Home » ప్రీతి ముకుందన్: వామ్మో ఇన్ని టాలెంట్సా ఈ బ్యూటీకి.!?

ప్రీతి ముకుందన్: వామ్మో ఇన్ని టాలెంట్సా ఈ బ్యూటీకి.!?

by hellomudra
0 comments
Preity Mukhundhan

Preity Mukhundhan Sensational Talents.. ఈ మధ్య ఈమెను ‘బ్లాస్ట్ గాళ్’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

అందుకు కారణం ఆమె రీసెంట్‌గా నటించిన ‘మ్లాస్ట్ మూవీనే. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజై మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ సినిమాలో నీలా పాత్ర పోషించిన ముద్దుగుమ్మే ప్రీతి ముకుందన్. సీనియర్ హీరో అర్జున్ సర్జాకి కూతురు పాత్రలో నటించింది ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ సినిమాలో ప్రీతి ముకుందన్ నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ‘ఓం భీమ్ భుష్’ సినిమాతో ప్రీతి ముకుందన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

Preity Mukhundhan Sensational Talents.. అందంతో పాటూ అల్టిమేట్ టాలెంట్స్.!

చాలా అందంగా కనిపిస్తుంది. గ్లామరస్‌గా కనిపించడంలో ఎలాంటి అభ్యంతరాల్లేవ్. వీటితో పాటూ, ఎనీ యాక్షన్.. హీరోతో పాటూ ఈక్వెల్‌గా ఇరగదీసేయగల సత్తా వుంది తెరపై ఈ ముద్దుగుమ్మకి.

నటించింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్‌గా ఓ స్సెషల్ ఐడెంటిటీని సంపాదించుకున్న ప్రీతి ముకుందన్ తెరపై చూపించే పర్‌ఫామెన్స్ ఓ ఎత్తైతే, ఆమెలో అసలు సిసలు టాలెంట్ వేరే లెవల్‌లో దాగుంది.

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.! అని కొందరు నటీ నటులు తమ ఎడ్యుకేషన్ టాలెంట్ గురించి చెప్పుకుంటుండడం వింటుంటాం కదా. కానీ, ప్రీతి ముకుందన్ మాత్రం డాక్టర్ కాదండోయ్. ఇంజనీర్.

ఎన్‌‌ఐటీ పుదుచ్చేరి యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది ప్రీతి ముకుందన్.

చదువులో సత్తా చాటుతూనే చిన్నతనం నుంచీ డాన్స్ తదితర ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లోనూ చాలా యాక్టివ్‌గా వుండేది.

అలాగే మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం పొందింది. అందుకే తెరపై యాక్షన్ ఎపిసోడ్స్ అంత అలవోకగా చేేసేయగలదు ప్రీతి ముకుందన్.

మార్షల్ ఆర్ట్స్ మెరుపు తీగ..

గతంలో ‘కన్నప్ప’ సినిమాలో గిరిజన యువతిగా యాక్షన్ బ్లాక్స్‌లో నటించినా, లేటెస్ట్‌గా ‘బ్లాస్ట్’ మూవీ కోసం సీనియర్ యాక్షన్ నటుడు అర్జున్‌తో సమానంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసేసినా.. అందుకు కారణం ఆమెకున్న మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యమే.

ఈ సినిమా తర్వాత ప్రీతి ముకుందన్‌కి చాలా మంచి గుర్తింపు దక్కింది. దాంతో ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లోనే కొన్ని హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కి కథలు సిద్ధం చేస్తున్నారట తెలుగు మేకర్లు.

వెండితెరపై సత్తా చాటేందుకు ఇన్ని టాలెంట్స్ వున్న ప్రీతి ముకుందన్ షూటింగ్స్ నుంచి ఏమాత్రం ఖాళీ టైమ్ దొరికినా చాలా ఇష్టంగా బుక్స్ చదివేస్తుందట.

అలాగే, అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తుందట. ఒక ఎన్‌ఐటియన్ అయ్యుండి ఇష్టమైన గవర్నమెంట్ సెక్టార్‌లో కానీ, స్టైలిష్‌గా కార్పొరేట్ సెక్టార్‌లో కానీ, మంచి ఉద్యోగం చేయాలనుకోకుండా సినిమాల్లో రాణించాలనుకుంది.

గట్స్ వుండాలి మరి..

అందుకు నిజంగా చాలా గట్స్ వుండాలి. సినిమాపై ఎంతో ప్యాషన్ వుండాలి. అది వుంది కాబట్టే ప్రీతి ముకుందన్ వెండితెరపై సక్సెస్ అయ్యింది.

ఫ్యూచర్‌లో ప్రీతి ముకుందన్ ఇటు తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లోనూ మంచి నటిగా ఎదిగే అవకాశాలు చాలా వున్నాయంటే అతిశయోక్తి కాదు.

సోషల్ మీడియాలోనూ ప్రీతి ముకుందన్ చాలా యాక్టివ్‌గా వుంటుంది. స్పెషల్ ఫోటో షూట్లతో ఫ్యాన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా హనీ కలర్ అవుట్ ఫిట్‌లో ప్రీతి ముకుందన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.

‘బ్లాస్ట్ గాళ్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రీతి ముకుందన్ ఈ పిక్స్ వైరల్ అవుతుండడం విశేషం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group