Home » చైతూపై శోబిత గుస్సా: పొగుడుతున్నావా.? ట్రోల్ చేస్తున్నావా.?

చైతూపై శోబిత గుస్సా: పొగుడుతున్నావా.? ట్రోల్ చేస్తున్నావా.?

by hellomudra
0 comments
Akkineni Nagachaitanya Sobhita Dhulipala

Nagachaitanya Sobhita Cooking Dinner.. భార్య చేతి వంట అంటే, ఏ భర్తకైనా సమ్‌థింగ్ వెరీ స్పెషల్ కదా.! మామూలుగా అయితే, ఇది రోజూ పరమ రొటీన్ వ్యవహారమే.

అదే, భార్య గనుక వర్కింగ్ విమెన్ అయితే, కొంచెం అరుదైన విషయం. పెళ్ళయిన రెండేళ్ళ తర్వాత, భార్య చేతి వంట తినే అవకాశం ఏ భర్తకైనా దొరికితే.?

ఔను, ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నటుడు అక్కినేని నాగచైతన్య. శోభిత ధూళిపాలతో వివాహం జరిగి, దాదాపు రెండేళ్ళవుతోంది నాగచైతన్యకి.

తాజాగా, సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేశాడు అక్కినేని నాగచైతన్య. ఆ ఫొటోలో, శోభిత తన భర్త కోసం కొన్ని డిషెస్ వండినట్లు కనిపిస్తోంది.

తన భార్య తన కోసం డిన్నర్ సిద్ధం చేసిందని తన కామెంట్ పోస్ట్ చేశాడు అక్కినేని నాగచైతన్య. దాంతో, సహజంగానే అక్కినేని అభిమానులు ‘వెరీ క్యూట్’ అంటూ స్పందిస్తున్నారు.

Nagachaitanya Sobhita Cooking Dinner.. రెండేళ్ళు పట్టిందా.. వంట చెయ్యడానికి..

ఇంకోపక్క, ‘ఏంటీ, రెండేళ్ళు పట్టిందా, డిన్నర్ కోసం..?’ అంటూ ఇటు నాగచైతన్యనీ, అటు శోభితనీ నెటిజనం ప్రశ్నిస్తున్నారు.

కాగా, భర్త అక్కినేని నాగచైతన్య కామెంట్‌పై స్పందించింది శోభిత. పొగుడుతున్నావా.? ట్రోల్ చేస్తున్నావా.? అని ప్రశ్నించింది శోభిత.!

‘ఏం డౌటా.? పొగడటం లేదు, ట్రోల్ చేస్తున్నాడు..’ అంటూ కొందరు నెటిజన్లు సరదాగా రిప్లయ్ ఇస్తున్నారు శోభిత ధూళిపాలకి.

Akkineni Nagachaitanya Sobhita Dhulipala
Akkineni Nagachaitanya Sobhita Dhulipala

మరోపక్క, ‘డౌట్ ఏమీ లేదు, నిన్ను పొడుతున్నాడు నాగచైతన్య..’ అంటూ ఇంకొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదే అదనుగా, ఏంటీ.. శోభిత ధూళిపాల ప్రెగ్నెంటా.? అంటూ, మీడియాలో పుకార్లు షికార్లు చేసేస్తున్నాయ్.! కాదేదీ, పుకారుకి అనర్హం.. అన్నట్లు తయారైంది వ్యవహారం.

అక్కినేని నాగచైతన్య తొలుత సినీ నటి సమంతని పెళ్ళాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వైవాహిక బంధం కొన్నాళ్ళకి విడాకులతో ముగిసింది.

సమంత ఆ తర్వాత, రాజ్ నిడిమోరుని పెళ్ళాడింది. ఈ మధ్యనే సమంత బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. దాంతో, శోభిత ఎప్పుడు బేబీ బంప్‌తో దర్శనమిస్తుందోనని మీడియా ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది.

ప్రెగ్నెన్సీ అనేది వ్యక్తిగత విషయం. పైగా, అది భార్యా భర్తలకు సంబంధించి అత్యంత ప్రత్యేకమైన సందర్భం. సమయం, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు కదా.! ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహమెందుకు ఎవరికైనా.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group