Allu Arjun Raaka Leaks.. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘రాకా’ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతికతను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
‘పుష్ప’ సిరీస్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ నటుడిగానూ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్.. అంటున్నాడు ఐకాన్ స్టార్.
‘రాకా’ సినిమా కోసం అత్యద్భుతమైన సెట్స్ వేయడమే కాదు, సినిమాకి సంబంధించిన ఏ ఇంపార్టెంట్ సమాాచారం కూడా లీక్ అవకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయినాగానీ, పుకార్ల రూపంలో ‘రాకా’ సినిమాకి సంబంధించిన లీకులు బయటకు వచ్చేస్తున్నాయి. ఇవి ఎలా వస్తున్నాయ్.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
తొలిసారిగా అల్లు అర్జున్ ‘ట్రిపుల్ రోల్’లో ఈ ‘రాకా’ సినిమా కోసం కనిపించబోతున్నాడన్నది గత కొద్ది రోజులుగా హల్‌చల చేస్తున్న గాసిప్.
ఈ విషయమై చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ స్పందించలేదు.. కొద్ది రోజుల తర్వాత అయినా స్పందిస్తుందా.? అంటే, అదీ అనుమానమే.
ఈ ‘ట్రిపుల్ రోల్’ గాసిప్, కేవలం పుకారు మాత్రమే కాదు ‘లీక్’ అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొన్నాళ్ళుగా సినిమాలకు సంబంధించిన కీలక సమాచారం, విడుదలకు ముందే లీకుల రూపంలో బయటకు వచ్చేస్తూ, సినిమాలపై ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేస్తోంది.
చాలా సందర్భాల్లో ఈ గాసిప్పులు ఉత్తుత్తి పుకార్లుగానే మిగిలిపోతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, ‘రాకా’ విషయంలో బయటకు వస్తున్న గాసిప్పుల్లో నిజమెంత.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్సే.
పుకార్లను ఖండించకపోయినా ఫర్లేదుగానీ, ‘లీకులు’ జరగకుండా ‘రాకా’ టీమ్ తగిన చర్యలు ఇంకా పకడ్బందీగా తీసుకోవాల్సిందేనేమో.!
