Navya Swamy Nagavamsi Affair.. అతడో నిర్మాత.! యువకుడు, పైగా ఉత్సాహవంతుడు. ఆమె ఓ బుల్లితెర నటి. వెండితెరపైనా తళుక్కుమంది.!
ఆమె పేరు నవ్య స్వామి. అతని పేరు నాగవంశీ. తెలుసు కదా, నాగవంశీ నిర్మించిన ‘బుట్టబొమ్మ’ సినిమాలో నవ్య స్వామి ఓ కీలక పాత్రలో నటించింది.
బుల్లితెరపై పలు సీరియల్స్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్న నవ్య స్వామికి, అదే బుల్లితెరకు చెందిన నటుడు రవి కృష్ణ స్నేహితుడు.
అన్నట్టు, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ద్వారా రవికృష్ణ ‘మంచి బాలుడు’గా పాపులర్ అయ్యాడు. కొన్ని టీవీ షోస్ ఈ ఇద్దరి మధ్యా ‘లవ్’ అంటూ, చేసిన స్కిట్స్ తెగ పాపులర్ అయ్యాయి.
రవి కృష్ణ కేవలం తనకు స్నేహితుడు మాత్రమేనని పలు సందర్భాల్లో నవ్య స్వామి స్పష్టత ఇచ్చింది. మరో వైపు రవి కృష్ణదీ ఇదే బాపతు వివరణ.!
Navya Swamy Nagavamsi Affair.. పెయిడ్ నెగెటివిటీ వెనుక వున్నదెవరు.?
ఇంతకీ, నాగవంశీతో నవ్య స్వామికి ‘ఎఫైర్’ అంటగట్టి, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నదెవరు.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.!
ఏదో ఒక వీడియో, ఏదో ఒక ఫొటో, ఏదో ఒక కామెంట్.. అప్పటికప్పుడు వైరల్ అయిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో పెయిడ్ నెగెటివిటీ కూడా జరుగుతుందనుకోండి.. అది వేరే సంగతి.

‘బుట్టబొమ్మ’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో నాగవంశీ గురించి చాలా సాధారణంగా నవ్య స్వామి చేసిన కామెంట్స్ తీసుకొచ్చి, ‘చింప్టూ బాబు ఆటగాడే..’ అంటూ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.
వేలల్లో కాదు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి ఆ వీడియోలకి. తెలుసు కదా, ‘ఎక్స్’ (ఒకప్పటి ట్విట్టర్), ఈ తరహా వైరల్ కంటెంట్‌కి గట్టిగానే ‘ఫే ఔట్స్’ ఇస్తోందని.!
అద్గదీ అసలు సంగతి.! నవ్య స్వామి – నాగవంశీ మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీలు చాలామంది ఈ తరహా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
నాగవంశీకి ఈ ట్రోల్స్ కొత్తేమీ కాదుగానీ..
నిజానికి, నవ్య స్వామికి సోషల్ మీడియాలో పెద్దగా నెగెటివిటీ ఏమీ లేదు. కానీ, నాగవంశీ వ్యవహారం వేరు. నిత్యం అతన్ని ట్రోల్ చేస్తూనే వుంటారు కొందరు.
‘దేవర’ సినిమా వసూళ్ళ విషయమై నాగవంశీ మీద వచ్చిన నెగెటివిటీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ, ఈ విషయమై నాగవంశీ టార్గెట్ అవుతూనే వుంటాడు.

‘వార్-2’ సినిమా విషయంలో కావొచ్చు, మరో సినిమా విషయంలో కావొచ్చు.. వేరే వేరే అంశాల మీద కావొచ్చు.. నాగవంశీ ఏ కామెంట్ చేసినా, అది వైరల్ అవుతుంటుంది.. ట్రోల్ అవుతుంటుంది.
అదంతా, వేరే వ్యవహారం. కానీ, ఓ నటి పేరుని తీసుకొచ్చి ‘ఎఫైర్’ అంటూ పుకార్లు పుట్టించి, నెగెటివిటీ సృష్టించి.. ట్రోల్ చేయడం సమర్థనీయం కాదు.
