Table of Contents
Attack On Tiger Shroff.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద కాల్పులు జరిగాయి. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
దురదృష్టవశాత్తూ టైగర్ ష్రాఫ్ కారు డ్రైవర్ ఈ ఘటనలో గాయాల పాలయ్యాడు.
ఇంతకీ, టైగర్ ష్రాఫ్ మీద ఎందుకు కాల్పులు జరిగాయి.? ఎవరిదీ కుట్ర.? ఈ విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
ముంబైలోని జుహూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గతంలో, టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్, దిశా పటానీ ఇంటి మీద కాల్పులు జరిపారు దుండగులు.
ఆ మాటకొస్తే, బాలీవుడ్ సినీ ప్రముఖులపై ఈ తరహా దాడులు కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ముంబై మాఫియా, సినీ తారల్ని టార్గెట్ చేయడం చాలా ఏళ్ళుగా నడుస్తున్న వ్యవహారం.
Attack On Tiger Shroff.. టైగర్ ష్రాఫ్ వివాద రహితుడు..
నిజానికి, టైగర్ ష్రాఫ్ వివాద రహితుడు. ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది లేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడే టైగర్ ష్రాఫ్.
తెలుసు కదా, టైగర్ సినిమాలకి తెలుగులోనూ ఫ్యాన్స్ వున్నారని. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా టైగర్ ష్రాఫ్‌కి బోల్డంతమంది అభిమానులున్నారు.
సినిమాల్లో అతని డాన్సులకీ, అతని ఫైట్స్‌కీ విపరీతమైన ఫాలోయింగ్ వుంది ఆడియన్స్‌లో. అందుకే, టైగర్ ష్రాఫ్ మీద కాల్పులు.. అనగానే, యావత్ భారత దేశం ఉలిక్కి పడింది.
అసలెందుకు టైగర్ ష్రాఫ్‌ని టార్గెట్ చేశారన్నదానిపై పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తుల్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పక్కాగా స్కెచ్ వేశారు..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఘాతుకానికి తెగబడిందన్నది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చిన అంశం. అయితే, కుట్రకి పథక రచన విదేశాల్లో జరిగిందన్న అనుమానాలూ లేకపోలేదు.
పక్కా స్కెచ్ వేసి, టైగర్ ష్రాఫ్ మీద కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. రెక్కీ నిర్వహించి, ఓ నిర్ధారణకు వచ్చి, ప్లాన్ ప్రకారం దాడి చేశారట.
ఈ ఘటనతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఉలిక్కిపడుతున్నారు. తమకూ అలాంటి పరిస్థితి వస్తే.? అని భయపడుతున్నారు కూడా.!
ఒకప్పుడు సినీ తారలంటే, అంతలా జనాల్లోకి వచ్చేవారు కాదు. ఇప్పటి పరిస్థితులు వేరు. జనంతో మమేకమవడానికి ప్రయత్నిస్తున్నారు.
జర జాగ్రత్త..
మరోపక్క, సినీ తారల మీదకు ఎగబడటం, వారిని ఇబ్బంది పెట్టడం.. ఈ తరహా పోకిరీతనం ఎక్కువైపోయింది.
హీరోయిన్లనైతే అసభ్యకరంగా తాకడం, హీరోలను గాయపర్చడం.. ఇవన్నీ అభిమానం ముసుగులో జరిగిపోతున్నాయి.
సందట్లో సడేమియా.. అభిమానుల ముసుగులో హంతకులు, ఇలాంటి కాల్పులకు తెగబడితే, సెలబ్రిటీలకు రక్షణ కల్పించడమెలా.? అన్నదానిపై పోలీసుల్లోనూ ఆందోళన నెలకొంది.
అభిమానుల కోసం, పోలీసుల సూచనల్ని పక్కన పెట్టి మరీ, సెలబ్రిటీలు గుమికూడి వున్న జనం మధ్యలోకి వస్తున్నారు.
మరోపక్క, తారల ప్రైవేటు భద్రతా సిబ్బంది కూడా, అభిమానుల్ని నిలువరించలేకపోతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. ప్రమాదాలు చెప్పి రావు.. హంతకులు ఎలాగైనా విరుచుకుపడే అవకాశాలెక్కువైపోయాయ్.
సో, సినీ ప్రముఖులు తమ భద్రత విషయమై అత్యంత జాగ్రత్తగా వుండాలి. ప్రైవేటు సెక్యూరిటీతోపాటు, పోలీసు శాఖ సూచనల్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే.