Home » ‘దళిత క్రైస్తవం’పై ‘సుప్రీం’ ఉక్కుపాదం! దొంగ లెక్కలు తేలాలిక.!

‘దళిత క్రైస్తవం’పై ‘సుప్రీం’ ఉక్కుపాదం! దొంగ లెక్కలు తేలాలిక.!

by hellomudra
0 comments
Supreme Court

Supreme Court Christianity Conversions.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎంతలా దుర్వినియోగమవుతోందో చెప్పడానికి, వందలాది వేలాది లక్షలాది కేసులున్నాయ్.!

ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని, ‘దందా’ చేయాలనుకున్నాడో చర్చి పాస్టర్.! కులం పేరుతో దూషించారనీ, తనపై దాడి చేశారనీ పోలీసుల్ని ఆశ్రయించాడా ప్రబుద్ధుడు.

కట్ చేస్తే, చర్చి పాస్టర్ కదా.. అతను దళితుడెలా అవుతాడు.? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టమెలా వర్తిస్తుంది.? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం వరకూ వెళ్ళింది. మతం మారితే, దళిత హోదా కోల్పోతారంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

దీనికి సంబంధించి, రాజ్యాంగంలో స్పష్టత వుందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో బాధితులకు ఊరట దక్కింది. చర్చి పాస్టర్‌కి గూబ గుయ్యిమంది.

తగుదునమ్మా.. అంటూ, ఇంకోసారి సర్వోన్నత న్యాయస్థానంలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడా ప్రబుద్ధుడు. అతని పేరు చింతాడ ఆనంద్. ఆంధ్ర ప్రదేశ్‌లోని బాపట్లకి చెందిన వ్యవహారమిది.

రాజ్యాంగంలో మత మార్పిడుల విషయమై స్పష్టత వుంది. మతం మారితే, దళిత హోదా కోల్పోతారనీ స్పష్టంగా పేర్కొనబడి వుంది రాజ్యాంగంలో.

అయినాగానీ, ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని అనుసరించడం లేదు మత మార్పిడుల విషయంలో. చాలామంది ప్రజా ప్రతినిథులే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.

ఓ వైపు క్రైస్తవంలోకి మారిపోయి, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు.. విదేశాల నుంచి వస్తున్న నిధుల కారణంగా. మరోపక్క, దళిత కోటాలో రిజర్వేషన్లు సహా.. ఇతర ప్రయోజనాలూ పొందుతున్నారాయె.

ఇకపై అలా కుదరదు.! సర్వోన్నత న్యాయస్థానం రివ్యూ పిటిషన్‌ని కూడా కొట్టి పారేసిన దరిమిలా, ప్రభుత్వాలదే బాధ్యత.. హిందూ దళితులకు మాత్రమే, రిజర్వేషన్ల ప్రయోజనాల్ని కల్పించాలి.

నిజానికి, ఇదేమంత కష్టమైన పని కాదు.! కాకపోతే, ఓటు బ్యాంకు రాజకీయాల్ని పెంచి పోషించే పార్టీలు, ప్రభుత్వాలు.. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి భయపడుతున్నాయంతే.

దళిత క్రైస్తవం.. అంటూ, నిస్సిగ్గుగా బహిరంగ సభలు పెడుతూ, హిందూ దేవుళ్ళను దూషించడం ఇటీవలి కాలంలో ఫ్యాషన్ అయిపోయింది.

ఈ నేపథ్యంలో, మత మార్పిడుల మాఫియాపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సిందే.! ఒక్క కేసు, దేశవ్యాప్తంగా దళిత హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చింది.

తమ హక్కుల్ని లాగేసుకుంటున్న మత మార్పిడి ముఠాలపై మండిపడుతోంది దళిత హిందూ సమాజం. అసలంటూ క్రైస్తవంలో కుల ప్రస్తావనే లేదు.!

హిందూ మతంలోని కుల వ్యవస్థని తూలనాడి కదా.. క్రైస్తవం ముసుగులో మత మార్పిడి ముఠా దుష్ప్రచారం చేసేది.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group