఉంటే, పూరీ జగన్నాధ్‌ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)హీరోగా ఓ సినిమా త్వరలో పట్టాలెక్కబోతోంది.

కాగా, ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో విజయ్‌ (Vijay Deverakonda) హీరోగా ‘హీరో’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌.

Related Post

మృగాళ్లకు ‘మీ టూ’తో మూకుతాడు.!

Posted by - October 16, 2018 0
అన్యాయం జరిగింది’ అని గళం విప్పలేని దుస్థితి. అవకాశాల పేరుతో శీలం దోచేసినా, పెదవి విప్పలేని దుర్ఘతి. అరవయ్యేళ్ల ముసలాడు 18 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడినా…

ట్రైలర్‌ రివ్యూ: అరవింద సమేత – ఎన్టీఆర్‌ సత్తా.!

Posted by - October 3, 2018 0
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి కొత్త సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై వుండే అంచనాల తీరే వేరు. ఆకాశమే హద్దు.. అన్నట్లుంటాయి ఆ అంచనాలు. అలాంటిది మాటల…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *