Home » అప్పుడు ‘నో’ చెప్పకుండా.. ఇప్పుడు యాగీ చేస్తే ప్రయోజనమేంటి.?

అప్పుడు ‘నో’ చెప్పకుండా.. ఇప్పుడు యాగీ చేస్తే ప్రయోజనమేంటి.?

by hellomudra
0 comments
Sameera Reddy

Sameera Reddy Padding Stunts.. సమీరా రెడ్డి గుర్తుందా.? తెలుగులో ‘జై చిరంజీవ’, ‘అశోక్’, ‘నరసింహుడు’ తదితర సినిమాల్లో నటించింది కదా.. ఆమె గురించే.!

ఇప్పుడెందుకు సమీరా రెడ్డి గురించిన టాపిక్.? అంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి గనుక.

కాదేదీ వివాదానికి అనర్హం.. అన్నట్టు, కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడు పెగలని గొంతులు, ఇప్పుడు పెగులుతున్నాయ్ మరి.! వివాదమే పబ్లిసిటీ అయి కూర్చుంది మరి.!

సినిమాలు మానేసి, ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది సమీరా రెడ్డి ప్రస్తుతం.

ఏమో, ఏం పబ్లిసిటీ కావాల్సి వచ్చిందో.. ఒకప్పుడు, ‘బ్రెస్ట్ ప్యాడ్స్, బట్ ప్యాడ్స్’ పెట్టుకోమని ఒత్తిడి తెచ్చారంటూ సమీరా రెడ్డి ఆరోపణలు చేసింది ఓ ఇంటర్వ్యూలో.

Sameera Reddy Padding Stunts.. ఎవరు సూచించారో.. ఎవరు ఒత్తిడి తెచ్చారో..

ఫ్లాట్‌గా వున్న తన బ్యాక్ పార్ట్ అందంగా కనిపించేందుకోసం బట్ ప్యాడ్స్ వాడమని చెప్పారనీ, అలాగే బ్రెస్ట్ ప్యాడ్స్ వాడమని సూచించారని సమీరా రెడ్డి ఆరోపించింది.

దాదాపు ఇవే తరహా వ్యాఖ్యలు మరో నటి దియా మీర్జా కూడా ఓ ఇంటర్వ్యూలో చేసింది. లిప్స్ పలచగా వున్నాయనీ, వాటిని ఫిల్ చేసుకోమని దియా మీర్జాకి సూచించారట.

అన్నట్టు, దియా మీర్జాకి కూడా బ్రెస్ట్ ప్యాడ్స్ వాడమని దర్శక నిర్మాతలు సూచించారట, ఆ దిశగా ఆమెపై ఒత్తిడి తెచ్చారట కూడా.

సినిమా అంటేనే గ్లామర్.. అదో మాయా ప్రపంచం. లేనిది వున్నట్లు.. వున్నది లేనట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు సినిమా జనాలు. ఇందులో వింతేముంది.?

కొన్నాళ్ళ క్రితం నటి షెర్లీన్ చోప్రా, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తొలగించుకున్న సంగతి తెలిసిందే. గ్లామర్ కోసం, సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నా, అది తప్పని తెలిసిందని చెప్పిందామె.

Sherlyn Chopra
Sherlyn Chopra

ఆ సిలికాన్ ఇంప్లాంట్స్ తొలగించుకున్నాక, సోషల్ మీడియా వేదికగా షెర్లీన్ చోప్రా చేసిన, చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్ అన్నీ ఇన్నీ కావు.!

ఇంతకీ, బ్రెస్ట్ అండ్ బట్స్ అందంగా కనిపించేందుకు ‘ప్యాడ్స్’ వాడమని సమీరా రెడ్డికి చెప్పిన దర్శక నిర్మాతలెవరు.? పేర్లు చెప్పేస్తే, సస్పెన్స్ ఏముంటుంది.?

ఇంకోసారి వార్తల్లోకెక్కాలనుకుంటే, అప్పుడు వెల్లడిస్తుందేమో సమీరా రెడ్డి ఆ పేర్లని.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group