యాతర.! క్రియేటివిటీకి పాతర! ధనమ్ మూలమ్.. ఇదమ్!
Yaathara Political Cinema ఓ దర్శకుడు నానా యాతనా పడి సినిమా తీశాడు.! ఎవరి కోసమైతే ఆ సినిమా తీశాడో, ఆ నాయకుడేమో, ఆ సినిమాని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించేలా హుకూం జారీ చేశాడు.
అదేంటీ, సినిమా అంటే కళ కదా.! కళాత్మక వ్యాపారం కదా.? ఉచితంగా సినిమాని చూపించడమేంటి.? పోనీ, సినిమా టిక్కెట్ల ధరలేమైనా తగ్గాయా.? తగ్గలేదాయె.!
థియేటర్లలో సినిమా ఆడుతోంది.. టిక్కెట్లు తెగుతున్నాయ్.! కాకపోతే, చూసేవాళ్ళకి మాత్రం ఉచితం. సదరు పార్టీ నాయకులే, టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు.
Yaathara Political Cinema.. బయట ఫుల్లు.. లోపల నిల్లు.!
బయటేమో హౌస్ ఫుల్ బోర్డు.! లోపలేమో, ఇక్క సీటులోనూ ప్రేక్షకుడు వుండడు. కొన్ని చోట్ల ఖాళీ ప్రదర్శనలు. మరికొన్ని చోట్ల, అసలు బొమ్మే పడటంలేదు.!
అసలు, ఇలాంటి సినిమా ఎందుకు తీసుకున్నట్టు.? దర్శకుడికి సదరు నాయకుడి నుంచి ‘లబ్ది’ చేకూరిందట.!
పార్టీ ఫండ్ ఏమైనా రెమ్యునరేషన్‌గా ఇచ్చారా.? అంటే, అదీ లేదాయె.! సదరు దర్శకుడికి, రెండెకరాల భూమిని అప్పనంగా రాసిచ్చేశారట.
అధికారం చేతుల్లో వుంటే, ఇదిగో ఇలాగే వుంటుంది.! రాజు తలచుకుంటే, రాళ్ళకి కరువా.? కొరడా దెబ్బలకి కరువా.? బహుమతులకు కరువా.? అని పెద్దలు ఊరకనే అన్లేదు మరి.!
ప్రజాస్వామ్యమిది.. రాచరికం కాదు.!
కానీ, ఇది ప్రజాస్వామ్యం.! ఇక్కడ, అలాంటివి కుదరవు.! కానీ, కుదురుతున్నాయ్.! ఒకడికేమో వోడ్కా బాటిల్ ఎర చూపిస్తే చాలు, సినిమా తీసేస్తాడు.
ఇంకొకడికేమో, ఇదిగో.. కాస్తంత ఖరీదైన బహుమతులు ఇవ్వాలి.! అదే, ఎకరాల చెప్పొన భూమి.! ఈ మాత్రందానికి ప్రెస్ మీట్లలో పులి, వేట.. ఇలాంటి సొల్లు ఎందుకు చెప్పడం.?
Also Read: వెండితెరపై విష ప్రయోగం! నువ్వు తినేది ‘కక్కిన కూడు’!
దక్కిన రెమ్యునరేషన్ అలాంటిది మరి.! సినిమాలు ఇలాక్కూడా తీస్తారా.? అనడక్కండి.! సినిమా అనేది ఇలాంటోళ్ళకి కళ కాదు.! వ్యాపారం.! నిఖార్సయిన యాపారం.!
ఔను, ఇది రాజకీయ సినిమా.! ఇక్కడింతే.! ఫిలిం మేకర్ కాదు.. ఆ ముసుగులో ఓ తాగుబోతు, ఓ దోపిడీ దారు.! అంతే కదా.! డౌటేముంది.?
గుమ్మడికాయల దొంగలూ.. నిర్లజ్జగా భుజాలు తడిమేసుకోవచ్చు.!
– yeSBee