Home » ‘మా’ సినిమా.. ‘మీ’ కోసం కాదు.! వద్దు, ఈ సినిమాని చూడొద్దు.!

‘మా’ సినిమా.. ‘మీ’ కోసం కాదు.! వద్దు, ఈ సినిమాని చూడొద్దు.!

by Mudra369 Editorial Desk
0 comments
Vishwaksen Cult

Vishwaksen Cult Bloodbath.. సినిమా అంటే, అందరికీ వినోదాన్నిచ్చేది. అన్ని వర్గాల ప్రేక్షకులూ సినిమాని చూడాలి.!

అలా, అందరూ సినిమా చూస్తేనే, ఏ సినిమా అయినా వసూళ్ళ పరంగా మంచి విజయాన్ని అందుకుటుంది.

కానీ, ఈ మధ్య చాలా సినిమాలకు సంబంధించిన హీరోలు, నటీనటులు, దర్శక నిర్మాతలు ‘మా సినిమా మీ కోసం కాదు’ అని తెగేసి చెబుతున్నారు.

మొన్నటికి మొన్న, నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమా విషయలోనూ ఇదే మాట చెప్పాడు. అంతకు ముందు కన్నడ నటుడు ‘యష్’ కూడా ఇలానే చెప్పాడు.

తాజాగా, హీరో ‘విశ్వక్ సేన్’ తాను నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా ‘కల్ట్’ గురించి కూడా ఇలానే చెబుతున్నాడు.. ‘మా సినిమా మీ కోసం కాదు’ అని.!

Vishwaksen Cult Bloodbath.. పెద్దలకు మాత్రమే.. అంటే, ఒకప్పుడు బూతు సినిమాలు..

ఇక్కడ, ‘మీ కోసం’ అంటే, సగటు సినీ ప్రేక్షకుడు.. అనగా, సాధారణ సినీ ప్రేక్షకుడన్నమాట. ‘పెద్దలకు మాత్రమే’ అంటే, ఒకప్పుడు బూతు సినిమాలు. వాటికే ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చేది సెన్సార్ బోర్డ్.

ఇప్పుడలా కాదు, హింస.. మితిమీరిన హింస.. సినిమాల్లో ఎక్కువైపోయింది. గ్యాలన్ల కొద్దీ బ్లడ్ కలర్‌ని వాడితే తప్ప, సినిమాలు తీయలేకపోతున్నారు.

ఓటీటీ కంటెంట్ ఎరుపెక్కింది కొన్నాళ్ళ క్రితం. ఆ బాటలో ఇప్పుడు భారతీయ సినిమా.. ఆ బ్లడ్ కలర్‌లో మునిగి తేలుతోందన్నమాట.!

‘జెన్ జీ’ కోసం.. అంటూ, సినిమాలు పక్కదారి పట్టేస్తున్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ వచ్చింది. అందులోనూ రక్తపాతమే. ఆ సినిమాకీ ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది.

ఇదేం పైశాచికానందం.?

అయితే, కొన్ని సినిమాలకు మాత్రం థియేటర్ల నిర్వాహకులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు చిన్న పిల్లల్ని కూడా. చాలా థియేటర్లు మాత్రం, 18 ఏళ్ళ లోపు పిల్లల్ని సినిమాలకు అనుమతించడంలేదు.

ఇక, సగటు సినీ ప్రేక్షకుడూ ఈ తరహా రక్తమోడుతున్న సినిమాల్ని థియేటర్లలో చూసేందుకు ఇష్టపడటంలేదు. ఓటీటీలో వచ్చాక చూద్దామని లైట్ తీసుకుంటున్నారు.

కొత్తదనం అంటే, ఇప్పుడు రక్తపాతం మాత్రమే. పోనీ, ఇంతలా రక్తంలో సినిమాని ముంచేస్తే, ఆ సినిమా విజవంతమవుతోందా.? అంటే, అదీ లేదాయె.

సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలకు ఈ మధ్య జనాదరణ పెరుగుతోంది థియేటర్లలో. అయినాగానీ, దర్శక నిర్మాతలు అలానే నటీనటుల రక్త పిశాచి తత్వం మారడంలేదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group