బిగ్‌బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మరోసారి టైమొచ్చిందని తెలుస్తోంది. ఇంతవరకూ 15 మంది కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, మొదటి వారం హేమని ఎలిమినేట్ చేసి (Eesha Rebba Bigg Boss), ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని హౌస్‌లోకి పంపించారు.
టోటల్‌గా నలుగురు ఇంటి సభ్యులు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు ఇంతవరకూ. ఇక ఐదో ఎలిమినేషన్‌కి టైమొచ్చింది. ఈ లిస్టులో ఏడుగురు ఇంటి సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే. అయితే, ఈ వారం మరో వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఉండబోతోందనీ తెలుస్తోంది.
ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, హౌస్‌లోకి వెళ్లేందుకు ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగమ్మాయ్ ఈషారెబ్బ (Eesha Rebba Bigg Boss) ఒకరైతే, బెంగాళీ భామ శ్రద్ధాదాస్ ఇంకొకరు. వీరిద్దరిలో ఎవరో ఒకరు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట.
‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘అమీ తుమీ’, ‘బ్రాండ్ బాబు’, ‘అరవింత సమేత..’ తదితర చిత్రాలతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బకి ఉన్న ఫాలోయింగ్ సంగతి తెలిసిందే. ఫాలోయింగ్ ఎలా ఉన్నా, హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే, బిగ్ (Bigg Boss 3 Telugu) గ్యాంగ్‌ని బయట సన్నద్ధం చేసుకుంటున్నారు హౌస్ మేట్స్.
Click Here: హిమజ – అషూ రెడ్డి.. పడేది ఎవరి వికెట్.?
అలా ఒకవేళ ఈషా రెబ్బ (Eesha Rebba) ఇన్ అయ్యేలా అయితే, అందుకు తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకునే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇక శ్రద్ధా దాస్ (Shraddha Das) విషయానికి వస్తే, హాట్‌నెస్‌కి కేరాఫ్ ఆడ్రస్ ఈ పోరి. ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో తెరంగేట్రం చేసి, ‘ఆర్య 2’ తదితర చాలా చిత్రాల్లో నటించింది. నటిస్తూనే ఉంది. ఒకవేళ శ్రద్ధాదాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే, శ్రీముఖి తదితర హాట్ హౌస్ కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ అవుతుందనడం అతిశయోక్తి కాదేమో.
తొలి సీజన్‌లో హీరోయిన్ దీక్షా పంత్‌కి (Deeksha Panth) ఇలాగే వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఛాన్స్ దక్కింది. హౌస్‌లోకి వెళ్లాక, అంచనాలకు తగ్గట్లుగానే తనదైన హీరోయిన్ ఆటిట్యూడ్‌ని ప్రదర్శించింది. తర్వాత సీజన్‌లో పూజా (Pooja Ramachandran) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ధీటైన మజా ఇచ్చింది. ముచ్చటగా మూడో సారి ఆ హాట్ మజా ఏ ముద్దుగుమ్మతో ఇవ్వనున్నారో బిగ్‌బాస్ టీమ్ చూడాలిక.