Home » స్థానిక ఎన్నికలు.! జనసేనకు ఓ గుణపాఠం.!

స్థానిక ఎన్నికలు.! జనసేనకు ఓ గుణపాఠం.!

by Mudra369 Editorial Desk
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Local Lesson.. రాజకీయాల్లో ‘పొత్తు’ అనేది సర్వసాధారణమైన వ్యవహారం. రెండు మూడు రాజకీయ పార్టీలు కలిసి, ఎన్నికల్ని ఎదుర్కొని, గెలిచి.. అధికార పీఠమెక్కడం కొత్తేమీ కాదు.

పది, పాతిక పార్టీలు కలిసి రాజకీయాల్లో పోటీ చేసిన సందర్భాలూ వున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ కేంద్రంగా.. ఆయా కూటములు ఎన్నికల్ని ఎదుర్కొంటుంటాయి.

జాతీయ స్థాయిలో కూటమి.. అంటే, చాలా పార్టీలు కలిసి ముందడుగు వేస్తుంటాయి. రాష్ట్రాల స్థాయిలో తక్కువ పార్టీలు జతకడుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.

కలిసి పోటీ చేసి, అధికార పీఠమెక్కాక.. తక్కువ కాలంలోనే ఆ కూటమి ముక్కలైపోవడమూ చూస్తుంటాం. పూర్తిస్థాయి కాలానికి అధికారంలో కలిసి కొనసాగడమూ చూస్తుంటాం.

సమిష్టిగా అధికారాన్ని పంచుకునే క్రమంలో ‘కుంపట్లు’ కూడా సర్వసాధారణమే. స్థానిక ఎన్నికల్లో పంపకాల దగ్గర ఈ లొల్లి చాలా ఎక్కువగా చూస్తుటాం.

Pawan Kalyan Local Lesson.. టీడీపీ – జన సేన – పంపకాల పంచాయితీ..

జనసేన – టీడీపీ – బీజేపీ మధ్య స్థానిక ఎన్నికల సమయంలో పంపకాల కుంపట్లు కూడా అలానే రాజుకున్నాయి. ప్రధానంగా టీడీపీ – జనసేన మధ్య ఈ ‘కుంపటి’ తారాస్థాయికి చేరింది.

టీడీపీ సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ. జన సేన కొత్త రాజకీయ పార్టీ.! పంపకాల విషయమై, జనసేనాని పంతం నెగ్గడంలేదు టీడీపీ వ్యూహాల ముందర.

వచ్చిన సీట్లతో సరిపెట్టుకోవడం తప్ప, జన సేన అదినేత పవన్ కళ్యాణ్‌కి ఇంకో ఆప్షన్ వుండట్లేదు. రాష్ట్రం కోసం.. అంటూ, ‘పొత్తు’ని చాలా కష్టంగా భరిస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఇది కాస్తా, క్యాడర్‌ని అయోమయంలో పడేస్తుందన్న విషయాన్ని జనసేనాని విస్మరిస్తున్నారా.? లేదంటే, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి మాత్రమే సరిపోదు..

ఉప ముఖ్యమంత్రిగా అత్యంత సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. గ్రామ స్థాయిలో జన సేన పార్టీకి బలం పెరగడానికి ఇదే కారణం.

కానీ, ఆ బలాన్ని నిరూపించుకునేది స్థానిక ఎన్నికల్లోనే కదా.? మరి, తగినన్ని సీట్లలో పోటీ చేయకపోతే జనసేనకి అది నష్టమే కదా.? అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన.

ఒక్కటి మాత్రం నిజం.. స్థానిక ఎన్నికల సీట్ల పంపకాల పంచాయితీ, జన సేన పార్టీకి ఓ గుణపాఠం కావాలి. 2029 సార్వత్రిక ఎన్నికల కోసం నాయకులు ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. అలానే, సేనాని కూడా.

అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎందుకొస్తోంది.?

సొంతంగా పోటీ చేయాల్సి వస్తే.? అన్న కోణంలో ఇప్పటినుంచే జనసేనాని తనదైన వ్యూహాల్ని సిద్ధం చేసుకోవాలి. పార్టీకి చెందిన కింది స్థాయి నాయకత్వం.. రాజకీయంగా బలోపేతమవ్వాల్సి వుంది.

చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు సీట్లు ఇచ్చుకుని, వాళ్ళు గెలిస్తే.. జనసేన గెలిచినట్లుగా సంబరపడటం హాస్యాస్పదం.

జన సేన పార్టీకి అభ్యర్థులే లేరన్న వైసీపీ విమర్శలకు జనసేన కార్యకర్తలు కౌంటర్ ఇచ్చుకోలేని దుస్థితి రావడం దారుణం. ఇది అత్యంత అవమానకరమైన పరిస్థితి అని జనసేనాని ఎప్పుడు గుర్తిస్తారో.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group