YS Jagan Local Elections.. ‘ప్రతి కార్యకర్తకీ చెబుతున్నా.. కొడితే.. కొట్టించుకోండి..’ అంటూ వైసీపీ కార్యకర్తలకు బోడి సలహా ఇచ్చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఔను, ఇది ‘బోడి సలహా’నే.! కార్యకర్తలకి, పక్క రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకునే అవకాశం వుండదు. సొంతూరిలోనే బతుకు వెల్లదీయాల్సి వుంటుంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆవేశకావేశాలు సర్వసాధారణం. అయితే, ప్రజాస్వామ్యంలో హింసకు తావుండకూడదు. అయినాగానీ, నేరమయ రాజకీయాల్లో ఇవన్నీ తప్పడంలేదు.
వైసీపీ హయాంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు చోటు చేసుకున్న రక్తపాతం అంతా ఇంతా కాదు.!
మహిళల జాకెట్లలో చేతులు పెట్టి మరీ, వైసీపీ రౌడీ మూకలు ‘నామినేషన్ల పత్రాల్ని’ లాక్కున్న ఘటనల్ని చూశాం.
YS Jagan Local Elections.. అప్పట్లో ఆ హింసని అంతలా ప్రోత్సహించి..
అప్పట్లో అవన్నీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా ఆనందకరంగా కనిపించాయి. బాగా ఎంజాయ్ చేశారు ఆ తరహా రౌడీయిజాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్.
ఇప్పుడేమో, ‘టీడీపీ అధికారంలో వుంది.. కాబట్టి, వాళ్ళు కొడితే కొట్టించుకోండి..’ అంటూ, కార్యకర్తలకు ‘ఉచిత’ సలహా ఇస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వారానికోసారి మాత్రమే కర్నాటక రాజదాని బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు.
వచ్చి, పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడుతున్నారు.. లేదంటే, భారీ భద్రత నడుమ.. అప్పుడప్పుడూ తనకు మాత్రమే ప్రత్యేకమైన నిరసన కార్యక్రమాలు, జైలు యాత్రలు చేస్తున్నారు.
బెంగళూరుకి జగన్ పారిపోయినట్లు కార్యకర్తలకు..
కార్యకర్తలకు అలా కుదరదు కదా.. ఓడిపోయి బెంగళూరుకి జగన్ పారిపోయినట్లు, వైసీపీ కార్యకర్తలు సొంతూళ్ళు వదిలేసి, ఎక్కడికీ పారిపోలేరు.
పార్టీ అధినాయకత్వం, కార్యకర్తలకు అండగా వుండాలి. న్యాయ సహాయం అందించగలగాలి. ఇవేవీ చేయకుండా, ‘కొడతారు, కొట్టించుకోండి..’ అనడమేంటి.?
రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలి.. అవసరమైతే, కేంద్ర హోం శాఖకి ఫిర్యాదు చేయాలి.. రాష్ట్రపతి వద్దకూ వెళ్లాలి.. ఇది కదా, నాయకత్వమంటే.?
అన్నట్టు, వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా చాలా చోట్ల వైసీపీ నామినేషన్లు వేయలేకపోయిందట. అంటే, అక్కడ ఏకగ్రీవాలన్నట్లే కదా.!
ఏకగ్రీవాలు జరిగితే, వచ్చే ఎన్నికల్లో సీటు వుండదు.. అని హెచ్చరించారు వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకి. ఆ లెక్కన, పులివెందులలో వైఎస్ జగన్, సీటుని కోల్పోయినట్లేనా వైసీపీ నుంచి.?