Home » రావణుడు చెడ్డోడు కాకపోతే, రాముడే చెడ్డోడా సాయి పల్లవీ.?

రావణుడు చెడ్డోడు కాకపోతే, రాముడే చెడ్డోడా సాయి పల్లవీ.?

by Mudra369 Editorial Desk
0 comments
Sai Pallavi

Sai Pallavi Ravana Love.. సాయి పల్లవికి వివాదాలేమీ కొత్త కాదు. తెలిసి మాట్లాడుతుందో, తెలియక మాట్లాడుతుందోగానీ.. వివాదాల్ని కొనితెచ్చుకుంటుంటుందామె.. అదీ, చాలా తేలిగ్గా.!

తాజాగా, రావణుడు మరీ అంత చెడ్డేడేమీ కాదు.. అంటూ, సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.. అదీ, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.

రణ్‌బీర్ కపూర్ – సాయి పల్లవి కలిసి నటించిన బాలీవుడ్ సినిమా ‘రామాయణ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్‌లో ఈ సినిమా ప్రివ్యూని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ప్రదర్శన నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాతో సినిమా టీమ్ ముచ్చటించింది. ఓ ఇంటర్నేషనల్ మీడియా జర్నలిస్ట్, సాయి పల్లవికి పలు ప్రశ్నలు సంధించాడు.

Sai Pallavi Ravana Love.. ఎత్తుకెళ్ళినోడు మంచోడైతే…

ఓ ప్రశ్నకు బదులిస్తూ, ‘రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు..’ అంటూ సాయి పల్లవి వ్యాఖ్యానించడం, ఆ వీడియో వైరల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి.

రావణుడు చెడ్డోడు కాకపోతే, రామ – రావణ యుద్ధం ఎందుకు జరిగినట్లు.? రావణుడు చెడ్డోడు కాకపోతే, రావణ వధ ఎందుకు జరిగినట్లు.?

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ‘విజయ దశమి’ పండుగ జరుపుకుంటాం. ప్రతియేటా విజయ దశమి రోజున రావణ దహనం.. అనే కార్యక్రమాన్నీ దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం.

నిజమే, రావణుడు పరమ శివుడి భక్తుడే.! కానీ, ఎలాంటి భక్తుడు.? ముల్లోకాల్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలనుకునే అహంకారి రావణుడు. అందుకే కదా, రావణ సంహారం జరిగింది.?

రావణ సంహారమెందుకు జరిగింది.?

రాముడి జీవిత భాగస్వామి సీతను మోహంతో లంకకు ఎత్తుకెళ్ళాడు రావణుడు. అందుకే కదా, రావణ సంహారం జరిగింది.!

పైగా, సాయి పల్లవి పోషిస్తున్న పాత్ర ‘రామాయణం’లో సీతా దేవి పాత్ర కదా.! సీతా దేవిని ఎత్తుకెళ్ళిన రావణుడెలా ‘మరీ అంత చెడ్డోడు కాకుండా’ పోతాడు.?

రావణుడు మరీ అంత చెడ్డవాడు కాకపోతే, ‘రామాయణ’లో ఏం చూపిస్తున్నట్లు.? రాముడే చెడ్డోడు.. రావణుడే గొప్పోడని చూపించబోతోందా ‘రామాయణ’ టీమ్.?

సాయి పల్లవి రాంగ్ కాస్టింగ్..

అసలే, ‘రామాయణ’లో సీతా దేవి పాత్రకి సాయి పల్లవి ‘రాంగ్ కాస్టింగ్’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీతా దేవి పాత్రకు ఆమె అస్సలు సూటవలేదనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.

రావణుడు మరీ అంత చెడ్డోడు కాదంటూ సాయి పల్లవి తాజాగా చేసిన వ్యాఖ్యలతో, సాయి పల్లవికి ‘శూర్పణఖ’ పాత్ర ఇచ్చి వుండాల్సిందేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంలో తప్పేముంది.?

పురాణేతిహాసాల్ని సినిమాలుగా తెరకెక్కించే క్రమంలో, నటీనటుల ‘క్యారెక్టర్’ కూడా పరిగణనలోకి తీసుకోవాలేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group