Reddy Vs Reddy YSRCP వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆ పార్టీలో ఒకప్పటి నెంబర్ టూ విజయ సాయి రెడ్డి.. గత కొంతకాలంగా వైసీపీకి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి..
ఇంతేనా.? వైవీ సుబ్బారెడ్డి సహా.. లిస్టు తీస్తే, కీలక పదవుల్లో అందరూ రెడ్లే కనిపిస్తారు.! వైసీపీ నుంచి, పార్టీ పదవులకు సంబంధించి నియామకాల లిస్ట్ ఏదన్నా వస్తే, అందులో మెజార్టీ రెడ్లే వుంటారు.
ఇంతకీ, ఈ రెడ్ల మధ్య అయినా సఖ్యత వుందా.? అంటే, లేదాయె.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా విజయ సాయి రెడ్డిని సజ్జల రామకృష్ణా రెడ్డి కొట్టారట.
తన మీద 2022లో.. అదీ, పార్టీ ప్లీనరీ సందర్భంగా అందునా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దాడి గురించి తాజాగా విజయ సాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

దాడి చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదట. దాడికి గురైన తన పట్ల కనీసం జాలి కూడా ప్రదర్శించలేదట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇదీ విజయ సాయి రెడ్డి ఆవేదన.
విజయ సాయి రెడ్డి అంటే, రాజకీయాల్లోకి రాకముందు చార్టెర్డ్ అకౌంటెంట్.. వైఎస్ రాజశేఖర రెడ్డికీ అత్యంత సన్నిహితుడు.
పైగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ అప్పట్లో ఈ విజయ సాయి రెడ్డే చూసుకునేవారు.
ఈ క్రమంలోనే వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఏ2 నిందితుడు కూడా అయ్యారు విజయ సాయి రెడ్డి. ఏ1 నిందితుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో వుంటే, ఇదే కేసులో విజయ సాయి రెడ్డి కూడా దాదాపు అంతే కాలం జైల్లో వున్నారు.

విజయ సాయి రెడ్డి అప్రూవర్‌గా గనుక మారిపోతే.. అన్న చర్చ ప్రతిసారీ తెరపైకొస్తుంటుంది. ‘నేనే గనుక అప్రూవర్‌గా మారిపోయి వుంటేనా..?’ అంటూ తాజాగా తన లేఖాస్త్రంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అయినా, పార్టీలో ఈ భౌతిక దాడులేంటి.? విజయ సాయి రెడ్డి అంటే, అప్పట్లో రాజ్య సభ సభ్యుడు. జాతీయ స్థాయిలో అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర బోల్డంత పరపతి కూడా వుండేదాయనకి.
విజయ సాయి రెడ్డిపై భౌతిక దాడికి దిగేంతలా సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపీలో బలపడ్డారంటే.. యవ్వారం తేడాాగానే వుంది.
ప్రస్తుతం వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి నెంబర్ వన్ అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెంబర్ టూ.. అంటూ విజయ సాయి రెడ్డి ప్రకటించడం గమనార్హం.
అంటే, జగన్ రెడ్డి నుంచి సజ్జల రామకృష్ణా రెడ్డి చేతికి వైసీపీ పగ్గాలు అనధికారికంగా వచ్చేశాయన్నమాట.!
