Niharika Konidela National Award.. మెగా ప్రిన్సెస్.. అంటారు ఆమెని.!
తొలుత బుల్లితెరపై, ఆ తర్వాత వెండితెరపై సందడి చేసింది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక గురించే ఇదంతా.
వ్యక్తిగత జీవితంలో, విడాకుల వ్యవహారం నిహారికని కాస్త కుంగదీసిన మాట వాస్తవం. విపరీతమైన ట్రోలింగ్‌ని ఎదుర్కొంది నిహారిక.
నటిగా సరైన సక్సెస్‌లు దొరకలేదు.. ఇంతలోనే నిర్మాతగా మారింది. ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాని తెరకెక్కించింది. సినిమా బావుంది.. కానీ, పెయిడ్ నెగెటివిటీ ఆమెను ఇబ్బంది పెట్టింది.
నిహారిక మీద ఎంత విషం చిమ్మారంటే, ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా హిట్టయినా.. ఆ సినిమా మీద విపరీతమైన నెగెటివిటీని చాలా రోజుల వరకూ కొనసాగించేంతలా.
ఓటీటీలోకి వచ్చాక కూడా ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా మీద విషం చిమ్ముతూనే వచ్చింది ఓ బ్యాచ్. ఇప్పుడు అదే బ్యాచ్, ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాకి రెండు జాతీయ పురస్కారాలు వచ్చినా, నెగెటివిటీ కొనసాగిస్తూనే వుంది.
ఇక, పనిగట్టుకుని చేసే ఈ పెయిడ్ నెగెటివిటీని పక్కన పెడితే, చాలా ఏళ్ళ క్రితం ‘రుద్రవీణ’ సినిమాకి గాను నిర్మాతగా నాగబాబు, జాతీయ పురస్కారం అందుకున్నారు.
ఆ మ్యాజిక్‌ని కుమార్తె నిహారిక ఇన్నేళ్ళ తర్వాత రిపీట్ చేయడంతో, నాగబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెగా కాంపౌండ్‌లో పండగ వాతావరణం నెలకొంది.
జాతీయ పురస్కారాల్లో, ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలోనూ అలానే ఉత్తమ మేకప్ విభాగంలోనూ ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా ఎంపిక కావడం డబుల్ ధమాకా అన్నమాట.
అన్నట్టు, ‘పుష్ప-2’ సినిమాకి కూడా జాతీయ పురస్కారాల్లో రెండు కేటగిరీల్లో పురస్కారాలు దక్కాయి. కాస్ట్యూమ్స్, స్క్రీన్ ప్లే విభాగాల్లో పుష్క ఈ పురస్కారాల్ని దక్కించుకుంది.
‘35 చిన్న కథ కాదు’ సినిమాకి కూడా రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. అయితే, నటిగా అత్యుత్తమ నటనా ప్రతిభను ప్రదర్శించిన నివేదా థామస్‌కి ఉత్తమ నటి కేటగిరీలో పురస్కారం దక్కకపోవడం దురదృష్టకరం.
డైలాగ్స్ కేటగిరీలో ‘లక్కీ భాస్కర్’ సినిమాకి ఓ జాతీయ పురస్కారం దక్కింది. ‘కల్కి’ సినిమాకి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి.
