Billionaires Peninsula Ritu Varma.. కొన్ని ప్రదేశాలు ఎంత చూసినా తనివి తీరవు.
అలాగే కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ జ్క్షాపకాలు ఎన్నాళ్లయినా మనల్ని వీడి పోవు. అంతలా ఆయా తాలూకు ప్రదేశాలు మన మనసుల్ని ప్రభావితం చేస్తుంటాయ్.
అలాగే అందాల భామ రీతూ వర్మ కూడా తన టూర్ అనుభవాల్ని మనతో పంచుకుంటోంది. ఇటీవల రీతూవర్మ ఓ వెకేషన్‌కి వెళ్లింది. అక్కడి తన అనుభవాలను గొప్పగా వర్ణిస్తోంది.
ఇంతకీ రీతూ వర్మ విజిట్ చేసిన ఆ ప్లేస్ ఏంటో.! అంటారా.? సౌత్ ఫ్రాన్స్‌లోని సెయింట్ జీన్ క్యాప్ ఫెరాయ్. ఇది ప్రపంచంలోనే అత్యంత బ్యూటిఫుల్ అండ్ లగ్జరీయస్ ఐలాండ్.
Billionaires Peninsula Ritu Varma.. ఈ టూరు వెరీ కాస్ట్లీ గురూ.!
ఇది ఫ్రాన్స్‌లోని ప్రావాన్స్ ఆల్ప్స్ కోట్ డి ఆజూర్ ప్రాంతంలో నీస్, మరియు మొనాకో నగరాల మధ్య మధ్యధరా సముద్ర తీరంలో వుంది.
ఈ ప్రదేశంలో ఎన్నో ప్రత్యేకమైన ఆకర్షణ గల ప్రాంతాలున్నాయి. ట్రావెలింగ్ ఇష్టపడే వారు, ఆర్ధికంగా స్తోమత కలిగిన వారు ఈ ప్రదేశం సందర్శించడానికి చాలా చాలా బావుంటుంది.
ఎంతో విలాసవంతమైన విల్లాలు, మనసుకు హాయినిచ్చే సముద్ర తీరాలు, పురాతన కాలం నాటి అద్భుతమైన భవంతులు చూపరులను ఆకర్షించి మనసుకు ఉల్లాసాన్ని పంచుతాయ్.
ఇక్కడ బీచ్ సౌందర్యం అత్యంత సుందరమైనది. క్లిస్టర్ క్లియర్ వాటర్‌తో ఇక్కడి బీచ్‌లు సందర్శకుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయ్.

ముఖ్యంగా ప్లాజ్ డి లా పలోమా మరియు ప్లాజ్ డి పాసబుల్ వంటి బీచ్‌లు ఇక్కడ ప్రాచుర్యం పొందినవి. అంతేకాదు, ఇక్కడి పురాతనమైన లైట్ హౌస్ ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
విల్లా ఎప్రస్సీడీ రోతస్ చైల్డ్ ఇదో అద్భుతమైన ప్యాలెస్. సెయింట్ జీన్ క్యాప్ ఫెరాత్లోని చెప్పుకోదగ్గ ఫేమస్ ప్లేసెస్‌లో ఇదీ ఒకటి.
20వ శతాబ్ధంలో నిర్మించిన ఈ రోజ్ పింక్ ప్యాలెస్ చుట్టూ ఫ్రెంచ్, జపనీస్, ఫ్లోరెంటైన్ వంటి 9 రకాల డిఫరెంట్ డిజైన్లలో రూపొందించిన అద్భుతమైన గార్డెన్స్ వున్నాయ్. ఇవి సందర్శకులకు మర్చిపోలేని అనుభూతినిస్తాయ్.
కొన్ని శతాబ్ధాలుగా అనేక మంది రాజకుటుంబీకులు, అంతర్జాతీయ ప్రముఖులు, సినీ తారల్లో కొందరు మరియు వ్యాపారవేత్తలు వెకేషన్స్‌లో భాగంగా ఈ ప్రదేశాన్ని సందర్శించారు.
అందుకే ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశంలోనే అందాల భామ రీతూ వర్మ వెకేషన్‌కి వెళ్లింది.
అలా తాను విహరించిన ఫ్రాన్స్ వీధులు, అక్కడి ఫుడ్ మరియు అందమైన ప్రదేశాల్ని తన కెమెరాలో బంధించి తెగ సంబరపడిపోతోంది రీతూ వర్మ.
ఈ అందమైన ప్రదేశాలకు తన అందాలను జోడించి క్లిక్ అనిపించిన ఫోెటో పోజులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రీతూ వర్మ. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అప్పుడప్పుడూ సినీ తారలు ఇలాంటి ప్రదేశాలకు వెకేషన్స్ కోసం వెళుతూ వుండడం సహజమే.
షూటింగ్స్ నుంచి టైమ్ చిక్కినప్పుడే కాదు, అప్పుడప్పుడూ టైమ్ తీసుకుని మరీ తారలు వెకేషన్స్ కోసం ఇలాంటి ప్రదేశాలకు వెళ్తూ వుంటారు.
అయితే, ‘బిలీనియర్స్ పెనిసులా’ అని పిలవబడే ఈ కాస్ట్లీ టూర్‌కి మాత్రం అందరూ అంత ఈజీగా వెళ్లలేరు. ఇంత కాస్ట్లీ టూర్‌ని ఎంజాయ్ చేసే అవకాశం, అదృష్టం రీతూ వర్మకి రావడం నిజంగా ప్రత్యేకమే.
ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని సందర్శించిన రీతూ వర్మ కూడా ప్రత్యేకమే.!
