Anupama Parameswaran Slipper Shot.. ఓ క్రికెటర్‌తో ఆమెకి ఎఫైర్ వుంది.! ఇద్దరూ సహజీవనంలో వున్నారు.! త్వరలోనే పెళ్ళి పీటలెక్కనున్నారు.!
ఓ యంగ్ హీరోని బుట్టలో పడేసింది.. రేపో మాపో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు.! తనకంటే చిన్నవాడైన ఓ తమిళ నటుడిని పెళ్ళాడనుంది.!
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ఇలాంటి గాసిప్స్ కుప్పలు తెప్పలుగా వింటూనే వున్నాం. దాదాపు అరడజనుకు పైగానే, ఎఫైర్స్ గాసిప్స్ అనుపమ చుట్టూ వున్నాయి.
అర డజను కాదు, డజనుకు పైగానే.. అంటారు ఇంకొందరు. సినిమా సెలబ్రిటీస్ అంటే గాసిప్స్ మామూలే.! సో, అనుపమ చుట్టూ వినిపించేవి కూడా అలాంటి పుకార్లేనా.? ఏమో, ఇదీ లాజికల్ పాయింటే.!
Anupama Parameswaran Slipper Shot.. చెంప పగలగొట్టిందా.? నిజమేనా.?
తాజాగా, అనుపమ మీద ఇంకో గాసిప్ వచ్చింది. కొన్నాళ్ళుగా ఓ యువ నటుడితో ప్రేమలో వున్న అనుపమ, సదరు హీరో చెంప పగలగొట్టి మరీ బ్రేకప్ చెప్పేసిందన్నది ఆ గాసిప్ సారాంశం.
ఇది నిజమేనా.? అంటే, నిజమనీ చెప్పలేం.. కాదనీ చెప్పలేం. ముందే చెప్పుకున్నట్లు సినీ సెలబ్రిటీస్ అంటే, నిప్పు లేకుండానే పొగ పుట్టుకొచ్చేస్తుంది.!
సక్సెస్ ఫెయిల్యూర్‌కి అతీతంగా అనుపమ పరమేశ్వరన్‌కి సినిమాల్లో అవకాశాలు వస్తుంటాయి. అదే మ్యాజిక్. కానీ, ఇక్కడో ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు.

ఆ ముఖ్యమైన విషయమేంటంటే, అనుపమ పరమేశ్వరన్ మంచి నటి. కళ్ళతోనే చాలా హావభావాల్ని అలవోకగా ప్రదర్శించేస్తుంటుంది.
మంచి డాన్సర్ కూడా.! గ్లామర్ విషయంలోనూ మొహమాటాలేవీ లేవు. సినిమాకి సంబంధించి 24 క్రాఫ్టుల మీదా పూర్తిగా అవగాహన వుంది అనుపమ పరమేశ్వరన్‌కి.
డైలాగుల విషయంలోనూ సహకరిస్తుందట. డైరెక్షన్ విషయంలోనూ తనదైన సూచనలు ఇస్తుందట అనుపమ పరమేశ్వరన్.
ఇక, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా పండించెయ్యడం కోసం, ఆయా హీరోలతో ఒకింత సన్నిహితంగా మెలుగుతుందట.. అదీ, ప్రొఫెషన్ పరంగానే సుమీ.!

సరదాగా వుండడమే తాను చేసిన తప్పా.? అని సన్నిహితుల వద్ద వాపోతుంటుంది అనుపమ పరమేశ్వరన్, తన మీద నెగెటివ గాసిప్స్ వచ్చినపపుడు.!
ఇంతకీ, అనుపమ పరమేశ్వరన్ నిజంగానే సదరు యంగ్ హీరోని చెప్పుతో కొట్టిందా.? ఎవరా యంగ్ హీరో.? చెన్నయ్‌లోని ఓ హోటల్‌లో ఇదంతా జరిగిందన్నది తాజా పుకారు.
అయితే, ఇంతవరకు ఈ పుకార్ల విషయమై అనుపమ పరమేశ్వరన్ స్పందించలేదు. అయితే, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తుందామె.
ఎందుకంటే, అనుపమ పరమేశ్వరన్ ఏదీ మనసులో దాచుకోదు.! అదే ఆమె ప్రత్యేకత.!
