Ananthika Sanilkumar Martial Arts.. ‘8 వసంతాలు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది నటి అనంతిక. అంతకు ముందూ ఆమె కొన్ని సినిమాలు చేసింది.. ఆ తర్వాతా చేసింది, చేస్తూనే వుంది.!
అనంతిక అంటే, కేవలం నటి మాత్రమే కాదు, అంతకు మించి.! కరాటేలో బ్లాక్ బెల్డ్ హోల్డర్ అనంతిక. అంతేనా, కేరళలో సంప్రదాయ యుద్ధ కళ కలరియపట్టులోనూ ఆమెకు ప్రావీణ్యం వుంది.
ఇంకా చెప్పుకుంటూ పోతే, సంప్రదాయ నృత్య రీతులైన భరతనాట్యం, కూచిపూడి.. వంటి వాటిల్లోనూ అనంతికకి ప్రావీణ్యం వుంది.
వెండితెరపై పద్ధతిగా కనిపించే పాత్రలే కాదు, అవసరమైతే గ్లామరస్ పాత్రల్లోనూ కనిపిస్తానంటోంది ఈ బ్యూటీ. అయితే, గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని బౌండరీస్ వుంటాయని చెప్పింది అనంతిక.
తెలుసు కదా ‘8 వసంతాలు’ సినిమా కోసం అనంతిక, యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఎంత బాగా నటించిందో. ముందు ముందు అలాంటి సినిమాలు మరిన్ని చేయాలనుకుంటోందిట.
Ananthika Sanilkumar Martial Arts.. డాన్స్, మార్షల్ ఆర్ట్స్‌తో అందం.. ఆనందం.. ధైర్యం.. ఆత్మవిశ్వాసం..
డాన్స్, మార్షల్ ఆర్ట్స్.. ఇవన్నీ తనను ఆరోగ్యంగా వుంచుతాయనీ, అందమంటే పైకి కనిపించే ముఖ వర్చస్సు, శరీరం రంగు.. శరీర సౌష్టవం మాత్రమే కాదు, మనిషి లోపల అందమైన మనస్సు, ఆలోచనలు ముఖ్యమని తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేసింది అనంతిక.
తెలుగులో ‘రొమాంచకం’ పేరుతో ఓ సినిమా చేసిన అనంతిక, దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఎల్లమ్మ’ సినిమాలోనూ కథానాయికగా నటించబోతోంది.
కథల ఎంపికలో తీసుకుంటున్న ‘ఎక్కువ జాగ్రత్తల’ వల్లే, తక్కువగా సినిమాలు చేస్తున్నట్లు అనంతిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఎక్కువ సినిమాలు చేసెయ్యాలనే తొందర లేదనీ, ‘8 వసంతాలు’ సినిమాలా, ప్రతి సినిమా నటిగా తనను మరింతగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునేలా చేయాలన్నదే తన ఆలోచన అంటోంది అనంతిక.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేది ఎవరి మీదా దాడి చేయడానికి కాదనీ, శక్తిని అలాగే ధైర్యాన్నీ మార్షల్ ఆర్ట్స్ ఇస్తాయనీ, అదే సమయంలో కాన్ఫిడెన్స్ ఇస్తాయని అనంతిక చెప్పుకొచ్చింది.
సంప్రదాయ నృత్యకారిణిగా ప్రదర్శనలు ఇవ్వాలని వుందట అనంతికకి. సినిమాకి సంబంధించిన వివిధ విభాగాలపై అవగాహన వున్నప్పుడు నటిగా రాణించడానికి ఆస్కారమేర్పడుతుందనీ అనంతిక చెబుతోంది.
