Vishnupriya JD Marriage Rumors.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఫేం విష్ణు ప్రియ వయసెంత.? నటుడు జేడీ చక్రవర్తి వయసెంత.?
అసలు విష్ణుప్రియ, జేడీ చక్రవర్తి మధ్య ఏం నడుస్తోంది.? జేడీ చక్రవర్తికి విష్ణుప్రియ ఎలా శిష్యురాలు అయ్యింది.? అసలేంటీ కథ.?
విషయమేంటంటే, విష్ణుప్రియ తనకు శిష్యురాలని జేడీ చక్రవర్తి స్వయంగా వెల్లడించాడు. వ్యక్తిత్వ వికాసం, మెడిటేషన్.. ఇలాంటి విషయాల్లో శిష్యురాలట.
కానీ, ఓ ఇంటర్వ్యూలో ‘మీ ఇద్దరికీ పెళ్ళట కదా..’ అంటూ అడిగేశారు. దాంతో, విషయం ముదిరి పాకాన పడింది. యూ ట్యూబ్ ఛానళ్ళలో, వెబ్ సైట్లలో మోత మోగిపోయింది రకరకాల గాసిప్పులతో.
Vishnupriya JD Marriage Rumors.. వివాదం.. ప్రచారం..
‘కాదు మొర్రో..’ అంటూ జేడీ చక్రవర్తి ఎంత వివరణ ఇచ్చుకుంటున్నా, ‘ఇద్దరి మధ్యా భంచిక్..’ అంటూ పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి.
‘తప్పు.. నేను గురువు, ఆమె శిష్యురాలు.. గురు శిష్యుల మధ్య అలాంటి అక్రమ సంబంధాలు అంటగట్టొద్దు’ అని మీడియాకి చురకలంటించాడు ఇంటర్వ్యూలతోనే జేడీ చక్రవర్తి.
మీ సినిమాలోనే చూపిస్తున్నారు కదా, టీచర్ – స్టూడెంట్ మధ్య ఎఫైర్ల గురించి.. అని మీడియా కూ ప్రశ్నిస్తోంది జేడీ చక్రవర్తిని. అది వేరు, ఇది వేరు.. అని బుకాయించాల్సి వస్తోంది జేడీ చక్రవర్తికి.
Also Read: ఇది ఆమె కథ.! కాదు, వ్యధ.!
ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై విష్ణుప్రియ ఎక్కడా స్పందించలేదు. ఆమె వేేరే లోకంలో వుంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ రచ్చలో ఆమె బిజీగా వుంది.
ఈ మధ్య కాంట్రవర్సీ అనేది ఓ రకమైన పబ్లిసిటీ స్టంట్. ‘గాయపడ్డ సింహం’ సినిమాలో నటిస్తున్న జేడీ చక్రవర్తి, ఈ కాంట్రవర్సీతో వార్తల్లోకెక్కతున్నాడు. సినిమాకి కూడా పబ్లిసిటీ పరంగా మైలేజ్ వస్తోంది.
