Rakul Preet Singh Ramayana.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో హవా చూపిస్తున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా అక్కడ హీరోయిన్లకు మంచి క్రేజ్ వుండడంతో, సీనియర్ హీరోయిన్లకు ఛాలెంజింగ్ రోల్స్ చేసే అవకాశాలు అందుతున్నాయ్.
ఆ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్ రోల్లో నటించబోతోంది. అదే రామాయణంలో శూర్పణఖ పాత్ర.
శ్రీరాముడ్ని మోహించబోయి లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకుని ఏడ్చుకుంటూ ప్రతీకారంతో అన్న రావణాసురుడి వద్దకు పరుగెత్తుకొచ్చే పాత్ర అది.
మొత్తం రామాయణం కథే మలుపు తిప్పే పాత్ర అది. బాలీవుడ్లో రణ్వీర్ కపూర్ ప్రధాన పాత్రలో రామాయణం బ్యాక్ డ్రాప్లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
Rakul Preet Singh Ramayana.. రకుల్ సూపర్ ఛాయిస్..
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడు కాగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్ర పోషిస్తోంది. ‘కేజీఎఫ్’ యష్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు.
గ్లామర్ తారగా ఇంతవరకూ రకుల్ ప్రీత్ సింగ్ నటనను చూసిన ప్రేక్షకులు శూర్పణఖగా నెగిటివ్ షేడ్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి పర్పామెన్స్ ఇవ్వబోతోందా.? ఈ సినిమాలో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి ఓ క్యారెక్టర్ తనకూ కొత్తే అనీ, అందుకే ఈ పాత్ర పోషించేందుకు తానే ఎంతో ఆసక్తిగా వున్నాననీ రకుల్ చెబుతోంది. ఫ్యూచర్లో ఇలాంటి మరెన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు సిద్ధంగా వున్నాననీ అంటోంది రకుల్.
కాగా, సోషల్ మీడియాలో సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ వేదికపై తళుక్కున మెరిసింది.
ఎల్లో ఎల్లో రకుల్ బ్యూటీఫుల్‌లో.!
ఈ తాజా ఎంట్రీలో చాలా చక్కగా పసుపు చీర కట్టుకుని, హుందా అయిన గెటప్‌లో ట్రెడిషనల్‌గా కనిపించి ఫ్యాన్స్‌ని ఎట్రాక్ట్ చేసింది.
తనదైన గ్లామర్‌తో సోషల్ మీడియాని హీటెక్కించే రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించి నెట్టింటికి షాకిచ్చింది.
అయితే, స్లీవ్‌లెస్ డిజైనర్ బ్లౌజు ధరించడంతో ట్రెడిషన్‌తో పాటూ, గ్లామర్‌కీ ఎక్కడా ఢోకా లేకుండా జాగ్రత్త పడింది రకుల్ ప్రీత్.
అందుకేనేమో, రకుల్ ప్రీత్ సింగ్ ఈ తాజా ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూతెగ వైరల్ అవుతున్నాయ్.
