Table of Contents
Thalapathy TVK Vijay Jananayagan.. సినిమా లీక్.. ఇది చాలాకాలంగా వింటున్నమాటే.! పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజ్‌కి ముందే లీక్ అయ్యింది.! పైరసీ బారిన పడింది.
విజయ్ దేవరకొండ కూడా ఈ పైరసీ బాధితుడే. చాలాకాలం క్రితం, మహేష్‌బాబు సినిమా ‘అర్జున్’ పైరసీ బారిన పడినప్పుడు, సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ మాత్రమే, మహేష్‌కి బాసటగా నిలిచారు.
పైరసీ అనేది కొత్త మార్గాల్లో ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమని వేధిస్తూ వస్తోంది. పైరసీ అంటే, అదొక క్యాన్సర్.. అంటారు చాలామంది సినీ ప్రముఖులు. అందులో నిజం లేకపోలేదు కూడా.
తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ రాజకీయ వివాదాలతో విడుదలకు నోచుకోవడంలేదన్నది అందరికీ తెలిసిన విషయమే.
Thalapathy TVK Vijay Jananayagan.. లీక్.. సినిమాటిక్ రాజకీయం.!
తాజాగా, ‘జననాయగన్’ సినిమా లీక్ అయ్యింది. ఇది మన తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’కి అనధికారికంగా తమిళ రీమేక్. ఆ సంగతి పక్కన పెడితే, సినిమా లీక్ వ్యవహారం పెను దుమారానికి కారణమయ్యింది.
ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. టీవీకే అనే పార్టీ ద్వారా రాజకీయాల్లకి వచ్చారు ‘దళపతి’ విజయ్.!
ఇలా విజయ్ రాజకీయాల్లో రావడం, కొందరికి నచ్చలేదు తమిళనాడులో. ఆ కొందరు ఎవరో కాదు, అధికార పార్టీ నాయకులు. దాంతో, విజయ్ సినిమా రిలీజ్‌కి ఆటంకాలేర్పడ్డాయి.
‘జననాయగన్’కి మద్దతుగా నిలిచిన సినీ పరిశ్రమ
సినిమాలో, టీవీకే తరఫున ప్రమోషన్స్ గట్టిగా చేసుకున్నారన్న వాదనలు లేకపోలేదు. అది మళ్ళీ వేరే చర్చ. ‘జననాయగన్’ లీక్ అయ్యిందన్న ప్రచారంతో ఒక్కసారిగా భారతీయ సినీ పరిశ్రమ అవాక్కయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు, విజయ్‌కి బాసటగా నిలిచారు. పైరసీపై పోరాటం దిశగా, ప్రతి ఒక్కరూ గళం విప్పుతున్నారు.
Also Read: అందం, అణకువ.. ఆపై టాలెంట్! మానస శర్మ ‘రాకాస’ హిట్టు బొమ్మ!
సెన్సార్ బోర్డ్ నుంచే లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో, సదరు సెన్సార్ బోర్డ్ కూడా స్పందించింది. తమ వద్ద నుంచి కంటెంట్ లీక్ అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పింది.
సినిమా లీక్ అవడం వల్ల విజయ్‌కి ఎంత నష్టం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నిర్మాణ సంస్థ మాత్రం తీవ్రంగా నష్టపోతోందన్నది నిర్వివాదాంశం.
రాజకీయంగా కలిసొచ్చేదెంత.?
ఇక, విజయ్‌కి పరోక్షంగా ఈ రాజకీయ వివాదాలు, లీక్ వ్యవహారం కలిసొస్తున్నాయి. విజయ్‌కి పొలిటికల్‌గా కూడా సింపతీని తీసుకొస్తోంది ‘జననాయగన్’ సినిమా.
అదెంత.? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తమిళనాడు రాజకీయాలు ఒకింత భిన్నంగా వుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. తమిళ రాజకీయాల్ని, సినిమాల్ని విడదీసి చూడలేం.
సినిమాటిక్ రాజకీయాలు.. తమిళనాట సమ్‌థింగ్ వెరీ స్పెషల్ అంతే.!
