Hbd Young Tiger NTR

యంగ్‌ టైగర్‌ అడుగుతున్న బర్త్‌ డే గిఫ్ట్‌ ఏంటంటే..

155 0

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Young Tiger NTR), తన అభిమానుల్ని ఉద్దేశించి బర్త్‌ డే గిఫ్ట్‌ (Young Tiger NTR Birthday Gift RRR) అడుగుతున్నాడు. ఈ నెల 20న యంగ్‌ టైగర్‌ పుట్టినరోజు. మే 20న తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో, నెల రోజుల ముందే.. ఆ మాటకొస్తే, మూడు నెలల ముందు నుంచే.. అభిమానులు హంగామా షురూ చేశారు.

యంగ్‌ టైగర్‌ అభిమానుల పవర్‌ అదీ. అయితే, తమ అభిమాన హీరో పుట్టినరోజునాడు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Movie) టీమ్ నుంచి ఓ అద్భుతమైన గిఫ్ట్‌.. వీడియో ప్రోమో రూపంలో వస్తుందని అంతా ఆశించారు.

అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆ గిఫ్ట్‌ ఇవ్వడం వీలు కావట్లేదంటూ చిత్ర నిర్మాణ సంస్థ (DVV Movies RRR) ఓ ప్రకటన విడుదల చేసింది. మరోపక్క టీజర్‌ వ్యవహారాల్ని చూసుకుంటోన్న రాజమౌళి (SS Rajamouli) తనయుడు కార్తికేయ (SS Karthikeya) కూడా ఈ విషయమై వివరణ ఇచ్చాడు. దాంతో అభిమానులు బాగా హర్టయ్యారు.

కొందరైతే, చిత్ర నిర్మాణ సంస్థపై విమర్శలు చేశారు. రాజమౌళిని ‘కట్టప్ప’తో పోల్చారు. కానీ, తన బర్త్‌ డే గిఫ్ట్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ పడ్డ కష్టాన్ని వివరిస్తూ యంగ్‌ టైగర్‌ (Young Tiger NTR) ఓ స్టేట్‌మెంట్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ద్వారా వివరించాడు.

Young Tiger NTR’s Appeal To Fans Regarding His Birthday Gift

అంతే కాదు, ’ఇంట్లోనే వుండండి.. క్షేమంగా వుండండి.. అదే మీరు నాకు ఇచ్చే బర్త్‌ డే గిఫ్ట్‌’ అని యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని ఉద్దేశించి తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger Jr NTR). కరోనా వైరస్‌ నేపథ్యంలో సెలబ్రిటీలు చెబుతూ వస్తున్న విషయం విదితమే.

చేతులు కడుక్కోవడం గురించీ, కరోనా పట్ల అప్రమత్తంగా వుండడం గురించీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తన కో-స్టార్‌, స్నేహితుడు కూడా అయిన మెగా పవర్‌స్టార్ (Mega Power Star Ram Charan)‌ రామ్ చరణ్‌తో కలిసి ఓ వీడియోలో కన్పించాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Nandamuri Taraka Ramarao).

Young Tiger NTR’s Request To His Fans Regarding Corona Virus (Covid-19)

ఇలాంటి సామాజిక బాధ్యత గల కార్యక్రమాల విషయంలో యంగ్‌ టైగర్‌ చూపే శ్రద్ధను ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే. ఇదిలా వుంటే, యంగ్‌ టైగర్‌ పుట్టినరోజు కానుక.. అదేనండీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి యంగ్‌ టైగర్‌ ప్రోమో వీడియో ఖచ్చితంగా రాబోతోంది.. కానీ, కాస్త లేటుగా.

క్వాలిటీ విషయంలో రాజీ పడే ఉద్దేశ్యం లేకనే.. వీడియో ప్రోమో రిలీజ్‌ ఆలస్యమవుతోందంటోన్న చిత్ర నిర్మాణ సంస్థ అభ్యర్థనా అర్థం చేసుకోదగ్గదే మరి.

Related Post

‘సాహో’రే.. ప్రభాస్‌ స్టామినా ఎంత.?

Posted by - August 6, 2019 0
తెలుగు సినిమా బాక్సాఫీస్‌ లెక్కల్ని మార్చేసిన సినిమా చేశాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Saaho Prabhas Stamina). తెలుగు సినిమాకి ఇలాంటి ఓ అద్భుతమైన రోజు…

మహేష్‌ ‘సూపర్‌’ మాస్‌: ‘సరిలేరు’ దద్దరిల్లిపోతుందంతే.!

Posted by - January 5, 2020 0
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు అభిమానులు, ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) అంటుంటారు. అదే ఇప్పుడు మహేష్‌బాబు (Super Star Maheshbabu) కొత్త సినిమా టైటిల్‌గా మారింది. జనవరి…
king nagarjuna bigg boss 3 telugu

బిగ్‌బాస్‌-3: ‘కింగ్‌’ నాగార్జున దమ్మెంత.?

Posted by - June 30, 2019 0
టాలీవుడ్‌ మన్మథుడు (Manmadhudu), కింగ్‌ నాగార్జునకి (King Nagarjuna) వెండితెరపై అద్భుతాలు చేయడమే కాదు, బుల్లితెరపై సంచలనాలు సృష్టించడమూ (Bigg Boss Telugu Season 3) తెలుసు.…
pawan kalyan

ఫోర్బ్స్‌ కింగ్స్‌: ప‘వన్’.. ఎన్టీఆర్‌ 2, మహేష్‌ 3

Posted by - December 5, 2018 0
ఫోర్బ్స్‌ (Forbes) 2018 లిస్ట్‌ బయటకు వచ్చింది. ఇండియాలో ఈ ఏడాది అత్యధిక సంపాదన కలిగిన ప్రముఖుల లిస్ట్‌లో టాప్‌ ఛెయిర్‌ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి…
RRR Movie

చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి.. ‘మెగా’ ఓపెనింగ్‌

Posted by - November 11, 2018 0
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత భారీ మల్టీస్టారర్‌గా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ వార్తల్లోకెక్కేసింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *