Home » జాతీయ రాజకీయాల్లోకి తమిళ సీఎం విజయ్: చక్రం తిప్పేస్తాడా.?

జాతీయ రాజకీయాల్లోకి తమిళ సీఎం విజయ్: చక్రం తిప్పేస్తాడా.?

by hellomudra
0 comments
TVK Vijay

TVK Vijay National Politics.. తమిళనాడు రాజకీయాల్లోకి సంచలనంలా దూసుకొచ్చారు సినీ నటుడు విజయ్. టీవీకే పార్టీ పెట్టి, అధికారంలోకి కూడా వచ్చారు.

ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ‘టీవీకే’ విజయ్, త్వరలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారట.!

జాతీయ రాజకీయాల్లోకి విజయ్ వెళితే, తమిళనాడులో టీవీకే బాధ్యతలు ఎవరు చేపడతారు.? తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారు.?

నిజానికి, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనన్నది మెజార్టీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.

అయితే, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అస్సలు పొంతన లేదు. ఒకప్పటి బలం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేదు.

భావి ప్రధాని రాహుల్ గాంధీ.. అంటూ, ఒకప్పుడు నినదించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అంత గట్టిగా ఆ నినాదాన్ని జపించడానికి ఇష్టపడని పరిస్థితుల్నీ చూస్తున్నాం.

TVK Vijay National Politics.. కేజ్రీవాల్, మమత.. సైడయిపోయారు..

ఓ దశలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని అంతా అనుకున్నారు. ఆ మాటకొస్తే, మమతా బెనర్జీ కూడా జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం.. అవుతారనే చర్చ జరిగింది.

ఇటీవలి బెంగాల్ ఎన్నికలతో మమతా బెనర్జీ రాజకీయ జీవితం దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింత్ కేజ్రీవాల్ హంగామా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో అటకెక్కిపోయింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీకే విజయ్‌ని ముందు పెడితే, జాతీయ రాజకీయాల్లో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం అవుతాడన్న చర్చ బీజేపీయేతర పార్టీల నుంచి జరుగుతోంది.

రాజకీయాల్లో ఎప్పుడెలా పొలిటికల్ ఈక్వేషన్స్ మారతాయో చెప్పలేం. సినీ నటుడిగా విజయ్‌కి జాతీయ స్థాయి గుర్తింపు వుందన్నది తెలిసిన విషయమే.

అదే, విజయ్ నేషనల్ పొలిటికల్ కెరీర్‌కి కూడా ఉపయోగపడుతుందని కొందరు అభిప్రాయపడొచ్చుగాక. అది మళ్ళీ వేరే చర్చ.

ఏమో గుర్రం ఎగరావచ్చు.!

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి తమిళనాడులో టీవీకే పార్టీ మరింత బలపడి, జాతీయ స్థాయిలోనూ టీవీకే పార్టీని విజయ్ విస్తరిస్తే.. పొలిటికల్ ఈక్వేషన్ మారిపోవచ్చు కూడా.!

రాజకీయ పార్టీ పెట్టడానికి భయపడ్డారు రజనీకాంత్.. రాజకీయ పార్టీ పెట్టినా నిలదొక్కుకోలేకపోయారు కమల్ హాసన్.. కానీ, విజయ్ ధైర్యం చేశారు.

ఏఐఏడీఎంకే, డీఎంకే లాంటి హేమాహేమీలైన రాజకీయ పార్టీల్ని టీవీకే విజయ్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ రెండు పార్టీల్నీ మట్టికరిపించేశారు. ఈ అనుభవం విజయ్‌కి జాతీయ రాజకీయాల్లో కలిసి రావొచ్చు.

వరుసగా మూడు సార్లు జాతీయ స్థాయిలో అధికారం అనుభవిస్తోంది బీజేపీ. నాలుగోసారి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి తప్పదు. అది టీవీకే విజయ్‌కి కొంత అనుకూలం.

సో, విజయ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి పరిస్థితులు అనుకూలంగానే వున్నాయన్నమాట.

అదే జరిగితే, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని, టీవీకే బాధ్యతల్ని విజయ్, తన స్నేహితురాలు త్రిష చేతిలో పెడతారేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group