Nani Hit3 Review.. సినిమాల్ని రివ్యూలు చంపెయ్యగలవా.? నెగెటివిటీని లెక్క చేయకుండా హిట్టయిన సినిమాలు లేవా.? అదే సమయంలో, పాజిటివిటీ వున్నా, ఫ్లాపైన సినిమాలు లేవా.?
ఇదో పెద్ద డిబేట్ ప్రతిసారీ.! అసలు సినిమా రివ్యూ అంటే ఏంటి.? ఓ సమీక్షకుడు, సినిమా చూసి, తన అభిప్రాయాన్ని వివరించడమే రివ్యూ.!
అంటే, ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆ అభిప్రాయంతో ఎక్కువమంది ఏకీభవించొచ్చు, తక్కువమంది ఏకీభవించొచ్చు. అలానే, ఎక్కువమంది ఏకీభవించకపోవచ్చు, తక్కువమంది ఏకీభవించకపోవచ్చు కూడా.
నిజమే, సినిమాల్ని రివ్యూలు ‘హిట్’ చేయలేవు, ‘ఫ్లాప్’ కూడా చెయ్యలేవు. కాకపోతే, అదో పెద్ద చికాకు వ్యవహారంగా మారుతుంటుంది కొన్ని సార్లు.
సినిమా రివ్యూ.. అసలేంటి కథ.?
‘నేను రివ్యూ చూశాకే సినిమాకి వెళతా’ అనే ఆలోచన కొంతమందిలో వుంటుంది. అలాంటివాళ్ళ ఆలోచన, ఆయా సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది కూడా.
ఔను, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని బట్టి సినిమాలు చూడాలా.? వద్దా.? అని ఇతరులు నిర్ణయించుకుంటున్న పరిస్థితినీ చూస్తున్నాం.
అలా, సినిమాల మీద రివ్యూల ప్రభావం, సోషల్ మీడియాలో నెగెటివిటీ ప్రభావం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ‘వాల్దేరు వీరయ్య’ మీద భయంకరమైన నెగెటివిటీ వచ్చింది రివ్యూల పరంగా. కానీ, సినిమా హిట్టు.
కొన్ని మంచి సినిమాల్ని రివ్యూలు చంపేసిన మాట వాస్తవం. సో, తప్పు జరుగుతోంది. మరి, రివ్యూల్ని ఆపడమెలా.? ఇదే విషయమై నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రివ్యూల్ని ఎలా ఆపాలి.? ఎందుకు ఆపాలి.? అనేశాడు.
Nani Hit3 Review.. తెరపై బొమ్మ పడ్డాక.. ఆపలేం..
కరెక్టే కదా.? ఆపడం కుదరదు. అది అసాధ్యం. ఎందుకంటే, తెరపై బొమ్మ పడ్డాక, ఈ రోజుల్లో సినిమా రివ్యూని ఆపడం జరిగే పని కాదు. చూసే ప్రతి ప్రేక్షకుడూ, సమీక్షకుడే ఈ రోజుల్లో. అద్గదీ అసలు సంగతి.
నాని హీరోగా తెరకెక్కిన ‘హిట్-3’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు, నాని కూడా, కొన్ని సినిమాలకు తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొన్నాడు.
Also Read: తల్లివే కదా రోజా! పసి పిల్లలపై ‘ఆడింగి వెధవతనం’ తప్పని తెలీదా?
పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా మాట్లాడినందుకు, ఆయన్ని కొందరు దారుణంగా ట్రోల్ చేశారు. నాని సినిమాల్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు, అప్పట్లో ప్రభుత్వంలో వున్న కొందరు రాజకీయ నాయకులే హడావిడి చేశారు.
ఇదీ, సినిమా దుస్థితి.! రివ్యూలు మాత్రమే కాదు, సినిమాల్ని చంపేసే శక్తులు చాలానే వున్నాయ్.!