Home » సాత్వికా.! మా కోసం తెలుగు త్వరగా నేర్చేసుకో.!

సాత్వికా.! మా కోసం తెలుగు త్వరగా నేర్చేసుకో.!

by Mudra369 Editorial Desk
0 comments
Satvika Veeravalli

Satvika Veeravalli Rising Star.. సినీ ప్రముఖుల్ని సినీ తారలు అంటుంటాం.! స్టార్ హీరో, స్టార్ హీరోయిన్.. అంటే, అందనంత ఎత్తులో అత్యంత ప్రకాశవంతంగా వుంటారని.!

‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో తెరంగేట్రం చేసిన సాత్విక వీరవల్లి కూడా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది.!

దేశం గర్వించదగ్గ నటి అవుతుందంటూ ఏకంగా ‘జక్కన్న’ రాజమౌళి నుంచే ప్రశంసలందుకుంది సాత్విక వీరవల్లి.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అయితే, తన బ్యానర్‌లోనూ మూడు సినిమాలు ఆమెతో చేస్తున్నట్లు ప్రకటించేశారు.

Satvika Veeravalli Rising Star.. తొలి సినిమాకే.. ఈ స్థాయి స్టార్‌డమ్..

శ్రీదేవి, జయప్రద.. ఆ తర్వాత సాత్విక వీరవల్లి.. అంటూ, సాత్విక గురించి రాజమౌళి తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు.. అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

రాజమౌళి నుంచి ప్రశంస అంటే, ఆస్కార్ కిందనే లెక్క.. అంటారు కొందరు.! అందులో నిజం లేకపోలేదు కూడా. ‘మా కోసం త్వరగా తెలుగు నేర్చేసుకో’ అని రాజమౌళి ఆమెకు సూచించాడు.

అంటే, రాజమౌళి తన తదుపరి సినిమా కోసం సాత్విక వీరవల్లి పేరుని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాడనే కదా అర్థం.! ఇంతకంటే, ‘హై’ ఇంకేముంటుంది సాత్విక వీరవల్లికి.?

అన్నట్టు, సాత్విక వీరవల్లికి లుక్ టెస్ట్ చేసింది ఇటీవల, సుకుమార్ టీమ్. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

లుక్ టెస్ట్ అయిపోయింది.. ఫైనల్ కాల్..

లుక్ టెస్ట్ గురించి ఆల్రెడీ సాత్విక వీరవల్లి కూడా కన్ఫామ్ చేసింది. ‘నిజమే, లుక్ టెస్ట్ అయితే జరిగింది.. ఫైనల్ కాల్ ఏమవుతుందో వేచి చూడాలి..’ అని చెప్పిందామె.

మొదటి సినిమాకే అస్సలేమాత్రం బెరుకు లేకుండా నటించింది సాత్విక వీరవల్లి ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో.

వెస్ట్రన్ డాన్సులు, భారతీయ సంప్రదాయ నృత్యాలు.. వాట్ నాట్.. ఏదైనా సరే, డాన్స్ అద్భుతంగా చేసెయ్యగలదు సాత్విక.

తన సోషల్ మీడియాలో సాత్విక వీరవల్లి పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే, ఈ విషయం ఇట్టే అర్థమయిపోతుంది.

Also Read: 24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో వేసిన రోడ్ల మీద నడిచి వెళ్దామా.!?

అమెరికాలో పెరిగింది సాత్విక వీరవల్లి అని తెలుసు కదా.! ఆమె అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వెరీ క్యూట అండ్ లవ్లీ.!

తెలుగులో మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడుతోందిగానీ, బానే మాట్లాడుతోంది. తన తదుపరి సినిమాకి తెలుగులోనే డబ్బింగ్ చెప్పుకుంటాననీ ఆల్రెడీ సాత్విక మాటిచ్చేసింది కూడా.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group