Home » మురుగన్ ఎవరు? తెలుగు దేవుడా.? తమిళులకే సొంతమా.?

మురుగన్ ఎవరు? తెలుగు దేవుడా.? తమిళులకే సొంతమా.?

by hellomudra
0 comments
Murugan

Telugu Vs Tamil Murugan..పెద్ద చిక్కే వచ్చి పడింది.! దేవుడికిప్పుడు ప్రాంతీయ విద్వేషాలు వచ్చిపడ్డాయ్.!

అతను మీ దేవుడు.. మాకు ఎలా దేవుడవుతాడు.? అన్న వాదనలు, తెలంగాణ ఉద్యమంలో వినిపించాయి.

ఇప్పుడు ఇంకా చిత్రంగా తమిళ దేవుడు, తెలుగు దేవుడంటూ.. కొత్త వాదనలు తెరపైకొచ్చాయి. ఇదంతా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కారణంగానే.

సుబ్రహ్మణ్యస్వామి, కార్తికేయ, స్కంధ.. ఇలా చాలా పేర్లున్నాయ్.! కుమారస్వామి అనే పేరు కూడా వుంది. శివ పార్వతుల తనయుడే ఈ కుమారస్వామి.

శివ పార్వతులకు మరో కుమారుడుతున్నాడు.. అతడే వినాయకుడు. అందరికీ వినాయకుడు తెలుసుగానీ, ఈ కుమారస్వామి ఎవరు.? కుమారస్వామి తెలియకపోవడమేంటి.?

Telugu Vs Tamil Murugan.. వినాయకుడి సోదరుడే కదా మురుగన్..

వినాయక వ్రతకల్పంలో ప్రస్తావన వుంటుంది కదా.!? ప్చ్, అలా మర్చిపోతే ఎలా.? ఎవరు మర్చిపోయారు.? ఎందుకు మర్చిపోతారు.?

వినాయకుడికి గణపతి అనే పేరు కూడా వుంది కదా.! అలాగే, కుమారస్వామికి కూడా చాలా పేర్లున్నాయి. అందులో ‘మురుగన్’ కూడా ఒకటి.

Telugu Tamil Murugan
Telugu Tamil Murugan

తమిళనాట ‘మురుగన్’ అని అంటుంటారు. అంతమాత్రాన ఆ మురుగన్ తెలుగు వారికి పరాయివాడైపోతాడా.? ఛాన్సే లేదు.!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి కైంకర్యాలు తమిళ సంప్రదాయంలో ఎక్కువగా జరుగుతుంటాయి. తెలుగునాట కూడా చాలా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఇదే పరిస్థితి.

అంతెందుకు, నరసింహస్వామి దేవాలయాల్లో కూడా, తమిళ పద్ధుతులు కనిపిస్తుంటాయి. శ్రీరాముడ్ని నార్త్ ఇండియన్ దేవుడు.. అంటారు కొందరు.

రాములోరికే తప్పలేదు..

కాదు కాదు, మా భద్రాద్రి రాముడు.. అంటాం మనం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, భద్రాద్రితోపాటు ఒంటిమిట్ట రామతీర్థం దేవస్థానాల్లో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతాయి.

అయినా, దేవుళ్లకి ప్రాంతీయతను అంటగట్టడమేంటి నాన్సెన్స్ కాకపోతే.! సినిమా ట్రోలింగ్ అనేది పిచ్చితనానికి మారుపేరుగా మారిపోయింది కాబట్టే, ‘మురుగన్’ చుట్టూ ఈ వివాదం.

తెలుగు వర్సెస్ తమిళ్ మాత్రమే కాదు.. నార్త్ వర్సెస్ సౌత్ వివాదం కూడా వచ్చి ఏడ్చింది ఈ త్రివిక్రమ్ – ఎన్టీయార్ సినిమా పుణ్యమా అని.

శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలు, తెలుగునాట చాలానే కనిపిస్తాయ్. ఆ విషయం చాలామందికి తెలిసే వుటుంది.

Also Read: కూర్మం.. శుభం.! ఇంట్లో ‘తాబేలు’ని పెంచితే మంచి జరుగుతుందా?

ఉభయ గోదావరి జిల్లాలలో సుబ్బారాయుడి షష్టి చాలా ఫేమస్.. ఆ సుబ్బారాయుడే, ఈ సుబ్రహ్మణ్యస్వామి.

ఆ సుబ్రహ్మణ్యస్వామినే కార్తికేయుడంటాం.. కుమారస్వామి అని కూడా అంటాం. మురుగన్ అని తమిళోళ్ళు అంటారు.

పిలుపులో మాత్రమే చిన్నపాటి భిన్నత్వం.. మురుగన్ అన్నా, కుమారస్వామి అన్నా.. ఇద్దరూ ఒకటే.

తెలుగు సినిమా వర్సెస్ తమిళ సినిమా.. తెలుగు దేవుడు వర్సెస్ తమిళ దేవుడు.. ఈ ట్రోలింగ్ ఏంటి మరి.? అంటే, అదంతే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group