Table of Contents
Happy Birthday Anil Ravipudi.. పూర్తి అంధుడైన హీరోతో, బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ చేయించేసి.. హిట్టు కొట్టేశాడు అనిల్ రావిపూడి.! ఇక్కడ లాజిక్కులు అనవసరం.!
దర్శకుడు అనిల్ రావిపూడి తీసే సినిమాల్లో ‘రాజా ది గ్రేట్’ వెరీ వెరీ స్పెషల్.! ఆ సినిమా ట్రోల్ అయినంతగా, ఇంకే ఇతర సినిమా ట్రోల్ అయి వుండదు.!
క్రింజ్ కామెడీ అంటే, అనిల్ రావిపూడి.. అనే చర్చ తరచూ తెరపైకొస్తుంటుంది. కానీ, సినిమాల్లో సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అనిల్ రావిపూడి వేరే లెవల్.!
తొలి సినిమా ‘పటాస్’ దగ్గర్నుంచి, మొన్నటి సంక్రాంతి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకూ.. సినిమా సినిమాకీ, తన రేంజ్‌ని పెంచుకుంటూ వెళుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
Happy Birthday Anil Ravipudi.. ఎవరేమనుకున్నా.. ఎంటర్టైన్మెంట్ ముఖ్యం..
సినీ రంగంలో, రచయితగా కెరీర్ ప్రారంభించి, అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన అనిల్ రావిపూడి, నిజానికి.. చాలా సింపుల్‌గా కనిపిస్తాడు.
మాటల్లో గొప్పలుండవ్.. చేతలు మాత్రం, చాలా చాలా గొప్పగా వుంటాయ్.! సినిమాకి కామెడీ కావాలి.. ఎమోషన్ పాళ్ళూ సరిగ్గా సెట్టవ్వాలి. గ్లామర్ సంగతి సరే సరి.! యాక్షన్ కూడా తప్పనిసరి.!
ఇలా, అనిల్ రావిపూడి ఓ సినిమాకి సంబంధించి వేసుకునే లెక్కలు అన్నీ పక్కగా వుంటాయ్. ఎవరేమనుకున్నాసరే, ‘ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశానా.? లేదా.?’ అని మాత్రమే అనిల్ రావిపూడి చూసుకుంటాడు.
అనిల్ రావిపూడి సినిమాలు రిచ్‌గా వుంటాయ్.. షూర్ షాట్ హిట్స్ అవుతాయ్.! అందుకే, అగ్ర హీరోలు సైతం అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.
కామెడీ మాత్రమే కాదు.. అంతకు మించి..
‘భగవంత్ కేసరి’ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చిదంటే, అనిల్ రావిపూడి ‘కేవలం కామెడీ కాదు.. అంతకు మించి’ అని అర్థం చేసుకోవాల్సిందే.. తప్పదు.!
క్రమం తప్పకుండా అనిల్ రావిపూడి సినిమాలు చేస్తూనే వున్నాడు. సంక్రాంతి సినిమాల దర్శకుడిగా మారిపోయాడు.
తన సినిమాల పనుల్లో నిత్యం బిజీగా వుండటమే కాదు, ఇతర సినిమాల్ని ప్రమోట్ చేయడంలోనూ అనిల్ రావిపూడి ముందుంటాడు. అంత తీరిక ఎలా దొరుకుతుందో ఏమో.!
అందుకే, అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో అందరివాడు.! హీరోగా ట్రై చెయ్యొచ్చు కదా.. అని, అనిల్ మీద తరచూ కామెంట్స్ పడుతూనే వుంటాయ్. ఆ స్టామినా వున్నోడు కూడా.!
సినిమా తీసేస్తే సరిపోదు..
‘ఎఫ్-2’ కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి భలే కనెక్ట్ అయిపోయాడు అనిల్ రావిపూడి. కాదు కాదు, అనిల్ సినిమాలకే ఫ్యామిలీ ఆడియన్స్ ‘ఎడిక్ట్’ అయిపోయారు.
సినిమా తీసేస్తే సరిపోదు.. సినిమా తీయాలనుకున్నప్పటి నుంచీ, ఆ సినిమా విశేషాలు హాట్ టాపిక్ అవ్వాలి.. ట్రెండింగ్‌లో వుండాలి. ఇదీ అనిల్ రావిపూడి స్ట్రేటజీ.
అనిల్ రావిపూడి సినిమాలు విపరీతంగా ట్రోల్ అవుతాయ్.. కానీ, ఆ సినిమాల వసూళ్ళు చాలా గట్టిగా మాట్లాలడతాయ్.!
క్రింజ్ కామెడీ.. అనే విమర్శలొస్తాయ్.. అదే సమయంలో, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.. అనే ప్రశంసల వర్షమూ కురుస్తుంటుంది అనిల్ రావిపూడి మీద. అదే మ్యాజిక్కు.
సంక్రాంతి సంచలనం..
సంక్రాంతి బరిలో వేరే ఏ సినిమాలున్నా, తన సినిమాకి వచ్చే ఆడియన్స్ కూడా ఖచ్చితంగా వుంటారని బలంగా నమ్ముతాడు అనిల్ రావిపూడి. పండగలాంటి సినిమాలు తీసుకొస్తుంటాడు మరి.
షరామామూలుగానే, మళ్ళీ రానున్న సంక్రాంతికి కూడా తన కొత్త సినిమా తీసుకొస్తున్నాడు అనిల్ రావిపూడి. చూస్తున్నాం కదా.. ప్రమోషన్లు ఎలా చేసేస్తున్నాడో.!
సంక్రాంతితో సరిపెడితే ఎలా.? ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, దసరా పండగని కూడా టార్గెట్ చేసుకోవచ్చు కదా.. అసలే, ఈ మధ్య దసరా సీజన్ వెలవెలబోతోంది.. సరైన తెలుగు సినిమాలు లేక.!
ఏమంటావ్ అనిల్ రావిపూడీ.! సంక్రాంతికి దసరా ఎంటర్టైన్మెంట్ తోడైతే.. ఆ కిక్కే వేరప్పా.!
హ్యాపీ బర్త్ డే అనిల్ రావిపూడి.!