YS Jagan Pinnelli EVM.. ఏ పరిస్థితుల్లో అయినాసరే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ని ధ్వంసం చేస్తే అది నేరం.! ఇది చట్టం చెబుతున్నమాట. ఎన్నికల కమిషన్ నిబంధనల్లో దీన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
ఓ రాష్ట్రానికి ఐదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ‘ఈవీఎంని పగలగొట్టడం నేరం’ అని తెలియకపోవడమేంటి.? నేరం అని తెలిసీ, ఆ నేరాన్ని సమర్థించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
నిజానికి, పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి, పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడంటే, ఎంత కండకావరం.? ఎంత దుర్మార్గం.?
YS Jagan Pinnelli EVM.. నేరాన్ని నేరంగా చూడలేని మూర్ఖత్వం.!
ఈవీఎంని పగలగొట్టిన కేసులో నిందితుడైన వ్యక్తి తమ పార్టీకి చెందిన వ్యక్తి గనుక, అదసలు నేరమే కాదని.. ఓ ప్రజా ప్రతినిథి, ఓ పార్టీ అధినేత అనడం హాస్యాస్పదం.!
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లుంది పరిస్థితి. నేరం జరిగింది. అది వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనాసరే, నేరాన్ని నేరంగానే అంగీకరించాలి.
పోలింగ్ కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి.. తమకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి.. అని కుంటి సాకులు చెబుతూ, ఈవీఎంలను ధ్వంసం చేస్తే.. చట్టాలు చూస్తూ ఊరుకోవు.! చట్టాల్ని గౌరవించలేనోడు.. ఎన్నికల్లో పోటీ చేయడానికే నైతికంగా అనర్హుడు.
Mudra369
ఒకవేళ ఈవీఎం అనేదాన్ని పగలగొట్టడం నేరం కాకపోతే, కుంటి సాకులు చెబుతూ, ఇకపై ప్రతి రాజకీయ నాయకుడూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి వాటిని పగలగొడుతూనే వుంటారు కదా.?
ఈయనేనా ముఖ్యమంత్రిగా పనిచేసింది.?
ఈమాత్రం ఇంగితం కూడా లేని వ్యక్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేశారమంటే నమ్మగలమా.? నమ్మి తీరాలి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నెల్లూరు జైల్లో వున్న తమ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించారు.
Also Read: బిగ్ క్వశ్చన్: ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి.?
ములాఖత్‌లో పరామర్శించడం తప్పు కాదు. పరామర్శించి వచ్చాక, ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయిన తమ పార్టీ నాయకుడ్ని జగన్ వెనకేసుకురావడం తప్పే.!
తప్పు మాత్రమే కాదు, దీన్ని నేరంగా కూడా పరిగణించాల్సి వుంటుంది. ఎందుకంటే, ఈవీఎంలను ఎవరైనా ధ్వంసం చేయొచ్చన్నట్లుగా ఓ ప్రజా ప్రతినిథి, ఓ పార్టీ అధినేత సంకేతాలు ఇస్తున్నట్లే వుంది మరి.!